Viral News: పులిని చూడగానే మనుషులకు వెన్నులో వణుకుపుడుతుంది. అడవిలోని జంతువులు ప్రాణభయంతో పారిపోతాయి. పులి నడుచుకుంటూ వస్తుందని తెలిస్తే, జంతులువులు అన్నీ పరార్ అవుతాయి. కంటికి కనిపించకుండా దాక్కుంటాయి. కానీ, ఓ చిన్న చేప ఏకంగా పులినే గజ్జున వణికించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను హీరోయిన్ సదా షూట్ చేసింది. దానిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
చేపకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు!
ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన హీరోయిస్ సదా ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. పులిని భయపెట్టిన ఆ చేపకు లైఫ్ టైమ్ అవార్డు ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చింది. “ఈ రోజు ఆ చేపకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు వచ్చినట్టు అయ్యింది. రిద్ధి లాంటి పులి ఒక చేపను చూసి భయపడుతుందని అస్సలు ఊహించలేదు” అని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చేప ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొసలి దాడి చేస్తుందేమోనని..
వాస్తవానికి చేపను చూసి పులి భయపడేంత సీన్ లేదు. కానీ, ఒకేసారి చేప పైకి ఎగరడంతో శబ్దం అయ్యింది. తన మీద మొసలి దాడి చేస్తుందేమోనని భయపడింది. అందుకే, ఒక్కసారిగా వణికిపోవడంతో పాటు నీళ్లలో నుంచి బయటపడే ప్రయత్నం చేసింది. కొద్ది క్షణాల్లోనే తనను భయపెట్టింది చేప అని తెలిసినప్పటికీ, అదే స్పీడ్ లో పులి ఒడ్డు మీదికి వచ్చి చేరింది. ఆ తర్వాత తీరిగ్గా నిలబడి, చేపను చూశా నేను భయపడింది? అన్నట్లు ఫోజు పెట్టి చూస్తూ కనిపించింది.
Read Also: మొసలితో ఆటలా? ఏం చేసిందో చూడండి.. నీ కల తగలెయ్య!
ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు
చేపను చూసి పులి భయపడిన వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “పులి పరిస్థితి ఈ ఊరికి ప్రెసిడెంట్.. పక్క ఊళ్లో పాలేరు అన్నట్లుగా ఉంది. అడవిలో ఉన్న మిగతా జంతువులను వణికించే పులి, చిన్న చేపను చూసి భయపడ్డం విచిత్రంగా ఉంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “జింకలు, దుప్పులు, అడవి గేదెలు ఈ సీన్ చూసి ఉంటే ఫుల్ ఖుషీ అయ్యేవి. ఎప్పుడూ తమను వెంటాడి, వేటాడి, చంపి తినే పులికి, ఓ చేప సుస్సు పోయించిందని సంబరపడేవి” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. “ప్రపంచంలో ధైర్యాన్ని ఇచ్చే అత్యున్న పురస్కారం ఏదైనా ఉంటే వెంటనే ఈ చేపకు ఇచ్చేయాలి” అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. “బహుశ ప్రపంచంలో పులిని వణికించి ఏకైక చేప ఇదే అయి ఉంటుంది” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ, ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. పులిపై జోకులు విసరడంతో పాటు చేప ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
Read Also: కిటికీలో చెయ్యి పెట్టాడు, ఇంతలో రైలు కదిలింది, ఆ తర్వాత..