BigTV English

Viral Video: ప్రయాణికుల ముందే మందుకొట్టిన పైలట్.. ప్రాణాలు గాల్లోకి!

Viral Video: ప్రయాణికుల ముందే మందుకొట్టిన పైలట్.. ప్రాణాలు గాల్లోకి!

విమానం ప్రయాణం మీద చాలా జోక్స్ ఉన్నాయి. “విమానం ఎక్కాలంటే డబ్బులు ఉండాలి. దిగాలంటే అదృష్టం ఉండాలి” అంటారు పెద్దలు. విమాన ప్రయాణం ప్రమాదకరమైనది అని చెప్పడానికి ఇలా చెప్తుంటారు. కానీ, ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ కారణంగా అత్యంత అరుదుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటికి కూడా చాలా వరకు టెక్నికల్ సమస్యలే కారణం అవుతున్నాయి.


ప్రయాణీకుల ముందే మందు కొట్టిన పైలెట్

ఇక విమానంలోకి ఎక్కే ప్రయాణీకులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే పైలెట్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విమానాన్ని నడపాలి. వందల మంది ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలి. కానీ, అలాంటి పైలెట్ ఫుల్లుగా మందుతాగి విమానాన్ని నడిపితే? అదీ ప్రయాణీకుల ముందే గ్లాస్ మీద గ్లాస్ కొట్టేస్తే? ఏ ప్రయాణీకుడైనా ఆ విమానంలో వెళ్లేందుకు ఇష్టపడుతాడా? అవును, అచ్చంగా ఇలాగే చేశాడు ఓ పైలెట్. అందరి ముందే మందు కొట్టడంతో ప్రయాణీకులంతా విమానం దిగి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..


వీడియో షేర్ చేసిన ఫన్నీ పైలెట్ బౌషాబోయిర్..

సోషల్ మీడియాలో బౌషాబోయిర్ చేసే ఫన్ మామూలుగా ఉండదు. ఆయన యాక్టర్. అంతేకాదు, పైలెట్ కూడా. ఆయన ఛార్టెడ్ విమానాన్ని నడుపుతారు. అయితే, తను నడిపే ఫ్లైట్ లోని ప్యాసింజర్లు, సిబ్బందితోనే వీడియోలు చేస్తారు. ఈ వీడియోలన్నీ ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తాయి. విమానంలోకి గొర్రె పిల్లలను ఎక్కించడం, విమానం నడపడాన్ని వదిలేసి వాష్ రూమ్స్ క్లీన్ చేయడానికి వెళ్లడం, రన్నింగ్ ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్లు సీన్ క్రియేట్ చేయడం, విమానంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు భయపెట్టడం లాంటి అల్లరి పనులు చేస్తాడు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. వాటిని చూసి నెటిజన్లు నవ్వుల్లో మునిగిపోతారు. తాజాగా ప్రయాణీకులంతా విమానంలోకి ఎక్కుతుంటే తను మాత్రం మందు తాగుతూ కనిపిస్తాడు. ఆయనను చూసి ప్రయాణీకులు విమానం దిగి పారిపోతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సుమారు రెండు లక్షల వ్యూస్ సాధించింది. వేలాది లైకులు పొందింది.

పని చేయని విమానంలో ఫన్నీ రీల్స్

నిజానికి బౌషాబోయిర్ సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలన్నీ స్క్రిప్ట్ ప్రకారం చేస్తారనే టాక్ ఉంది. ఫ్లైయింగ్ కు పనికి రాని ఛార్టెడ్ ఫ్లైట్ లో ఈ రీల్స్ చేస్తారు. విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్, ప్యాసింజర్లు అంతా యాక్టర్లేనట. కానీ, వీళ్లు చేసే రీల్స్ చూస్తే నిజంగానే జరిగిందా? అనేలా ఉంటాయి. ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. బౌషాబోయిర్ తాజాగా పోస్టు చేసిన వీడియోను చూసి నెటిజన్లు ఫుల్ ఫన్నీగా ఫీలవుతున్నారు. “ఇలాంటి పైలెట్ ఉంటే, అదే లాస్ట్ జర్నీ అవుతుంది” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read Also: మొసలితో ఆటలా? ఏం చేసిందో చూడండి.. నీ కల తగలెయ్య!

Related News

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Big Stories

×