BigTV English

Viral Video: మేఘాలపై మనుషులు.. విమాన ప్రయాణికులకు వింత అనుభవం, వీడియో వైరల్!

Viral Video: మేఘాలపై మనుషులు.. విమాన ప్రయాణికులకు వింత అనుభవం, వీడియో వైరల్!

ఏలియన్స్ గురించి శాస్త్రవేత్తలు తరచుగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులు ఉన్నారని, తరచుగా వాళ్లు భూమ్మీదికి కూడా వచ్చిన సందర్భాలున్నాయని పలువురు పరిశోధకులు అభిప్రయాపడుతున్నారు. అందుకు కొన్ని ఆధారాలను కూడా చూపించిన సందర్భాలున్నాయి. అయితే, ప్రత్యక్షంగా ఏలియన్స్ ను చూసిన వాళ్లు ఎవరూ లేరు. కానీ, ఏలియన్స్ చర్చ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మరోసారి ఏలియన్స్ అంశం తెరమీదికి వచ్చింది. ఆ వీడియోలో ఉన్నది నిజంగానే గ్రహాంతర వాసులా? లేక ఎవరైనా కావాలని అలా క్రియేట్ చేశారా? అనే చర్చ నడుస్తున్నది.


విమానంలో వెళ్తూ వీడియో తీసిన ప్యాసెంజర్

తాజాగా ఓ విమాన ప్రయాణీకుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మేఘాల మీద కొన్ని వింత ఆకారాలు కనిపించాయి. అచ్చం మనుషుల మాదిరిగానే ఒక చోట ఇద్దరు, మరొక చోట ఇద్దరు కనిపించారు. మేఘాల మీద నిలబడి ఏదో చేస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తున్నది. ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ మైరా మూర్  సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు “ఇక్కడ ఏం జరుగుతుంది?” అని క్యాప్షన్ పెట్టారు. అంతేకాదు, ఏలియన్స్, పారా నార్మల్ అనే హ్యాష్ ట్యాగ్స్ జత చేశారు. ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు 50 లక్షలకు పైగా వ్యూస్ అందుకుంది.


సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన

అటు ఈ వీడియోపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది. కొంత మంది ఏలియన్స్ ఉన్నారని చెప్పడానికి ఇదో ఉదాహారణ అంటే, మరికొంత మంది ఇదంతా ఫేక్ ముచ్చట అని కొట్టిపారేస్తున్నది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. “ఈ వీడియో కావాలని క్రియేట్ చేసినట్లుగా ఉంది. వాళ్ల ఆకారాల మీద ఎక్కువ సేపు ఫోకస్ చేయట్లేదు. ఇదంతా ఓ ఫేక్ క్లిక్ బైట్ లా ఉంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఈ వీడియో తీస్తున్న సమయంలో విమానం కదలకుండా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇదంతా ఓ కట్టుకథ” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “నిజంగా అది రియల్ విజువల్ అయితే, వీడియో తీసే వాళ్లు జూమ్ చేసి క్లియర్ గా చూపించే వాళ్లు. కానీ, అలా జరగడం లేదంటే, అదో ఫేక్ వీడియోగా భావిస్తున్నాను” అని మరొకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరికొంత మంది నిపుణులు మాత్రం మేఘాల మీద అలాంటి వింత ఆకారాలు కనిపించేందుకు సైన్స్ ప్రకారం కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు. భూమ్మీద ఉన్న కంపెనీల నుంచి వచ్చే ఆవిరి మేఘాల మీదికి వెళ్లి ఇలా కనిపించే అవకాశం ఉందంటున్నారు. పొగ గొట్టాల నుంచి లేదంటే కూలింగ్ టవర్ల నుంచి వచ్చే ఆవిరి పొంగ మంచు పొర మీదికి వెళ్లడం వల్ల ఇలాంటి వింత ఆకారాలు ఏర్పాడుతాయంటున్నారు. ఇందులో ఏలియన్స్ అనే మాటకు అసలు ఆస్కారమే లేదంటున్నారు. మొత్తంగా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also: ప్రపంచంలోనే అదిపెద్ద ట్రాఫిక్ జామ్.. 12 రోజుల పాటు రోడ్డు మీదే నరకం చూసిన వాహనదారులు!

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×