Bihar News: రైళ్లలో నిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. ప్రయాణీకులు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా దొంగలు రెచ్చిపోతారు. క్షణాల్లో విలువైన వస్తువులను మాయం చేస్తారు. దొంగలు ఎక్కువగా కిటికీ పక్కన కూర్చున్న వాళ్లను టార్గెట్ చేస్తుంటారు. సెల్ ఫోన్లు, ఒంటి మీద ఉన్న నగలను కిటికీ లో నుంచి చేయిపెట్టి లాక్కెళ్తారు. తాజాగా బీహార్ లో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే, దొంగ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అడ్డంగా బుక్కయ్యాడు. రైలుకు వేలాడుతూ నరకనం అనుభవించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్ లో షాకింగ్ ఇన్సిడెంట్
బీహార్ లోని భగల్ పూర్ రైల్వే స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ రైల్వే స్టేషన్ లో రైలు కదిలేందుకు రెడీ అయ్యింది. స్టేషన్ మాస్టర్ పచ్చ జెండా ఊపడంతో నెమ్మదిగా కదులుతోంది. ఈ సమయంలో ఓ దొంగ కిటికీలోకి చేతులు పెట్టి రైల్లోని వ్యక్తి సెల్ ఫోన్ కొట్టేయాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే చెయ్యి కిటికీలోకి పెట్టాడు. కానీ, దొంగ కంటే ముందు ప్రయాణీకులు అలర్ట్ అయ్యారు. దొంగ చేతులను గట్టిగా పట్టుకున్నారు. అప్పటికే రైలు కదలడం మొదలయ్యింది. స్పీడ్ అందుకుంది. ఎటూ తప్పించుకోలేక కిటికీని పట్టుకుని అలాగే వేలాడుతూనే ఉన్నాడు. వదిలితే ప్రాణాలు ఎక్కడపోతాయోనని నరకయాతన అనుభవించాడు.
మరో స్టేషన్ వచ్చే వరకు రైలుకు వేలాడిన దొంగ
దొంగతనం చేయాలనుకున్న స్టేషన్ నుంచి మరో స్టేషన్ వరకు అతడిని ప్రయాణీకులు అలాగే పట్టుకున్నారు. బయటకు వేలాడుతూ అరిగోస పడ్డాడు. పైగా రైల్లోని ప్రయాణీకులు దొంగ తల మీద కొట్టడం మొదలు పెట్టారు. నెక్ట్స్ స్టేషన్ వచ్చే వరకు అతడిని కొడుతూనే ఉన్నారు. తర్వాతి స్టేషన్ కు ముందు రైలు స్లో కావడంతో కొంత మంది ప్రయాణీకులు దిగి దొంగను రైల్వే పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అనే పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే బోలెడు వ్యూస్ సాధించింది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Near Bhagalpur Bihar, a snatcher was snatching a passenger's phone from a moving train, but he could not succeed in it and the passenger caught the snatcher and carried him hanging for about a kilometer pic.twitter.com/zUDUk8FRra
— BIMARU Kumari – North Hindian Parivar 🥺 (@BimaruKumari) April 8, 2025
Read Also: సికింద్రాబాద్ ప్లాట్ ఫారమ్స్ మూసివేత, ఇక రైళ్ల రాకపోకలు అన్నీ అక్కడి నుంచే!
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. జీవితంలో ఇదే చివరి దొంగతనం కావచ్చని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “పాపం పండింది.. ప్రయాణీకులకు చిక్కాడు. ఇకపై దొంగతనం అనే ఆలోచన వస్తేనే తడిసిపోవాల్సిందే” అని ఇంకో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. “ఇంత జరిగినా వాడు మారుతాడని చెప్పలేం. బీహార్ లో చాలా మంది ఇలాగే ఉంటారు. దొరకడం, తన్నులు తినడం, మళ్లీ దొంగతనాలు చేయడం కామన్” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇలాంటి వారికి కాస్త కోటింగ్ గట్టిగా ఇస్తే, దొంగతనం చేయాలనుకునే వారికి కూడా వెన్నులో వణుకుపుడుతుంది” అని వేరొక నెటిజన్ రాసుకొచ్చాడు.
Read Also: చర్లపల్లి సమీప మెట్రో స్టేషన్ ఏమిటీ? అక్కడ రైలు దిగితే సిటీకి చేరడం ఎలా?