Free Medical Camps: ప్రజలు బాగుంటేనే మేము బాగుంటామని బలంగా నమ్ముతుంది బాధ్యతాయుతమైన మీడియా. ఓ వైపు సమాజహితం.. మరోవైపు ప్రజల ఆరోగ్యం కోసం నడుం బిగించింది బిగ్ టీవీ. ఇప్పటివరకు చేపట్టిన మెగా హెల్త్ క్యాంపుల జర్నీ సక్సెస్‌పుల్‌గా కొనసాగింది. ఒక్కరోజులో తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా హెల్త్ క్యాంపులు నిర్వహించిన సందర్భాలు లేకపోలేదు.
మీడియా చరిత్రలో బిగ్ టీవీ ఒక సంచలనం. తక్కువ సమయంలో కోట్లాది మంది ప్రజలకు చేరింది. వాళ్లని పలకరించింది.. సమస్యలపై బయటపెట్టింది. ప్రజాసేవే పరమావధిగా అడుగులు ముందుకు వేస్తోంది. ఏప్రిల్ 13న యాదాద్రి భవనగిరి జిల్లా స్వర్ణగిరి ఆలయంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫ్రీ మెడికల్ క్యాంప్ చేపడుతోంది. వైద్య పరీక్షలు, మందులు ఉచితం ఉచితంగా ఇవ్వనుంది. బిగ్ టీవీ చరిత్రలో ఇది 327 మెడికల్ క్యాంప్.
కేవలం నగరాలు, పట్టణాలకు మాత్రమే కాకుండా మారుమూల పల్లెలు, కొండల మాటున ఉన్న గిరిజన తండాలకు సైతం వెళ్లింది. అందర్నీ పలకరించింది. ఇప్పటికీ వెళ్తోంది బిగ్ టీవీ. ఇప్పటికే సుమారు 300లకు పైగా ఉచితంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించింది. వేలాది మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే కాదు మందులు పంపిణీ చేసింది.
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించిన ఘనత సొంతం చేసుకుంది బిగ్ టీవీ. సమాజంలోని ప్రతి ఒక్కరు తమ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఆరోగ్య యజ్ఞాన్ని మొదలుపెట్టింది బిగ్ టీవీ. ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం బాగుంటుందని బలంగా నమ్ముతుంది. ఈ యజ్ఞం ఇక్కడితో ఆగేది కాదని, ఇక ముందు కొనసాగబోతోంది కూడా.
ALSO READ: తెలంగాణలో భూకంపం.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించింది. బిగ్ టీవీ అంటే కేవల న్యూస్ ఛానల్ మాత్రమే కాదు! సమాజ హితం కోసం పాటు పడే సంస్థ కూడా. అనేక కారణాల వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించలేని వాళ్ల కోసం హెల్త్ క్యాంపుల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి మందులను అందిస్తోంది. అవసరమైతే సర్జరీలు సైతం చేయిస్తోంది.
ఉచిత మెడికల్ క్యాంపులకు వస్తున్న ఆదరణ బిగ్ టీవీపై బాధ్యత మరింత పెరిగింది. చేస్తున్న మంచి పనికి ఆస్పత్రులు ముందుకొచ్చి సహకారం అందిస్తే మరింత ముందుకు తీసుకెళతాం! వైద్య సదుపాయం అందుబాటులో లేని ప్రతి చోటుకు వెళ్లి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే ప్రయత్నం కంటిన్యూ కొనసాగుతోంది. ఆ తరహా సేవలు ఇక ముందు కొనసాగుతుంది.