BigTV English

Chicken Or Egg: కోడి ముందా? గుడ్డు ముందా? ఫైనల్ గా ఆన్సర్ దొరికేసింది!

Chicken Or Egg: కోడి ముందా? గుడ్డు ముందా? ఫైనల్ గా ఆన్సర్ దొరికేసింది!

ఇంతకాలం కోడి ముందా? గుడ్డు ముందా? అంటే చెప్పడం కష్టం అని భావించే వాళ్లం. క్రిటికల్ సమయాల్లో కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఏం చెప్తాం? అనే వాళ్లం. కానీ, శాస్త్రవేత్తలు ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం వెతికారు. గుడ్డు కాదు, కోడే ముందు అని తేల్చారు. ఒకప్పుడు పక్షులు, సరీసృపాలు గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చారు. జెనీవా విశ్వవిద్యాలయం లోని జీవ రసాయ శాస్త్రవేత్త మెరైన ఒలివెట్టా నేతృత్వంలోని బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.


ముందు కోడి, తర్వాత గుడ్లు..

బిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న ఇచ్థియోస్పోరియన్ సూక్ష్మజీవి అయిన క్రోమోస్ఫేరా పెర్కిన్సీ అనే ఏకకణ జీవి అధ్యయనం ఆధారంగా పరిశోధకులు కోడే ముందు అని తేల్చారు. కోడి గుడ్లు పెట్టడానికి ముందు పిండం లాంటి నిర్మాణాలను ఏర్పరుచుకునే సామర్ధ్యం జంతువుల ఆవిర్భావానికి ముందే ఉండవచ్చని పరిశోధకులు తేల్చారు.  పరిస్థితులు అనువుగా మారే వరకూ అవి తమ పిల్లలను గర్భంలోనే దాచుకొనేవని కనుగొన్నారు. స్విస్ ఫెడరల్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బయోకెమిస్ట్ ఒమయా డుడిన్ సైతం కోడి ముందా? గుడ్డు ముందా? అనే విషయంపై కీలక విషయాలు వెల్లడించారు. “సి. పెర్కిన్సీ ఒక ఏకకణ జాతి అయినప్పటికీ, భూమిపై మొదటి జంతువులు కనిపించకముందే జాతులలో బహుళ సెల్యులార్ కోఆర్డినేషన్, డిఫరెన్సియేషన్ ప్రక్రియలు ఉన్నట్లు వెల్లడిస్తున్నది. C. పెర్కిన్సీ పాలింటోమీ అనే ప్రక్రియకు లోనవుతుంది. ఇది జంతువుల పిండం అభివృద్ధి  ప్రారంభ దశలను పోలి ఉంటుంది.  ఆ తర్వాత నెమ్మదిగా గుడ్డుగా మారినట్లు తెలిపారు.


జీవపరిణామం తొలినాళ్లల్లో గుడ్లతో పోల్చితే.?

సి. పెర్కిన్సీ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం గుడ్ల కంటే ముందే కోళ్లు ఏర్పడ్డట్లు పరిశోధకులు అంచనాకు వచ్చారు. అంతేకాదు, తొలినాళ్లల్లో కనిపించిన గుడ్లకు నేటి గుడ్లకు పోలిక అస్సలు లేదన్నారు. పరిణామం చెందుతూ వివిధ రకాల జంతు జాతులుగా అభివృద్ధి చెందాయన్నారు.  సో, గుడ్డు కంటే ముందే కోడి వచ్చినట్లు భావిస్తున్నారు. మనం ఇప్పుడు చూసే గట్టి పెంకుల లాంటి గుడ్లు డైనోసార్ల కాలంలోనే ఏర్పడ్డట్లు గుర్తించారు. అంతకు ముందు కోడి పిల్లలు జన్మించేవని అంచనాకు వచ్చారు. అవి ఇచ్థియోస్పోరియన్ సూక్ష్మజీవి అయిన క్రోమోస్ఫేరా పెర్కిన్సి అనే ఏకకణ జీవి నుంచి ఆవిర్భవించినట్లు భావిస్తున్నారు. అవి అభివృద్ధి చెంది కోళ్లుగా ఏర్పడ్డంతో పాటు ఆ తర్వాత పరిణామ క్రమంలో ఈ రోజు మనం చూస్తున్న విభిన్న జంతు రాజ్యానికి దారితీసినట్లు వెల్లడించారు. గుడ్డు ఏర్పడ్డానికి ముందు మనుషుల మాదిరిగానే పిల్లలకు జన్మనిచ్చేవి. ఆ తర్వాత గుడ్డు ఏర్పడి పొదగడం మొదలు పెట్టినట్లు జెనీవా పరిశోధకులు తేల్చారు. అయితే.. కోడి కంటే ముందు గుడ్డే వచ్చినట్లు గతంలో పలువురు పరిశోధకులు వెల్లడించారు. అసలు వాస్తవం ఏంటనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.

Read Also: పిల్లాడిని వెంటబెట్టుకొని జొమాటో డెలివరీ.. మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×