OTT Movie : ఈమధ్య కొరియన్ సిరీస్ లు బాగా ఫేమస్ అయిపోయాయి. వీళ్ళు సుత్తి లేకుండా సిరీస్ లను సరదాగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే ఈ సిరీస్ లను మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ ఫాంటసీ సిరీస్ లో ఒక అమ్మాయి టైం ట్రావెల్ చేసి, రాజుల కాలంలోకి వెళ్తుంది. అక్కడ జరిగే క్రేజీ సన్నివేశాలతో ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ చివరివరకూ సరదాగా సాగిపోతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
దక్షిణ కొరియా రొమాంటిక్ ఫాంటసీ వెబ్ సిరీస్ పేరు ‘స్ప్లాష్ స్ప్లాష్ లవ్’ (Splash Splash love). 2015 లో వచ్చిన ఈ సిరీస్ ఫాంటసీ, రొమాన్స్, చారిత్రక అంశాల నేపథ్యంలో రూపొందింది. ఈ సిరీస్ కేవలం రెండు ఎపిసోడ్‌లతో చిన్నదిగా ఉన్నప్పటికీ, దాని ఆకర్షణీయమైన కథాంశం, పాత్రల మధ్య కెమిస్ట్రీ కారణంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకునే సన్నివేశాలతో ఈ స్టోరీ ముందుకు వెళ్తుంది. ఇది కిమ్ సీల్-గీ, యూన్ డూ-జూన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒక రొమాంటిక్ కామెడీ సిరీస్. ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ దాన్-బీ అనే హైస్కూల్ సీనియర్ స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. ఆమె లెక్కల సబ్జెక్ట్ లో బలహీనంగా ఉంటుంది. ఒకరోజు కాలేజీ ప్రవేశ పరీక్షను రాసే ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. పరీక్ష రోజున, ఆమె ఒత్తిడికి గురై పరీక్షా కేంద్రం నుండి పారిపోతుంది. ఒక ఆట స్థలం (play ground) లోకి వెళ్తుంది. అక్కడ వర్షంలో ఒక నీటి మడుగులోకి అడుగు పెట్టడంతో, ఆమె అనుకోకుండా టైమ్ ట్రావెల్ చేస్తుంది. 1500 ఏళ్లు వెనక్కి వెళ్ళి జోసియన్ యుగంలోకి చేరుకుంటుంది. జోసియన్ రాజ్యంలో, ఆమె యువ రాజు లీ డో ని కలుస్తుంది. ఈ సమయంలో రాజ్యం తీవ్రమైన కరువుతో, మరోపక్క వ్యాధులతో బాధపడుతూ ఉంటుంది. లీ డో ఒక తెలివైన పాలకుడి గా మంచి పేరు తెచ్చుకొని ఉంటాడు. అతను గణిత శాస్త్రంలో అధునాతన జ్ఞానాన్ని నేర్చుకోవాలని కోరుకుంటాడు. దాన్-బీ ఆధునిక కాలం నుండి వచ్చిన ఒక విద్యార్థిగా, తన లెక్కల నైపుణ్యాలను ఉపయోగించి రాజుకు సహాయం చేస్తుంది. ఆమె రాజ్యంలోని సమస్యలను పరిష్కరించడానికి గణిత సూత్రాలను బోధిస్తుంది. ఈ క్రమంలో రాజుతో ప్రేమలో పడుతుంది. అయితే, దాన్-బీకి తన కాలానికి తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతుంది. ఆమె జోసియన్‌లో ఉండి రాజుతో తన ప్రేమను కొనసాగించాలా లేక ఆధునిక కాలంలో తన జీవితాన్ని కొనసాగించాలా అనే సందేహంలో పడుతుంది. చివరికి ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, మీరుకూడ తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఫాంటసీ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.