Delivery Boy Beat Customer| బెంగళూరులో జెప్టో డెలివరీ బాయ్ ఒక కస్టమర్‌పై దాడి చేశాడు. చిన్న విషయంపై ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో వాగ్వాదం పెరిగి హింసాత్మకంగా మారింది.ఈ దాడిలో కస్టమర్ ముఖానికి గాయాలయ్యాయి. ఈ ఘటన బెంగళూరు నగరంలోని బసవేశ్వరనగర్ ప్రాంతంలో జరిగింది.
విష్ణువర్ధన్ అనే జెప్టో డెలివరీ బాయ్, షషాంక్ ఎస్ అనే 30 ఏళ్ల వ్యాపారవేత్త ఇంటికి కిరాణా సామాను డెలివరీ చేయడానికి వెళ్ళాడు. షషాంక్ ఇంటికి సామాను తీసుకెళ్లినప్పుడు, షషాంక్ మరదలు ఆ డెలివరీ తీసుకోవడానికి బయటకు వచ్చింది. అయితే డెలివరీ అడ్రస్ సరిగా లేదని విష్ణువర్ధన్ ఆమెపై కోపంతో అరిచాడు. ఈ విషయం తెలిసిన షషాంక్ బయటకు వచ్చి డెలివరీ బాయ్‌ను అతని ప్రవర్తన గురించి ప్రశ్నించాడు. కానీ డెలివరీ బాయ్ రివర్స్ అయ్యాడు. కస్టమర్ అయిన షషాంక్ తప్పుడు అడ్రస్ ఎంటర్ చేసి పైగా తనతో వాగ్వాదం చేయడం తప్పు అని వాదించాడు.
మరోవైపు కస్టమర్ షషాంక్ కూడా అతని ప్రవర్తన సరిగా లేదని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో డెలివరీ బాయ్ తనను బెదిరిస్తే ఊరుకునేది లేదని చెప్పడంతో.. ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. ఆ తరువాత డెలివరీ బాయ్ బైక్ పై నుంచి కిందకు దిగి.. కస్టమర్ ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సిసిటీవిలో రికార్డ్ అయింది.
సీసీటీవీ ఫుటేజీలో కస్టమర్, అతని మరదలు, డెలివరీ బాయ్‌తో ఇంటి బయట మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. అకస్మాత్తుగా విష్ణువర్ధన్ కోపంతో షషాంక్‌పై దాడి చేశాడు. అతను షషాంక్‌ను గుద్ది, అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లుగా అనిపించింది. ఈ ఘటనలో షషాంక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని కంటి చుట్టూ వాపు వచ్చింది, అలాగే తలకు కూడా గాయమైనట్లు తెలిసింది.
షషాంక్ మరదలు, మరో మహిళ వెంటనే అతడిని రక్షించడానికి మధ్యలోకి వచ్చారు. వారు షషాంక్‌ను డెలవరీ బాయ్ కు దూరంగా తీసుకెళ్లారు. ఈ ఘటన గురించి జెప్టో సంస్థ స్పందించింది. “మా ఉద్యోగులు వృత్తిపరమైన ప్రవర్తన పాటించాలి. ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకుంటాం,” అని ప్రకటనలో పేర్కొంది. కస్టమర్ విష్ణవర్ధన్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
#Bengaluru: A @ZeptoNow delivery turned violent on May 21 in Basaveshwaranagar after a delivery boy thrashed a customer over an address mix-up. CCTV captured the assault. A case has been filed under BNS sections 115(2), 126(2), 351(2) & 352. Police have issued notice to Zepto. pic.twitter.com/sTY2LFOE1h
— Elezabeth Kurian (@ElezabethKurian) May 24, 2025
ఇలాంటి ఘటన మరొకటి ఇటీవలే జరిగింది. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్‌పై దాడి జరిగింది. ప్రసాద్ అనే వ్యక్తి స్విగ్గీ ద్వారా ఆహారం ఆర్డర్ చేశాడు. అనిల్ ఆ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి ప్రసాద్ ఫ్లాట్‌కు వెళ్లాడు. డోర్‌బెల్ మోగించగా, ఒక మహిళ తలుపు తీసింది. అనిల్ మాటలు అర్థం కాకపోవడంతో ఆమె ప్రసాద్‌కు సమాచారం ఇచ్చింది.
Also Read: కళ్లు మూసుకొని బటన్ నొక్కితే రూ.225 కోట్ల జాక్ పాట్.. లేటు వయసులో పట్టిన అదృష్టం
ప్రసాద్ బయటకు వచ్చినప్పుడు.. డెలివరి బాయ్ అనిల్, “మీ ఆహారం వచ్చింది, బ్రో” అని పిలిచాడు. దీంతో కోపమొచ్చిన ప్రసాద్, “నన్ను సార్ అనకుండా బ్రో అని ఎలా పిలుస్తావా?” అంటూ అనిల్‌పై దాడి చేశాడు. సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ప్రసాద్.. అనిల్‌ను కొట్టి, అతని బట్టలు తీసి, గేట్ వద్ద నిలబెట్టి, క్షమాపణ లేఖ రాయమని బలవంతం చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఈ అవమానంతో అనిల్ ఆత్మహత్యకు ప్రయత్నించాడనే పుకార్లు రావడంతో, డెలివరీ వర్కర్లు ఆక్సిజన్ టవర్స్ వద్ద నిరసన తెలిపారు. ద్వారక ఏసీపీ అన్నేపు నరసింహమూర్తి సంఘటనా స్థలానికి వచ్చి, అనిల్‌తో ఫోన్‌లో మాట్లాడి, అతను సురక్షితంగా ఉన్నాడని ధృవీకరించారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు.