Urvashi Rautela: ఒకప్పుడు ఐటెంసాంగ్స్ కోసం సపరేట్ నటీమణులు ఉండేవారు. అది కూడా ఎక్కువగా డ్యాన్సర్లు ఉండేవారు. కేవలం ఆ సాంగ్స్ కోసమే వారు కనిపించేవారు. ఇక ఇప్పుడు ఆ జనరేషన్ మారింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెంసాంగ్స్ కు సై అంటున్నారు. కాజల్, సమంత, తమన్నా, శ్రీలీల.. ఇలా స్టార్స్ అందరూ ఐటెంసాంగ్స్ లో చిందేసినవారే.
ఇక వీరితో పాటు టాలీవుడ్ మేకర్స్ బాలీవుడ్ ముద్దుగుమ్మలను కూడా ఐటెంభామలుగా దింపుతున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోల సినిమాలు అంటే కచ్చితంగా బాలీవుడ్ బ్యూటీ సాంగ్ లేకుండా ఉండదు. అలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ఇంపోర్ట్ అయిన హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
SreeLeela: స్టార్ హీరోతో శ్రీ లీలా ప్రేమాయణం.. గుట్టు విప్పిన స్టార్ ప్రొడ్యూసర్..!
వెర్ ఈజ్ ది పార్టీ.. బాసూ వెర్ ఈజ్ ది పార్టీ అంటూ తెలుగు కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. ఇక ఈ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో వెంటవెంటనే ఛాన్స్ లు పట్టేసింది. ఏజెంట్, బ్రో లాంటి సినిమాల్లో చిన్నది చిందేసింది. ఇక ఇప్పుడు బాలయ్య సరసన దబిడిదిబిడి అంటూ సందడి చేసింది. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక నిన్నటికి నిన్న దబిడిదబిడి సాంగ్ ను రిలీజ్ చేశారు. బాలయ్య స్టెప్స్ ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో స్టెప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.ఊర్వశిని మనిషి అనుకుంటున్నాడో.. వస్తువు అనుకుంటున్నాడో బాలయ్య.. ఓ రేంజ్ లో వాడేశాడు. ముఖ్యంగా బాలయ్య స్టెప్పులు అన్ని అడల్ట్ సినిమాలో చేసే స్టెప్స్ లో ఉన్నాయని నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు అవేం స్టెప్పులురా మావా అంటూ అమ్మ నా బూతులు తిడుతున్నారు. మీమ్స్ చేసి ఒక ఆట ఆడేసుకుంటున్నారు.
Daaku Maharaj: సీమ గడ్డపై ‘డాకు మహారాజ్ ‘.. ఈవెంట్ ఎప్పుడంటే..?
అయితే ఆట్రోల్స్ ను ఊర్వశీ పొగడ్తలు అనుకుందో ఏమో .. ఏ ఒక్క మీమ్ ను వదలకుండా స్టోరీస్ లో పెట్టుకొచ్చింది. అదేంటి.. ఈ పాపకు తెలుగు చదవడం రాదనుకుంటా.. పాపం అమ్మ నా బూతులు తిడుతున్నా అమ్మడు పొగడ్తలుఅనుకుంటుంది .. ఎవరైనా చెప్పండ్రా అంటూ ఆ పోస్ట్ లను స్క్రీన్ షీట్స్ తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ చిన్నది రియలైజ్ అయ్యి ఆ పోస్టులను తీసేసింది. అప్పటికే జరగాల్సిన రాద్ధాంతం జరిగిపోయింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఊర్వశీ పోస్ట్ లే కనిపిస్తున్నాయి. ఆ ఏదోకటి లే.. పేరుఅయితే వస్తుందిగా అని మేకర్స్ కూడా వదిలేసినట్లు కనిపిస్తున్నారు. మరి ఈ టాక్ తో బాలయ్య సంక్రాంతికి విన్నర్ గా నిలుస్తాడా.. ?లేదా .. ? అనేది తెలియాల్సి ఉంది.