India : అతనో అమెరికన్. 24 ఏళ్ల పాలియాకోవ్. ఇండియా వచ్చాడు. కొబ్బరి బోండాం, కోకాకోలా టిన్‌తో కావాలనే ఆ దీవికి వెళ్లాడు. అందుకోసం పక్కాగా ప్లాన్ చేశాడు. లాస్ట్ ఇయరే ఆ ప్రయత్నం చేశాడు కానీ వర్కవుట్ అవలేదు. ఈసారి ఎలాగైనా అక్కడ అడుగుపెట్టాలని గట్టిగా ట్రై చేశాడు. అర్థరాత్రి బయలుదేరి తెల్లారేసరికల్లా అక్కడ దిగి.. కొన్ని ఫోటోలు, వీడియోలు తీసుకుని వచ్చేశాడు. కట్ చేస్తే.. ఆ అమెరికన్‌ను అరెస్ట్ చేశారు సీఐడీ. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటి? కొబ్బరిబోండాం, కోక్ టిన్ తీసుకెళ్లడం అంత ఘోరమైన క్రైమా? అసలు ఆ ప్లేస్‌లో అడుగుపెట్టడమే అతను చేసిన నేరమా? కంప్లీట్ డీటైల్స్……
ఆ దీవి అంత ప్రమాదకరమా?
అండమాన్‌లోని నార్త్ సెంటినెల్ ద్వీపం. అత్యంత అరుదైన గిరిజన తెగ నివసించే ఏరియా. అక్కడ బయటి వాళ్లెవరూ అడుగుపెట్టకూడదు. అది పూర్తిగా నిషేధిత ప్రాంతం. ఎవరైనా తమ దీవికి వస్తే క్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తారు అక్కడి ఆటవికులు. బయటి వ్యక్తులను శత్రువులుగా చూస్తారు. అది ప్రపంచంలోని చివరి ప్రీ-నియోలిథిక్ తెగ. ఆ జాతి అంతరించి పోకుండా ఉండేందుకు నార్త్ సెంటినెల్ ద్వీపాన్ని నో ఎంట్రీ జోన్‌గా ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ విషయం తెలిసి కూడా ఆ అమెరికన్ ప్రాణాలకు తెగించి అక్కడు వెళ్లడం తీవ్ర కలకలం రేపింది.
అమెరికన్ అసలేం చేశాడంటే..
పాలియాకోవ్ అనే అమెరికన్ మార్చి 26న పోర్ట్ బ్లెయిర్‌కు వచ్చాడు. సింగిల్‌గా, సీక్రెట్‌గా సెంటినెల్ దీవికి వెళ్లాలని భావించాడు. మార్చి 29న తెల్లవారుజామున 1 గంటలకు కుర్మా డేరా బీచ్ నుంచి బయలుదేరాడు. సెంటినెలీస్ కోసం నైవేద్యంగా కొబ్బరికాయ, కోలా టిన్ తీసుకెళ్లాడు. ఉదయం 10 కల్లా ఆ ద్వీపానికి చేరుకున్నాడు. గంట సేపు సముద్రంలోనే బోట్‌లో ఉండి విజిల్ ఊదడం చేశాడు. అక్కడి ఆదిమవాసులను తన దగ్గరకు రప్పించేందుకు అలా చేశాడని అంటున్నారు. ఆ తర్వాత ధైర్యం చేసి ఓ 5 నిమిషాల పాటు ద్పీపంలో దిగాడు. తనతో తెచ్చిన కొబ్బరికాయ, కోలాను సముద్రం ఒడ్డున ఉంచాడు. బైనాక్యులర్‌తో ఆ దీవినంతా పరిశీలించాడు. ఆ ప్రాంతాన్ని వీడియో రికార్డ్ చేశాడు. వెంటనే అక్కడి నుంచి తిరిగి వచ్చేశాడు. అతని అదృష్టం బాగుండి.. పాలియాకోవ్ అక్కడి ఆటవికుల కంట పడలేదు. అందుకే ప్రాణాలతో బతికిపోయాడు.
Also Read : తలుపునకు అడ్డుగా పెట్టిన రాయి.. కట్ చేస్తే, దాని విలువ 10 కోట్లు..
స్థానికులు, అతను ఉన్న హోటల్ సిబ్బంది ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ మోటార్ బోట్, జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతని దగ్గర ఉన్న GoPro కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే.. అతను నార్త్ సెంటినెల్ ద్వీపంలో దిగిన వీడియో రికార్డై ఉంది.
అండమాన్ & నికోబార్ దీవులు (ఆదిమ తెగల రక్షణ) సవరణ నిబంధన, 2012 ఉల్లంఘనలతో పాటు, 1946 నాటి విదేశీయుల చట్టం కింద పాలియాకోవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ప్రోటోకాల్ ప్రకారం, అమెరికన్ అరెస్టు సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ, యుఎస్ రాయబార కార్యాలయానికి అందించి.. తదుపరి విచారణ జరుపుతున్నారు. ఆ అమెరికన్ ఉత్సుకతతో ఈ పని చేశాడా? ఇంకేదైనా కుట్ర కోణం దాగుందా? అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.