BigTV English

Viral : వామ్మో.. పార్కింగ్ ఫీజు గంటకు రూ. వెయ్యా..!

Viral : వామ్మో.. పార్కింగ్ ఫీజు గంటకు రూ. వెయ్యా..!

Bengaluru parking


Bangalore UB Mall : బెంగళూరులోని యూబీ సిటీ షాపింగ్ మాల్ ప్రీమియం పార్కింగ్ పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఒక్కో వాహనానికి గంటకు రూ.1,000 వసూలు చేస్తోంది. పార్కింగ్ ఫీజు రూ. 1000 సూచించే సైన్ బోర్డు ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

బెంగళూరు సిటీని యూబీ సిటీ షాపింగ్ మాల్ యాజమాన్యం శాన్ ఫ్రాన్సిస్కోగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది అని ఒక యూజర్ వ్యంగ్యంగా స్పందించారు. సింగపూర్, హాంగ్ కాంగ్, లండన్, దుబాయ్ లా బెంగళూరును తీర్చిదిద్దుతామని మీరేమైనా వాగ్దానం చేశారా? అని మరొకరు కామెంట్ చేశారు. ప్రీమియం పార్కింగ్.. అంటే ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోయారు. కారుకు ఏమైనా ప్రత్యేకంగా స్నానం చేయిస్తారా? లేక డైమండ్ ఫేషియల్ చేస్తారా? అని నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


READ MORE : చితక్కొట్టుకున్న బెస్ట్ ఫ్రెండ్స్..!

మరికొందరు మరింత హస్యాస్పదంగా సోషల్ మీడియా మాదిరిగా కారుకు బ్లూ టిక్ వస్తుందా అని కూడా అడుగుతున్నారు. ప్రీమియం పార్కింగ్ అంటే ఏమిటి? మీ దగ్గర కారు పార్కింగ్‌తో ఒక నెలలో డబ్బు రెట్టింపు చేసే చిట్కాలు ఏమైనా ఉన్నాయా? అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఇది కొత్తదేమీ కాదని.. ఇది 2012 నుంచి ఉందని కొందరు సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు.

ఈ లెక్కను రోజుకు సగటున 10 గంటలకు గంటకు రూ.1000 చొప్పున రోజుకు రూ.10,000 ఇస్తారనమాట. దీని ప్రకారం.. ఒక నెలకు రూ.3 లక్షలు, సంవత్సరానికి రూ.36 లక్షలా?. పెట్టుబడిపై ఆశించిన రాబడి సంవత్సరానికి 20 శాతమైతే.. ఆ భూమి ఖరీదు 36 లక్షలు / 0.2 = రూ .1.8 కోట్లు ఉండాలి అని ఒక యూజర్ పేర్కొన్నాడు. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ ప్రీమియం పార్కింగ్ ఫీజును సమర్థించారు.

ఇందులో పెద్ద విషయమేముంది. జుగార్, ఫెరారీ యజమానులు గంటకు రూ. 1000 ఈజీగానే చెల్లిస్తారు. మరి ఆల్టో 800, వ్యాగన్ ఆర్ మొదలైన కార్ల యజమానులు తమ వాహనాలను ఇంట్లో పార్క్ చేసి నడుచుకుంటూ రావాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 1 Cr+ ధర ఉన్న వాహనాన్ని కలిగి ఉన్న వ్యక్తి 1kను పరిగణనలోకి తీసుకోడు, బదులుగా అతను తన వాహనం యొక్క భద్రత కోసం చూస్తాడు” అని ఒక యూజర్ రాశారు.

READ MORE :  కొడితే.. గూబ గుయ్ అంది.. వైరల్ వీడియో!

నేను బెంగళూరులోని యూబీ సిటీలో పనిచేస్తున్నాను. చాలా అరుదుగా 1 లేదా 2 కార్లు కనిపిస్తాయి. వెనుక పార్కింగ్ బే ఉండడంతో వాహనాలన్నీ అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. రేట్లు నామమాత్రంగా ఉంటాయి. ఈ చిత్రం ద్వారా మాల్ అధికారులు ప్రవేశ ద్వారం వద్ద బాడీ పార్క్ లు లేకుండా చూస్తారు అని యూబీ సిటీలో పని చేసే ఒక ఉద్యోగి సమర్థించుకున్నారు.

ఇది ప్రీమియం సేవల ప్యాకేజీ కావచ్చు. నేను గత వారాంతంలో యూబీ సిటీకి వెళ్లాను. ఇతర మాల్‌ల మాదిరిగానే సాధారణ బేస్మెంట్ పార్కింగ్ కోసం సాధారణ ఛార్జీలనే చెల్లించాను అని ఒక యూజర్ వెల్లడించాడు.

Tags

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×