చావు అనేది ఒక్కోసారి దోబూచులాడుతుంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న వాళ్లు, సడెన్ గా చనిపోతుంటారు. కొంత మంది చనిపోయిన తర్వాత లేచి నిల్చుంటారు. తాజాగా అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వృద్ధుడు చనిపోయాడని భావించి బంధు మిత్రులంతా కలిసి మృతదేహాన్ని బొందలగడ్డకు తీసుకెళ్లారు. కట్టెలు పేర్చి దానికి పడుకోబెట్టారు. సంప్రదాయాలు పూర్తి చేశారు. ఆ తర్వాత చితికి నిప్పు పెట్టారు. అప్పుడే అసలు కథ మొదలయ్యింది. బంధువులంతా అక్కడి నుంచి వెనుదిరిగాడు. వెంటనే చితి మీద పడుకున్న వ్యక్తి లేచి బయటకు దూకడంతో అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మంటల్లో నుంచి బయటకు దూకిన వృద్ధుడు
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ మిరాకిల్ ఘటన చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరణాన్ని గెలిచిన మనిషి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోను గమనిస్తే.. ఓ వృద్ధుడు.. వయసు సుమారు 60 నుంచి 70 ఏండ్లు ఉంటుంది. అతడు చనిపోయాడని భావించి, బంధువులు అంతా అతడిని స్మశానానికి మోసుకొచ్చారు. యథావిధిగా కట్టెలతో చితి పేర్చారు. దాని మీద పడుకోబెట్టారు. చుట్టూ నీళ్ల కుండ తిప్పి, తలకొరివి పెట్టించారు. కాసేపటికి చితికి నిప్పు అంటించారు.
చితి నుంచి బయటకు దూకిన వృద్ధుడు
అప్పటి వరకు చనిపోయినట్లు పడి ఉన్న వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. మంటల వేడికి ఒక్కసారిగా పైకి లేచి, చితి నుంచి కిందికి దూకాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన చూసి అక్కడ ఉన్న వాళ్లు అంతా షాక్ అయ్యారు. చాలా మంది అతడిని చూసి భయంతో వణికిపోయారు. మంటల తీవ్రతకు అతడి బట్టలు కూడా కాలిపోయి కనిపించాయి. చితి నుంచి బయటకు దూకుతున్న విజువల్స్ ను అక్కడే ఉన్న కొంత మంది సెల్ ఫోన్లలో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: ఘిబ్లీ ఫొటోల్లో దెయ్యాలు? లేని మనుషులు ఎలా కనిపిస్తున్నారంటూ ఆశ్చర్యం!
Read Also: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్, అవి చూపిస్తూ.. మనీ డిమాండ్, చివరికి..
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలు కామెంట్స్ పెడుతున్నారు. ‘వామ్మో ఇలాంటి షాకింగ్ వీడియో ఎప్పుడూ చూడలేదు” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “తాత చనిపోయి మళ్లీ బతికాడు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “తాత మరణాన్ని జయించాడు” అని ఇంకొంత మంది కామెంట్స్ చేశారు మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షలలాది వ్యూస్ సాధించింది. వేలకు పైగా లైక్స్ అందుకుంది.
Read Also: వ్యాన్ ఆపి, కోళ్లను కొన్న అనంత్ అంబానీ, నెట్టింట వీడియో వైరల్!