Viral News: పెళ్లాం సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో భార్య ఊరికెళ్లిందని భర్త ఆనందం అంతా ఇంతా కాదు. అదే భార్య తిరిగి వస్తే ఆ సినిమాలో హీరోలు శ్రీకాంత్, వేణులు చేసే కామెడీ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలోని దృశ్యాలు.. ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఇదంతా రీల్ అయితే రియల్ గా ఓ భర్త చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లాం ఊరేళ్లిందని ఇదేమి సంబరం అంటూ అందరూ నోరెళ్ల బెట్టారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జరిగింది. ఇంతకు ఆ భర్త చేసిన అసలు నిర్వాకం ఏమిటంటే..
సాధారణంగా పుట్టింటికి వెళ్లాలని ప్రతి మహిళకు ఉంటుంది. మెట్టినింటి నుండి పుట్టింటికి వెళ్లేందుకు అధిక ఆసక్తి కనబరుస్తారు. ఏడాదిలో ఒకసారైనా పుట్టింటి గడప తొక్కాల్సిందే. అలాంటిది ఓ మహిళ వెళ్లక వెళ్లక పుట్టింటికి వెళ్ళిందట. ఇన్ని రోజులు తగిన స్వేచ్చ లేదని అనుకున్నాడో ఏమో కానీ, ఆమె భర్త, భార్య ఊరికెళ్లిందని సంబరాలు జరిపాడు. బెంగుళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. రోజూ సిటీలో తన స్వంత ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే మొన్న ఆటో ఎక్కిన ప్రయాణికులందరూ.. అరెరె ఇదేమిటి అంటూ అతడ్ని ప్రశ్నించారు.
ఇంతకు వారు ఆటోలో ఏం చూశారంటే.. మనోడు ఆటోలో తెల్ల కాగితంపై ఇలా రాసి అతికించాడు. హమ్మయ్య.. నా భార్య పుట్టింటికి వెళ్ళింది.. నాకెంతో సంతోషంగా ఉందంటూ రాశాడు. అంతేకాదు భార్య పుట్టింటికి వెళ్లిందని బిస్కెట్స్, చాక్లెట్లు ఆటోలో ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కిన ప్రతి ప్రయాణికుడికి వాటిని అందజేశాడు. కొందరైతే చాక్లెట్స్ పంపిణీ ఎందుకంటూ అడిగి, అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఆటోలో రాసిన తెల్ల కాగితాన్ని ఒక నెటిజన్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Also Read: Chilkuru Balaji Rangarajan Case: రంగరాజన్ కేసులో లేటెస్ట్ అప్ డేట్.. అసలు విషయం చెప్పిన డీసీపీ
ఇప్పుడు ఆ ఫోటో వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు.. ఇదేమి వెరైటీ ఆనందం అంటూ కామెంట్స్ చేస్తుండగా, మీ భార్యకు ఈ విషయం తెలిస్తే.. నీకు చుక్కలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లాం ఊరెళితే మరీ ఇంత సంబరపడాలా? అసలు ఇప్పుడు నువ్వు ఏం చేద్దామని ఇంత ఆనంద పడుతున్నావంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహిళలు ఇంట్లో ఉంటే వారి విలువ తెలియదని, నీకు నీ భార్య విలువ తెలిసే రోజు జస్ట్ తొందర్లోనే ఉందంటూ మహిళలు కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఆటో డ్రైవర్ తన భార్య పుట్టింటికి వెళ్లిందని ఊరంతా ప్రచారం చేశాడు.. చాక్లెట్లు పంచి సంబరాలు జరుపుకున్నాడు. తన నిర్వాకం భార్యకు తెలిస్తే.. ఆ తర్వాత ఏమౌనో మరి!