EPAPER

Viral News: 8 వేల డ్రోన్లతో కళ్లు చెదిరే లేజర్ షో.. గిన్నీస్ రికార్డులూ బద్దలు, అలా ఎలా చేశారయ్యా బాబు!

Viral News: 8 వేల డ్రోన్లతో కళ్లు చెదిరే లేజర్ షో.. గిన్నీస్ రికార్డులూ బద్దలు, అలా ఎలా చేశారయ్యా బాబు!

World’s Largest Drone Display: పొరుగు దేశం చైనా టెక్నాలజీని ఏ రేంజ్ లో ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ మూల సరికొత్తగా ఎలక్ట్రానిక్ వస్తువు మార్కెట్లోకి వచ్చినా, క్షణాల్లో దానికి డూప్లికేట్ తీసుకురావడంలో ముందుంటుంది. చైనాలోని టీనేజర్లు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకుంటారు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, 5జీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ టెక్ దిగ్గజంగా ఎదుగుతోంది. తాజాగా జరిగిన చైనా నేషనల్ డే వేడుకలో చైనా నిర్వహించిన లేజర్ షో చూసి ప్రపంచం అబ్బురపడింది. కళ్లు చెదిరే లేజర్ విన్యాసాలు ఏకంగా గిన్నీస్ రికార్డులు కొల్లగొట్టాయి.


10,197 డ్రోన్లతో అబ్బర పరిచే లేజర్ షో

చైనా తాజాగా నేషనల్ డే నిర్వహించింది. ఈ సందర్భంగా తమ ఆయుధ సంపత్తితో పాటు టెక్నాలజీలో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ప్రపంచంలో ఏదేశానికి సాధ్యంకాని రీతిలో లేజర్ షో నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకేసారి 10,197 డ్రోన్లను ఆకాశంలోకి ఎగురవేసి కళ్లు చెదిరేలా లేజర్ విన్యాసాలు చేయించింది. చైనాలోని ప్రముఖ కట్టడాలతో పాటు చారిత్ర అంశాలను ఆకాశంలో సృష్టించి వారెవ్వా అనిపించింది. డ్రోన్ ల వినియోగంలోనూ తామే రారాజులం అని నిరూపించే ప్రయత్నం చేసింది.


బే పార్క్ పై లేజర్ అద్భుతం

బే పార్క్ మీద ‘సిటీ ఆఫ్ స్కై, మేబే షెన్‌జెన్’ థీమ్ పేరుతో  చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన నిర్వహించింది. మొత్తం 10,197 డ్రోన్లు ఏకకాలంలో ఆకాశంలోకి వెళ్లి తేలియాడే ‘స్కై సిటీ’ని ప్రదర్శించాయి. స్కై సిటీ లోని అద్భుతాలు అన్నింటినీ ఈ లేజర్ షోలో ఆవిష్కరించాయి. డ్రోన్ షోలు మాత్రమే కాదు, 300కి పైగా సాంస్కృతిక, పర్యాటక  ప్రదేశాలను ప్రదర్శించింది. నేషనల్ డే సందర్భంగా వరుసగా ఏడు రోజుల పాటు డ్రోన్ ప్రదర్శనలను కొనసాగిస్తోంది. చైనా లేజర్ షోపై టెస్లా, స్పేస్‌ఎక్స్ CEO ఎలన్ మస్క్ ప్రశంసల వర్షం కురిపించారు. చైనా ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం అంటూ అభినందించారు.

1000కి పైగా గిన్నీస్ రికార్డులు నెలకొల్పిన డ్రాగన్ కంట్రీ

తాజాగా ఆకాశంలో అద్భుత లేజర్ షో నిర్వహించి చైనా కొత్త గిన్నీస్ బుక్ ఆఫర్ వరల్డ్ రికార్డ్స్ ను సాధించింది. ఈ రికార్డులతో చైనా మరో ఘనత సాధించింది. చైనా ఏకంగా 1,000 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను అందుకున్న దేశంగా ఘనత సాధించింది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత పొడవైన చెక్కను చెక్కడం, వేగంగా కళ్లకు గంతలు కట్టడం సహా బోలెడు రికార్డులు ఉన్నాయి. చైనా ఏ దేశానికి సాధ్యంకాని రీతిలో వరుస గిన్నీస్ రికార్డులతో దూసుకుపోతోంది. ప్రతి ఏటా పదుల సంఖ్యలో  చైనా నుంచి గిన్సీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం దరఖాస్తులు అందుతున్నట్లు గిన్నీస్ ప్రతినిధులు తెలిపారు.

Read Also:  వీడు మహా కంత్రి.. టికెట్ లేకుండా విమానాల్లో జర్నీ, అదెలా సాధ్యం? సెక్యూరిటీ ఏం చేస్తోంది?

Related News

Viral News: రూ.835 ఖర్చుకు.. రూ.1.2 కోట్లు, వారెవ్వా లక్కంటే ఈ గుమ్మడి కాయల వ్యాపారిదే

Watch Video: మంటల్లో కాలుతున్న కారు జనాల మీదికి దూసుకొస్తే, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Animal Food Robber: సాలరీ రూ.20 లక్షలు.. కక్కుర్తిపడి జంతువుల ఆహారం దొంగతనం చేసేవాడు!

Viral Video: చాయ్ అమ్మే పిల్ల.. ఈమె వీడియోలు భలే వైరల్!

Viral Video: అయిదుగురు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న వరుడు.. వైరల్ వీడియో

Fact Check News: అబ్బాయిల కోసం ఎగబడుతున్న మేఘాలయ అమ్మాయిలు.. నిజంగా అంత కరువుతో ఉన్నారా?

Shocking Video: అమెరికాను వణికిస్తున్న మిల్టన్.. సుడిగాలిలో చిక్కుకున్న విమానం.. వీడియో వైరల్

Big Stories

×