అదేదో సినిమాలో డీజే టిల్లు మోసం అనేది బనియన్ కు తెలియకుండా డ్రాయర్ లాగేసినట్లు ఉండాలంటాడు. అచ్చంగా ఇదే ఫాలో అయ్యాడో చైనీ యువకుడు. ఒకే ఒక్క విమాన టికెట్ బుక్ చేసి, ఎయిర్ పోర్టులో ఏకంగా రూ. 75 లక్షల విలువైన ఫుడ్ తినేశాడు. అదీ 300 రోజుల పాటు. చివరకు ఈ విషయం బయటపడటంతో ఎయిర్ పోర్టు అధికారులు షాకయ్యారు. చర్యలు తీసుకుంటామని ముందుగా ప్రకటించినా.. అతడు నిబంధనల ప్రకారమే భోజనం చేయడంతో ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఒక చైనీస్ వ్యక్తి ఫస్ట్ క్లాస్ విమాన టికెట్ కొనుగోలు చేశాడు. ఈ టికెట్ ఉన్నవాళ్లు ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఉచిత భోజనం చేసే అవకాశం ఉంటుంది. ఆ టికెట్ ను ఉపయోగించి ప్రతి రోజు షాంగ్జీ ప్రావిన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని VIP లాంజ్‌లోకి వెళ్లేవాడు. భోజనం చేసిన తర్వాత, తన టికెట్ ను మరుసటి రోజుకు రీ బుక్ చేయించుకునే వాడు. అలా ఒకటి, రెండు రోజులు కాదు, ఏకంగా 300 రోజులు రీ బుక్ చేసుకున్నాడు. ప్రతి రోజు VIP లాంజ్‌లోకి వెళ్లి భోజనం చేయగానే, టికెట్ మరుసటి రోజుకు మార్చుకునేవాడు. ఇలా 300 సార్లు కంటే ఎక్కువ సార్లు చేశాడు. మొత్తం రూ. 75 లక్షల విలువ చేసే భోజనాన్ని ఉచితంగా తినేశాడు.
ఈ విషయం బయటకు ఎలా వచ్చిందంటే?
తూర్పు చైనా ఎయిర్ లైన్స్ అధికారులు అనుకోకుండా ఈ విషయాన్ని గుర్తు పట్టారు. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎయిర్ లైన్ అధికారులు తమ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. కానీ, అతడు నిబంధనల ప్రకారమే భోజనం చేయడం వల్ల చర్యలు తీసుకోలేకపోయారు. అయితే, మరోసారి ఇలా చేయకుండా అతడిపై చర్యలు తీసుకున్నాడు. చివరగా, నిబంధనల ప్రకారం అతడు తన విమాన ప్రయాణాన్ని కొనసాగించకపోవడం వల్ల టికెట్ పై పూర్తి వాపసు పొందాడు. మొత్తానికి తను టికెట్ కోసం పెట్టిన డబ్బులు వెనక్కి రావడంతో పాటు ఏకంగా ఏడాది పాటు ఫ్రీ VIP ఫుడ్ తినేశాడు.
ఏడాది ఫ్రీగా రైలు ప్రయాణం చేసిన యువకుడు
ఇక బ్రిటన్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఎడ్ వైజ్ అనే యువకుడు.. ఉచిత ప్రయాణం చేసేందుకు ఓ తెలివైన ఉపాయం ఆలోచించాడు. అలాగని రైల్వే నిబంధనలకు వ్యతిరేకంగా జర్నీ చేయలేదు. ఏడాది రూ. 1.06 లక్షల ఛార్జీలు సేవ్ చేసుకున్నాడు. అతడి ట్రిక్ రైల్వే అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయారు. బ్రిటన్ రైల్వే రూల్స్ ప్రకారం.. రైలు 15 నిమిషాలు ఆలస్యం అయితే, 25% డబ్బులు రీఫండ్ చేస్తారు. 30 నిమిషాల ఆలస్యానికి 50% వాపసు అందిస్తారు. గంట దాటితే పూర్తి రీఫండ్ అందిస్తారు. ఎడ్ వైజ్ ఈ రూల్స్ ను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. రైళ్లు ఏ సమయంలో ఆలస్యం అవుతాయో ముందుగానే తెలుసుకునేవాడు.వాటికి అనుగుణంగా టికెట్లు బుక్ చేసుకునే వాడు. అనుకున్నట్లుగానే రైళ్లు ఆలస్యం కాగానే రీఫండ్ క్లెయిమ్ చేసుకునేవాడు.
Read Also: భారతీయ రైల్వేకు 172 ఏళ్లు, 1853 నుంచి ఎన్నో అద్భుతాలు!