Watch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో తాజాగా కీలక మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ( Dc) వర్సెస్ ముంబై ఇండియన్స్ ( MI) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్లో ఎవరు ఊహించని విధంగా ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫిక్సింగ్, లేదా ప్లేయర్స్ బాగా ఆడారా ? అనే విషయం పక్కకు పెడితే ఓవరాల్ గా అధికారికంగా ముంబై ఇండియన్స్ విజయం సాధించి ప్లే ఆఫ్ వెళ్లింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన జరిగింది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఓ అభిమాని చేసిన… ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: Also Read: LSG VS GT: దిగ్వేశ్ పోయాడు.. లక్నోలో మరొకడు తగిలాడు..నోట్ బుక్ సిగ్నచర్ సెలెబ్రేషన్స్ చేస్తూ
ముసలోడే కానీ మహానుభావుడు.. చీర్ లీడర్స్ ను కూడా వదలడం లేదు
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ముసలాయన… చేసిన చిలిపి పని హాట్ టాపిక్ అయింది. ముంబై ఇండియన్స్ చీర్ లీడర్స్ డాన్స్ చేస్తుంటే… వాళ్లనే చూడడం మొదలుపెట్టాడు ఆ ముసలాయన. అతని ఫేస్ కనిపించలేదు కానీ… గుండు మాత్రం స్పష్టంగా మెరిసింది. నేరుగా చీర్ గర్ల్స్ వీడియోను తీస్తూ… తన మొబైల్లో వాళ్ళ అందాలను చూస్తూ ఎంజాయ్ చేశాడు. మ్యాచ్ పూర్తిగా వదిలేశాడు. అక్కడ ఉన్న జనాలంతా మ్యాచ్ చూస్తుంటే… ఈ పోటుగాడు మాత్రం… వాళ్ళ అందాలను మొబైల్ ఫోన్లో బంధించి.. చూస్తూ ఎంజాయ్ చేశాడు.
వెనకాల ఎవరైనా చూస్తారు అనే భయం లేకుండా… ఏమాత్రం తగ్గలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే చీర్ గర్ల్స్ చేసిన డ్యాన్సును ఈ ముసలైన వీడియో…. తీస్తుంటే వెనుక నుంచి మరో వ్యక్తి.. క్యాప్చర్ చేశాడు. ఈ వీడియో ను వైరల్ చేశాడు. దీంతో ఆ గుండు ముసలాయన బండారం బయటపడింది. ఇక ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు నవ్వుకుంటున్నారు. ఇదెక్కడి సంతరా నాయనా… మ్యాచ్ చూడడానికి వెళ్లి… వాళ్ల ప్రైవేట్ అందాలను చూస్తున్నాడా ? వీడు ముసలోడు కాదు మహానుభావుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్లే ఆఫ్ చేరిన ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో… ప్లే ఆఫ్ కు ముంబై ఇండియన్స్ చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో… హార్దిక్ పాండ్యా సేన ఏకంగా 59 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇందులో…. విజయం సాధించిన ముంబై ఇండియన్స్ నేరుగా ప్లే ఆఫ్ కు వెళ్ళింది.
Also Read: Preity Zinta: పంజాబ్ కింగ్స్ లో ముసలం.. సొంతవల్లే మోసం.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా
— Out Of Context Cricket (@GemsOfCricket) May 23, 2025