BigTV English

Chhatrapati Shivaji Pet Dog: ఛత్రపతి శివాజీ పెంపుడు కుక్క గొప్పతనం తెలుసా..?

Chhatrapati Shivaji Pet Dog: ఛత్రపతి శివాజీ పెంపుడు కుక్క గొప్పతనం తెలుసా..?

 


Chhatrapati Shivaji Maharaj

Chhatrapati Shivaji’s pet dog History: భారతదేశ చరిత్రలో మహావీరుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ మొదటిగా గుర్తుకు వచ్చేది ఛత్రపతి శివాజి. ఆయన పేరు వింటే హిందూత్వం ఉప్పొంగి పోతుంది. అంచంచలమైన దేశ భక్తుడిగా, శత్రువులకు తలవంచని ధీరుడిగా, మొగలులపై శివాజీ చేసిన యుద్ధాలు భారతదేశ చరిత్రలో  వీరగాధలుగా నిలిచిపోయాయి. ఆయన చిన్నతనంలోనే మొగలుల దాడుల్లో హిందూమతం అంతరించి పోతుందని వారితో యుద్ధంలో అందరూ ఓడిపోయి చేతులెత్తేసిన వేళ.. శివాజీ మహరాజ్ మండే నిప్పుకణిలా దూసుకొచ్చాడు.


మరాఠాల ఘనతను చాటిచెప్పిన ఈ వీరుడి గురించి ఎన్నో కథలు మనం.. మన స్కూల్ లో నేర్పిన పాఠాల్లో కూడా చదివి ఉంటాము. అయితే శివాజీ మహరాజ్ పెంపుడు కుక్క గొప్పతనం గురించి అందరికీ తెలిసి ఉండదు.  ఆయన చేసిన పోరాటాల్లో ఈ కుక్క కూడా పాల్గొనేది అని.. ఇలాంటి కథను కూడా ఎక్కడ విని ఉండరు.

Read more:మూతబడిన థియేటర్‌ని మల్టీఫ్లెక్స్ థియేటర్‌గా మార్చనున్న హీరో

హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెంపుడు కుక్క పేరు వాఘ్య. ఈ పేరుకి అర్ధం ఏమిటంటే.. మరాఠీలో పులి అని అర్ధం. శివాజీ పెంపుడు కుక్క అయిన ఈ వాఘ్య.. జీవితాంతం విదేశీ ఆక్రమణ కారులతో శివాజీ జరిపిన అనేక యుద్ధాలలో వెన్నంటి ఉండి ఎల్లవేళలా సహకరిస్తూ గడిపింది. తన యజమాని శివాజీ యెక్క వాత్సల్యాన్ని వీడలేక మరణాంతరం కాలుతున్న అతని చితిపై దూకి తనువు చాలించింది. వాఘ్య యెక్క విశ్వాసానికి , మనదేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా రాయగడ్ కోట పైన స్మారక స్థూపం కట్టించారు.

1930లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ కుక్కకి సంబంధించిన కథలకు సంబంధించి చరిత్రలో ఎక్కడా ఆధారాలు లేవని, ఈ వాఘ్య విగ్రహాన్ని 2011లో కొంతమంది తొలగించారట. కానీ తరువాత మళ్లీ దీన్ని అక్కడే ప్రతిష్టించారట. మరి ఈ కథలో ఎంతవరకు నిజముందో తెలియదు కాని మరాఠా ప్రజలు మాత్రం దీనిని నమ్ముతుంటారని చెబుతారు.

హిందూ ధర్మం కోసం, దేశం కోసం మరణించిన మనుషులకే కాదు.. ప్రాణాలర్పించిన జంతువులకు సైతం గౌరవాన్ని ఇచ్చి సత్కరిస్తుంది. అభిమానంతో స్మారకాలు నిర్మంచి గుర్తించుకుంటుంది మనదేశం.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×