బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ ప్రెసిడెంట్ లియు లియాంగే(63)కు సంబంధించిన పలు షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. అవినీతి కేసులో అరెస్ట్ అయి మరణ శిక్ష పడ్డ ఆయనకు, ఆ తర్వాత పెరోల్ లేని జీవిత ఖైదీగా మార్చారు. చైనా అత్యున్నత బ్యాంకు చైర్మెన్ కు జీవిత ఖైదీ విధించడం సంచలనం కలిగించింది. ఆయన అరెస్టు తర్వాత పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయనో పెద్ద స్త్రీ లోలుడే కాదు, ఏకంగా తన సొంత కొడుకును మోసం చేసిన అతడి గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఉన్నత పదవులు వెలగబెట్టిన ఆయన మరీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించాడా? అని చైనీయులు ఆశ్చర్యపోతున్నారు.
అవినీతి కేసులో లియు లియాంగేకు మరణశిక్ష
బ్యాంక్ ఆఫ్ చైనా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో లియు పలు అక్రమాలకు పాల్పడ్డాడు. అక్రమ రుణాలు మంజూరు చేసేందుకు 121 మిలియన్ యువాన్లు ($17 మిలియన్లు) లంచాలు తీసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది నవంబర్ లో లియు సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత ఆయకు మరణ శిక్ష విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అవినీతి ఒక్కటే కాదు, విపరీతమైన లైంగిక వాంఛలతో రగిలిపోయే వాడట. అందమైన యువతులు కనిపిస్తే చాలు, ఎలాగైనా వారిని లొంగదీసుకునవాడట. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత, లియాంగే మూడుసార్లు వివాహం చేసుకున్నాడు.
సొంత కొడుకు ప్రియురాలితో నాలుగో వివాహం
లియు ఏకంగా సొంత కొడుకునే మోసం చేసిన ఘనడు అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అతడి కొడుకు ప్రియురాలు చాలా అందంగా ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. తన కొడుకుకు ఆమెను దూరం చేశాడు. ఆమెకు నగలు, డబ్బు, విలాసవంతమైన భననాలు, లగ్జరీ కార్లు ఇచ్చి తనను దగ్గర చేసుకుకున్నాడు. చివరికి తన కొడుకును మోసం చేసి ఆమెను నాలుగో వివాహం చేసుకున్నాడు. వాస్తవానికి ఈ వివాహం అప్పట్లో చాలా సంచలనం కలిగించింది. ఈ దారుణాన్ని తట్టుకోలేక లియు కొడుకు ఏకంగా హాస్పిటల్ పాలయ్యాడు. చైనా మీడియా ఈ పెళ్లి గురించి వార్తలు ప్రచురించింది. అదే సమయంలో చైనా ప్రభుత్వం బ్యాంక్ ఆఫ్ చైనా అధ్యక్ష పదవితో పాటు కమ్యూనిస్ట్ పార్టీ సెక్రెటరీ పదవి నుంచి తొలగించింది. అయితే, కమ్యూనిస్ట్ పార్టీలో కీలక పదవిలో ఉండటంతో ఆయన గురించి వార్తలు రాసేందుకు మీడియా సంస్థలు భయపడ్డాయి.
అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ చైనాలో అవినీతికి సంబంధించి కమిషన్ ఆఫ్ డిసిప్లేన్ ఇన్ స్పెక్షన్ కు నివేదికలు అందాయి. అప్పడే చట్టపరమైన విచారణ మొదలయ్యింది. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. చివరికి అవినీతి ఆరోపణలపై విచారణ జరిగింది. తొలుత మరణశిక్ష విధించిన న్యాయస్థానం, ఆ తర్వాత పెరోల్ లేని జీవిత ఖైదుగా మార్చింది.
Read Also: మేఘాలపై మనుషులు.. విమాన ప్రయాణికులకు వింత అనుభవం, వీడియో వైరల్!