Arrowhead Tiger: రాజస్థాన్ రాష్ట్రంలోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లోని ప్రసిద్ధ ఆడపులి ఆరోహెడ్ 11 సంవత్సరాల వయస్సులో రెండు రోజుల క్రితం మృతిచెందింది. ఆరోహెడ్ బ్రెయిన్ ట్యూమర్ కారణం చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని ఈ ప్రముఖ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని వన్యప్రాణి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లు, అటవీ అధికారుల హృదయాలను కలచివేసింది. ఆరోహెడ్, తన గొప్ప వంశపారంపర్యం, అసాధారణ శక్తితో ఆకట్టుకునే వేట నైపుణ్యంతో ప్రసిద్ది చెందింది. ఆరోహెడ్ మృతిచెందడానికి రెండు రోజుల ముందు ప్రముఖ వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ సచిన్ రాయ్ తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిగో వీడియో..
?utm_source=ig_embed&ig_rid=a988afba-479c-4343-8a29-c656fab984e2
ఆరోహెడ్ రణథంబోర్ నేషనల్ పార్క్‌లోని 2, 3, 4, 5 జోన్లలో ఎక్కువగా కనిపించేదని పార్క్ ఫీల్డ్ డైరెక్టర్ అనుప్ కేఆర్ తెలిపారు. ఈ జోన్ ప్రాంతాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకుందని వివరించారు. దీని నుదుటిపై ఉన్న బాణం ఆకారంలోని గుర్తుతో దీనికి ఆరోహెడ్ అని పేరు వచ్చింది. ఈ సింబల్ దానిని సులభంగా గుర్తించేలా చేసింది. ఆరోహెడ్ 2014 ఫిబ్రవరిలో జన్మించింది. ఇది రణతంబోర్ పార్కులో ప్రసిద్ది గాంచిన మచ్లి కుటుంబానికి చెందిన పులి. మచ్లీని రణథంబోబర్ రాణి అని, మొసలి వేటగాడు అని పిలిచేవారు. ఆ ధైర్యమే ఆరోహెడ్‌కు వారసత్వంగా వచ్చింది.
అరోహెడ్ తన జీవిత కాలంలో నాలుగు సార్లు గర్భం దాల్చి, మొత్తం 10 పిల్లలకు జన్మనిచ్చింది. వీటీలో ఆరుగురు ఇప్పటికీ బతికే ఉన్నాయి. ఆరోహెడ్ చివరిసారిగా 2023 లో పిల్లలకు జన్మినిచ్చింది. అయితే అది చనిపోయే రెండు రోజుల ముందు పార్కులోని పదంతలాబ్ సమీపంలో కెమెరామేన్ సచిన్ రాయ్ అరోహెడ్ చివరి నడకను వీడియో తాశాడు. ఈ ఫొటోగ్రాఫర్, అరోహెడ్‌ను చిన్నతనం నుంచే అనుసరిస్తున్నాడు. పులి జీవిత ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేశాడు. ఈ వీడియోలో అరోహెడ్ తీవ్ర అనారోగ్యంతో నడవడానికి ప్రయత్నిస్తోంది. అది అతి కష్టంగా నడుస్తున్న దృశ్యం యానిమల్ లవర్స్ హృదయాలను కలిచివేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ: CBI Jobs: సీబీఐలో 4500 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నెలకు రూ.15వేల స్టైఫండ్ భయ్యా
Fare thee well Arrowhead 💔
.
Did not go gentle into that good night ,
Raged against the dying of light,
Always a blazing star in our hearts
.
I was incredibly lucky to witness an extremely frail Arrowhead take down a crocodile – a testament to her indomitable resilience and grit pic.twitter.com/BFfwZBruaw— Anirudh Laxmipathy (@anirudh123) June 19, 2025
జూన్ 19న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. 63 లక్షల వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు ఆరోహెడ్ ధైర్యం, గౌరవం, విషాదకర అంతానికి తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు. ఇంత గొప్ప పులి ఈ విధంగా కనిపించడం చూడడానికి ఇబ్బంది కరంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి పులి చివరి క్షణాల్లో ధైర్యంగా ఉందని కామెంట్ చేసుకొచ్చాడు.
ALSO READ: Viral video: థాయిలాండ్‌కు వెళ్లిన భారత పర్యాటకులు ఇలా చేశారేంటి? వీడియో వైరల్..