BigTV English

Luxury Brand: ఆ లగ్జరీ బ్రాండ్స్ మీ జేబులకు ఎలా చిల్లు పెడుతున్నాయో తెలిస్తే షాక్ అవుతారు

Luxury Brand: ఆ లగ్జరీ బ్రాండ్స్ మీ జేబులకు ఎలా చిల్లు పెడుతున్నాయో తెలిస్తే షాక్ అవుతారు

Luxury Brand: డియోర్ అంటే లగ్జరీ, హోదా, అద్భుతమైన నాణ్యతకు చిహ్నం. కానీ ఈ బ్రాండ్‌పై ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఆరోపణలు దాని ఇమేజ్‌ను దెబ్బతీశాయి. మోసాలు, కార్మిక దోపిడీ, అతిగా వసూలు చేసే ధరల గురించి బయటపడిన విషయాలు ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. డియోర్‌లో జరుగుతున్న అవకతవకలు, కార్మికుల పరిస్థితులు, కస్టమర్లు చెల్లించే ధరల గురించి తెలుసుకుందాం..


దారుణ నిజం
ఇటలీలోని మిలన్‌లో జరిగిన దర్యాఫ్తుల్లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. డియోర్ హ్యాండ్‌బ్యాగ్‌లు ఫ్యాక్టరీల్లో కాకుండా స్వెట్‌షాప్‌లలాంటి దారుణ పరిస్థితుల్లో తయారవుతున్నాయి. చైనీస్ అక్రమ కార్మికులను ఉపయోగించి ఈ బ్యాగ్‌లు తయారు చేయిస్తున్నారు. ఈ కార్మికులకు గంటకు కేవలం రూ.180-270 మాత్రమే ఇస్తున్నారు. అంతేకాదు, వీళ్లు రాత్రిపూట కూడా వర్క్‌షాప్‌లలోనే పడుకుని, రోజుకు 24 గంటలు పని చేయాల్సిన దుస్థితి. ఇది కార్మిక చట్టాలను ఉల్లంఘించడమే కాదు, డియోర్ లగ్జరీ ఇమేజ్‌కు కూడా పెద్ద దెబ్బ.

కస్టమర్ల సమాచారం చోరీ
2025 మేలో డియోర్ సైబర్ దాడికి గురైంది. కస్టమర్ల పేర్లు, ఈమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు, కొనుగోలు వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా, చైనా కస్టమర్లు ఈ దాడి వల్ల ఎక్కువగా నష్టపోయారు. ఈ డేటా చోరీ కారణంగా ఫిషింగ్ స్కామ్‌లు, నకిలీ ఆఫర్లతో మోసాలు జరిగే ప్రమాదం ఉంది. డియోర్ కస్టమర్లను అనుమానాస్పద ఈమెయిల్స్, మెసేజ్‌లపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది.


అబద్ధాలు
డియోర్ తమ ఉత్పత్తులను యూరప్‌లో నైపుణ్యం ఉన్న కళాకారులు తయారు చేస్తారని చెబుతుంది. కానీ దర్యాప్తుల్లో తెలిసిన నిజం ఏంటంటే, కొన్ని ఉత్పత్తులు తక్కువ జీతాలతో, దారుణ పరిస్థితుల్లో అక్రమ కార్మికులతో తయారవుతున్నాయి. ఇది లక్షలు పోసి డియోర్ బ్యాగ్‌లు కొనే కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

ఖర్చు తక్కువ
డియోర్ హ్యాండ్‌బ్యాగ్ ఒకటి తయారు చేయడానికి ఖర్చు కేవలం రూ.4,800 మాత్రమే అవుతుంది. కానీ దాన్ని అమ్మే ధర రూ.2,32,000. అంటే దాదాపు 4,800% లాభం! డియోర్ సాడిల్ బ్యాగ్ ధర రూ.3,68,000, లేడీ డియోర్ బ్యాగ్ ధర రూ.5,44,000. అమెరికాలో 20% టారిఫ్‌లతో ఈ ధరలు రూ.4,42,000 నుంచి రూ. 6,52,000 వరకు పెరుగుతాయి. కానీ ఈ ధరలో ఉత్పత్తి ఖర్చు చాలా చిన్న భాగమే.

కార్మికులకు అన్యాయం
ఈ తక్కువ ఉత్పత్తి ఖర్చులకు ప్రధాన కారణం కార్మికులకు చెల్లించే తక్కువ జీతాలు. ఇటలీ
దర్యాప్తుల ప్రకారం, డియోర్ సప్లయర్లు అక్రమ చైనీస్ కార్మికులకు గంటకు రూ.180-270 మాత్రమే ఇచ్చారు. వీళ్లు ఫ్యాక్టరీలలోనే నివసిస్తూ, రోజూ 24 గంటలు పని చేశారు. ఇలాంటి పరిస్థితులు డియోర్ లగ్జరీ ఇమేజ్‌కు పూర్తి విరుద్ధం.

ప్రజల ఆగ్రహం
ఈ విషయాలు బయటకు రావడంతో ప్రజల్లో, నీతి నిపుణుల్లో ఆగ్రహం చెలరేగింది. డియోర్ బ్యాగ్‌లు రూ.4,200కే తయారవుతాయని తెలిస్తే కస్టమర్స్‌ని మోసం చేస్తున్నారనే విషయం పక్కన పెడితే.. కార్మికులకు తక్కువ చెల్లిస్తున్నారని ఆలోచించాలని నెటిజన్స్ అంటున్నారు. లగ్జరీ బ్రాండ్‌లు పారదర్శకంగా ఉండాలని, జవాబుదారీగా వ్యవహరించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×