BigTV English

Finger Cutting Ritual: ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వేళ్లు కట్ చేసుకుంటారు, ఆ ఊర్లో ఇదే ఆచారం!

Finger Cutting Ritual: ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వేళ్లు కట్ చేసుకుంటారు, ఆ ఊర్లో ఇదే ఆచారం!

BIG TV LIVE Originals: సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం? చాలా బాధపడుతాం. వారితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుని గుండెలవిసేలా ఏడుస్తాం. కొద్ది రోజుల పాటు వారినే తలుచుకుని కుమిలిపోతాం. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటకు వస్తాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తులు తమకు ఇష్టమైన వాళ్లు చనిపోతే వేళ్లు కత్తిరించుకుంటారు. ఇంతకీ, ఈ అరుదైన సంప్రదాయం ఎక్కడ ఉంది? అలా వేళ్లను కట్ చేసుకుని ఏం మెసేజ్ ఇస్తారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


డాని తెగలో వేలు కోసుకునే సంప్రదాయం

డానీ తెగ ప్రజలు ఇండోనేసియాలోని పాపువా ప్రాంతంలో , ముఖ్యంగా బాలియం లోయలో నివసిస్తారు. వీరు వ్యవసాయం, పశుపోషణతో జీవిస్తారు. డానీ తెగ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు చాలా ప్రత్యేకంగా, విచిత్రంగా ఉంటాయి. అందులో ఒకటి  వేలు కోసుకునే సంప్రదాయం. దీనిని ఇక్కి పాలిన్ అని కూడా అంటారు.  డానీ తెగలో ఉండే ఒక అరుదైన ఆచారం ఇది. చనిపోయిన కుటుంబ సభ్యుడి కోసం తమ బాధను, దుఃఖాన్ని  వ్యక్తీకరించేందుకు స్త్రీలు తమ వేలి భాగాన్ని కత్తిరించుకుంటారు. ఈ సంప్రదాయం వారి దుఃఖాన్ని, చనిపోయిన వ్యక్తి పట్ల గౌరవాన్ని చూపిస్తుంది.


మహిళలో పాటు పురుషులు కూడా

ఇకిపాలిన్ ఆచారాన్ని ప్రధానంగా డాని మహిళలు  పాటించేవారు. ఆ తర్వాత కొంతమంది పురుషులు ఈ విధానాన్ని పాటించడం మొదలుపెట్టారు. ఆడవాళ్లు చేతులు కోసుకుంటే, మగవాళ్లు చెవులను కోసుకుంటారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బిడ్డలు సహా దగ్గరి కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు, దుఃఖంలో ఉన్నవారు వేలు పైభాగాన్ని కత్తిరిస్తారు. ఈ బాధ అనేది తాము అనుభవించే తీవ్ర నష్టాన్ని సూచిస్తుంది. ఎందుకంటే. వేళ్లు డాని సంస్కృతిలో ఐక్యత, బలాన్ని సూచిస్తాయి. వేలు విభాగాన్ని తొలగించడం అనేది శాశ్వత దుఃఖానికి గుర్తుగా, మరణం వల్ల మిగిలిపోయిన భావోద్వేగ శూన్యతకు గుర్తుగా భావిస్తారు.

వేళ్లు ఎలా కట్ చేసుకుంటారంటే?

ఈ సంప్రదాయాన్ని ఓ పద్దతి ప్రకారం నిర్వహిస్తారు డాని తెగ ప్రజలు. వేలు కట్ చేయడానికి ముందు  తిమ్మిరి పట్టేలా చేస్తారు. ఇందుకోసం వేలి పైభాగంలో ఒక తాడుతో గట్టిగా కడుతారు. ఆ తర్వాత పదునైన కత్తితో వేలు కట్ చేస్తారు. కాసేపు రక్తం కారేలా ఉంచి ఆ తర్వా కట్టుకడుతారు. ఆ కట్ చేసిన వేలు భాగాన్ని పూడ్చి పెడతారు.

కొద్ది కాలంగా ఈ సంప్రదాయానికి బ్రేక్!

గత కొద్ది సంవత్సరాలుగా ఈ సంప్రదాయం నెమ్మదిగా కనుమరుగు అవుతూ వస్తోంది.  ఆరోగ్య సమస్యలతో పాటు ప్రభుత్వం ఈ సంప్రదాయంపై నిషేధం విధించడంతో ప్రస్తుతం దాదాపు అంతరించిపోయింది. తమకు ఇష్టమైన వారు చనిపోయినప్పటికీ, వేళ్లు కట్ చేసుకోవడం మానేశారు. ఆచార నృత్యాలు, పాటలు పాడడంతో పాటు మరణించినవారిని గౌరవించడానికి సంతాప పద్ధతులను పాటిస్తున్నారు. ఇకిపాలిన్ వారసత్వం వృద్ధ డాని మహిళల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. వీరిలో చాలామంది  కత్తిరించబడిన వేలు భాగాల భౌతిక గుర్తులను కలిగి ఉన్నారు. ఒకప్పుడు బలంగా ఉన్న ఈ సంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Read Also: ఆమె మెట్రో రైలు ప్రమాదంలో చనిపోయింది.. కానీ, ఆమె ఫోన్ నుంచి కొడుకు, చెల్లికి కాల్స్.. అదెలా?

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Related News

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Young president: 20 ఏళ్లకే సొంత దేశాన్ని సృష్టించి తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న యువకుడు, 400 మంది పౌరులు

Love marriage ban: ప్రేమించారో గ్రామ బహిష్కారం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పెద్దలు.. ఎక్కడంటే?

Big Stories

×