ప్రతి ఇంట్లోనూ కలబంద మొక్కను సులువుగా పెంచుకోవచ్చు. దాని నుంచి ఒక ఆకును కత్తిరించి పైన పొరను తీస్తే లోపల కలబంద పుష్కలంగా కనిపిస్తుంది. దాన్ని నేరుగా తలపై ఉన్న మాడుకు పట్టించడం ద్వారా జుట్టును పెంచుకోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.
కలబంద జెల్‌లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి12, ఫోలిక్ ఆమ్లం, కొవ్వు ఆమ్లాలు, ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజంగానే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా దీనిలో ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఈ అలోవెరాను వాడుతూనే ఉన్నారు. జుట్టుకు మాత్రమే కాదు చర్మానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తుంది. కాలిన గాయాలకు, కలబంద జెల్ ను అప్లై చేస్తే ఎంతో మంచిది.
చుండ్రు సమస్యను తగ్గించి
కలబంద జెల్ ను నేరుగా తలపై పట్టించడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చుండ్రు సమస్య చాలా వరకు తగ్గుతుంది. మీకు తలపై చర్మం దురద పెడుతున్నా లేక పొరలుగా ఊడిపోతున్న కలబంద జెల్ ను పట్టించండి. ఇది ఆ సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. అలాగే జుట్టు బాగా పెరిగేలా మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. కలబంద చర్మంపై ఉన్న అదనపు నూనె ఉత్పత్తిని తొలగిస్తుంది. ఇలా అధికంగా సెబమ్ ఉత్పత్తి కావడం వల్ల ఫోలికల్స్ మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఇవి కలబంద జెల్ రాసి తలస్నానం చేస్తే ఫోలికల్స్ తెరుచుకుంటాయి. జుట్టు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
కలబందను తలపై మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ కూడా సవ్యంగా జరుగుతుంది. జుట్టు పెరుగుదలలో ముఖ్యమైన ఆక్సిజన్ పోషకాలు వంటివి. జుట్టు కుదుళ్లకు బాగా అందుతాయి. దీనివల్ల జుట్టు పొడవుగా తిరిగే అవకాశం ఉంది.
నెత్తికి కలబందను రాయడం వల్ల అది కచ్చితంగా పనిచేస్తుంది. మీ జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. కొత్త జుట్టు పెరగడానికి అవసరమైన పరిస్థితులను సృష్టిస్తుంది. జుట్టు పెరిగే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. బట్టతల వచ్చే అవకాశం ఉన్నవారు ముందుగానే కలబందను తలపై అప్లై చేసేందుకు ప్రయత్నించండి. అలా అయితే త్వరగా బట్ట తల వచ్చే అవకాశం ఉండదు.
ఇలా జెల్ అప్లై చేయండి
వారానికి రెండు నుంచి మూడుసార్లు తాజా కలబందను జెల్ ను తలపై అప్లై చేయండి. ఐదు నుంచి పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత అరగంట నుంచి గంట వరకు అలా వదిలేయండి. రాత్రంతా వదిలేసినా కూడా మంచిదే. ఆ తరువాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూను ఉపయోగించి జుట్టును శుభ్రం చేసుకోకండి. కలబంద జెల్ ఉల్లిపాయ రసం, ఆముదం, మెంతిపొడి వంటి పదార్థాలు కూడా వేసి జుట్టుకు పట్టిస్తే ఇంకా మంచిది. ఒక నెల రోజులు పాటు ఇలా చేసి చూడండి. మీ జుట్టులో మంచి మార్పును మీరే గమనిస్తారు.