BigTV English

Viral Video: ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో.. ఇంట్లోకి దూసుకొచ్చి ఐదుగురిపై దాడి చేసిన చిరుత

Viral Video: ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో.. ఇంట్లోకి దూసుకొచ్చి ఐదుగురిపై దాడి చేసిన చిరుత
Viral Video
Viral Video

Viral Video: వన్య ప్రాణులు అడవులను వదిలి జనారణ్యంలోకి ప్రవేశిస్తున్న ఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. ఇందులో ముఖ్యంగా చిరుతలు, ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత ఓ ఇంట్లోకి ప్రవేశించి ఐదుగురిపై దాడి చేసింది. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ లో వెలుగుచూసింది. సోమవారం ఉదయం గ్రామంలోకి ప్రవేశించి స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులపై దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


తెల్లవారుజామున 4.30 గంటలకు చిరుత గ్రామంలోకి ప్రవేశించిందని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో దాదాపు 12 మందిపై దాడికి పాల్పడిందని.. ఇందులో ప్రస్తుతం ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Also Read: సోషల్ మీడియాలో క్లిక్ హియర్ ట్రెండ్… అసలేంటి గురూ ఇది?

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జగత్పూర్ అనే గ్రామంలోని ఓ ఇంటి పై కప్పుపై(టెర్రస్ పై) చిరుత పరుగులు తీయడాన్ని స్థానికులు గమనించారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒక ఇంటిపై నుంచి మరో ఇంటి టెర్రస్ పైకి చిరుత దూకినట్లు గుర్తించారు. దీంతో ఆ ఇంటి టెర్రస్ పై ఉన్న ఓ రూమ్ లో చిరుతను బంధించి లాక్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం తమకు తెల్లవారుజామున 6.20 గంటలకు సమాచారం అందినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఇద్దరు సిబ్బందిని ఘటనా స్థలానికి పంపినట్లు చెప్పారు. అప్పటికే స్థానికులు అక్కడ చుట్టుముట్టి ఉండగా.. వారి సహాయంతో ఓ రూంలో చిరుతను బంధించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు చిరుతలను తీసుకెళ్లి అడవిలో విడిచినట్లు తెలిపారు. కాగా, ఈ గ్రామం చూట్టూ అడవి ఉందని.. ఎటువంటి ఫెన్సింగ్, సెక్యూరిటీ లేకుండా ఉండడంతో వన్య ప్రాణులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రక్షణ కల్పించాలని కోరారు.

Related News

Street Dogs: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Viral Video: గజరాజుతో సెల్ఫీ.. కిందపడేసి మరీ తొక్కేసింది, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Poop Suitcase: ట్రంప్‌తో మీటింగ్‌‌కు పుతిన్ తన మలాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ సూట్ కేస్ నిండా అదేనా?

Most Dogs Country: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?

Comedy video: లిఫ్ట్ బయట ఈ పిల్లోడు చేసిన పని చూస్తే.. నవ్వు ఆపకోలేరు భయ్యా..!

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

Big Stories

×