BigTV English

NC 24 : నాగ్ చైతన్య పౌరాణికం సినిమా.. భారీ సెట్‌లో షూటింగ్ స్టార్ట్.. ఎక్కడంటే..?

NC 24 : నాగ్ చైతన్య పౌరాణికం సినిమా.. భారీ సెట్‌లో షూటింగ్ స్టార్ట్.. ఎక్కడంటే..?

NC 24 : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య, కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. విరూపాక్ష తరువాత కార్తీక్ దండు చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య 24వ సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ ప్రొడక్షన్, సుకుమార్ రైటింగ్ సంస్థ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగచైతన్య డిఫరెంట్ పాత్రని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా థండేల్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ఇప్పుడు విరుపాక్ష ఫేమ్ డైరెక్టర్ తో మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నిమిషాలలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ చిత్రం గురించి మూవీ టీం ఒక అప్డేట్ ఇచ్చింది. ఆ వివరాలలోకి వెళితే..


షూటింగ్ అక్కడ స్టార్ట్ ..

NC24 పాన్ ఇండియా సినిమాగా మైతికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. కార్తీక్ దండు పురాణాల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్ ను రెడీ చేస్తున్నారు. నాగచైతన్యని ఒక కొత్త లుక్ లో, పౌరాణికం బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ చూపించనున్నారు. తాజగా ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు సమాచారం. ఈ సినిమా కోసం, అన్నపూర్ణ స్టూడియోలో భారీగా సెట్ వేసినట్టు సమాచారం. నాగచైతన్య త్వరలోనే ఈ సెట్లో అడుగుపెట్టనున్నారు.ఇక్కడ మొదటి షెడ్యూల్ 15 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ 2024 డిసెంబర్ లో మొదలవ్వాల్సి వున్నఎందుకో ఆలస్యం అయింది. కారణం ఏదైనా 2025 ఏప్రిల్ లో మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా మొదలైందన్న విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


విజువల్ ట్రీట్..

ఇక నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా 2024 నవంబర్ లో ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో నాగచైతన్య లుక్స్ చూసాక అభిమానులలో అంచనాలను పెంచేశాయి. థండేల్ సినిమా తో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు నాగ చెతన్య. ఈ సినిమాలో సాయిపల్లవి తోనటించి బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం, లక్కీ భాస్కర్ సినిమాలతో సక్సెస్ ని అందుకున్న హీరోయిన్ మీనాక్షి. వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి సందడి చేసి, సక్సెస్ ని అందుకున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కనిపించనున్నారు. కాంతారా, విరూపాక్ష సినిమాలకు మ్యూజిక్ అందించిన అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ ను అందించనున్నట్లు సమాచారం. 2026 వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి తెచ్చే అవకాశం ఉంది.

Jewel Thief OTT : కోట్లు పెట్టి తీశారు… చేసేదేమ్ లేకుండా.. డైరెక్ట్ ఓటీటీలో..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×