BigTV English
Advertisement

Kalyan Ram: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జాతరే.. తమ్ముడు వస్తున్నాడు.

Kalyan Ram: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జాతరే.. తమ్ముడు వస్తున్నాడు.

Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా అర్జున్ S/O వైజయంతి. అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పథకాలపై అశోక్ వర్ధన్, సునీల్ బలుసు,ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమా థియేటర్ లో సందడి చేయనుంది. మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా గడుపుతుంది. ఇందులో భాగంగా చిత్తూర్ లో జరిగిన ఈవెంట్ లో సినిమా సెకండ్ సింగిల్ ‘ముచ్చటగా బంధాలే’ అనే సాంగ్ ని లాంచ్ చేశారు. ఈ వేదికపై కళ్యాణ్ రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఫాన్స్ తో పంచుకున్నారు..


నందమూరి ఫ్యాన్స్ కి పండగే..

అర్జున్ S/O వైజయంతి సినిమాలోని రెండవ పాటను బుధవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘సినిమా ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ భాగం కానున్నారు. ఈ నెల 12వ తేదీన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. చీఫ్ గెస్ట్ గా తమ్ముడు వస్తాడు. మీ అందరితో ఆరోజు తప్పకుండా మాట్లాడతాడు. మరిన్ని విశేషాలను మనం ఆరోజు మాట్లాడుకుందాం అని’ తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని చెప్పడంతో.. అక్కడ ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా కేకలు వేశారు. జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ‘మాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ కి వచ్చి, నార్నీ నితిన్ ని అభినందించాడు. ఇప్పుడు అన్న కోసం మరోసారి తమ్ముడు రానున్నాడు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లను ఒకే స్టేజి మీద చూసి చాలా కాలం అయింది. ఈ వార్త నందమూరి అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పొచ్చు.


రిలీజ్ కి ముందే కథ చెప్పిన హీరో..

అదే ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ కథ గురించి చెప్పారు. ప్రతి ఇంట్లో తల్లి మనసు కి హత్తుకునే విధంగా ఈసినిమా ఉంటుంది. తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అమ్మ చేయి పట్టుకొని నడిపించిందే.. మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ కోసం, మనం ఎంత బాధ్యతగా ఉండాలని చెప్పే కథే ఈ అర్జున్ S/O వైజయంతి అని తెలిపారు. వేసవి కానుకగా ఈ సినిమా ఈనెల 18వ తేదీన థియేటర్లో సందడి చేయనుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత విజయశాంతి చేస్తున్న సినిమా కావటం మరో విశేషం. ఈసినిమాలో బలమైన ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని, టాలీవుడ్ లో ఇలాంటి క్లైమాక్స్ మీరు ఎప్పుడూ చూసి ఉండరని హీరో కళ్యాణ్ రామ్ సైతం కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత టాలీవుడ్ లో ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో.

Also read: Ram Charan Peddi : ‘పెద్ది’ హిందీ టీజర్ చూశారా? ఆ వాయిస్ ఎవరిదో గమనించారా?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×