E-Paper
Advertisement

Deadly Spin Bowl: ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’.. ఇదేం బాల్ రా బాబు.. స్వింగ్ కి కంగుతిన్న బ్యాటర్

Deadly Spin Bowl: ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’.. ఇదేం బాల్ రా బాబు.. స్వింగ్ కి కంగుతిన్న బ్యాటర్
Viral Video Ball OF the Century

Deadly Spin Bowl Video goes Viral: షేన్ వార్న్.. ప్రపంచంలో ఈ పేరు తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండడు. అది 1993 యాషెస్ సిరీస్. ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ మైక్ గ్యాటింగ్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. షేన్ వార్న్ సంధించిన బాల్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. కుడి చేతి వాటం అయిన గ్యాటింగ్ వార్న్ స్పిన్ ఉచ్చులో చిక్కుకొని బలయ్యాడు. లెగ్ స్టంపం అవతల పడిన బాల్, గ్యాటింగ్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.

ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలో బాల్ ఆఫ్ ది సెంచరీగా పేర్కొంటారు. చాలా మంది స్నిన్నర్లు వార్న్‌లా వేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కాని ప్రస్తుతం ఒక వీడియో తెగ వైరల్ అవుతదోంది. ఇది వార్న్ బౌలింగ్‌ను మించి ఉందని నెటిజన్లు వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

కువైట్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ చేసిన డెలివరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, అది సృష్టించిన పిచ్చి మలుపుతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. వైరల్ వీడియో క్లిప్‌లో, కువైట్ జెర్సీతో ఉన్న ఒక స్పిన్నర్ అత్యంత ఉల్లాసంగా బౌలింగ్ చేస్తూ బ్యాటర్‌ను బోల్తా కొట్టించాడు.

Read More: ఈ లొల్లి మళ్లీ మళ్లీ చూడలేం..! అంతరించిపోతున్న ఈ కళను ఓ సారి చూసేయండి

లెజెండరీ ముత్తయ్య మురళీధరన్, హర్భజన్ సింగ్‌ల కలయికను పోలిన చర్యతో, స్పిన్నర్ తన సంచలనాత్మక డెలివరీతో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులను కలవరపరిచాడు. బ్యాటర్ లెగ్ స్టంప్‌ను తగిలిని ఈ బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల పిచ్ చేసి లెగ్ స్టంప్‌ను గిరాటేసేలా చేసాడు. అంతే బ్యాటర్ ఆశ్చర్యపోయాడు. ఈ డెలివరీని ఇప్పటికే చాలా మంది కొత్త ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా పేర్కొన్నారు.

కాగా చాలా మంది వార్న్ డెలివరీనే బాల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణిస్తున్నారు. వార్న్ లెజెండని పేర్కొంటున్నారు. యాషెస్‌కు ఈ మ్యాచ్‌కు చాలా తేడా ఉందని అంటున్నారు నెటిజన్స్.

కాగా వార్న్ టెస్ట్ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు. 145 టెస్టులు ఆడి 25.41 సగటుతో మొత్తం 708 వికెట్లతో తన కెరీర్‌ను ముగించాడు, ఇందులో అద్భుతమైన 37 ఐదు వికెట్లు, 10 పది వికెట్ల హాల్‌లు ఉన్నాయి.

800 టెస్ట్ వికెట్లు తీసిన మురళీధరన్ తర్వాత టెస్ట్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, సుదీర్ఘ ఫార్మాట్‌లో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వార్న్ నిలిచాడు.

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×