BigTV English

Dimples: సొట్ట బుగ్గలు రావడానికి కారణం ఏంటో తెలుసా?

Dimples: సొట్ట బుగ్గలు రావడానికి కారణం ఏంటో తెలుసా?

Dimples: నవ్వినప్పుడు చెక్కిళ్లపై కనిపించే ఆ ముద్దుగా ఉండే చిన్న గుంతలు—ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్కృతుల్లో అందమైన, మనోహరమైన గుర్తుగా పొగడ్తలు అందుకుంటున్నాయి. కానీ ఈ ముఖంలోని చిన్న డింపుల్స్ ఎందుకు వస్తాయి? వీటి వెనుక ఏదైనా సైన్స్‌కు సంబంధించిన కారణం ఉందా? జన్యుశాస్త్ర నిపుణులు, వైద్య పరిశోధకులు ఇటీవల చేసిన అధ్యయనాలు సొట్టలు కేవలం అందమైన లక్షణం మాత్రమే కాదని, అవి శరీర రచన, జీన్స్, మనుషుల్లోని వైవిధ్యం మధ్య ఒక ఆసక్తికరమైన కలయిక అని చెబుతున్నాయి.


అసలు కారణం?
సొట్టలు రావడానికి అసలు కారణం ముఖంలో ఉండే జైగోమాటికస్ మేజర్ అనే కండరంలోని తేడా. ఈ కండరం నవ్వినప్పుడు పెదవుల మూలలను పైకి లాగే పని చేస్తుందట. సాధారణంగా ఇది బుగ్గల ఎముక నుంచి పెదవుల మూల వరకు సరళంగా ఉంటుంది. కానీ సొట్టలున్న వాళ్లలో ఈ కండరం చిన్నగా ఉండొచ్చు లేదా రెండు ముక్కలుగా చీలిపోయి ఉండొచ్చని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ అసాధారణత వల్ల కండరం కదిలినప్పుడు చర్మంలో చిన్న గ్యాప్ లేదా గుంత ఏర్పడుతుందట, అదే సొట్టగా మనకు కనిపిస్తుంది. ఈ కండరం రెండుగా చీలినప్పుడు చర్మాన్ని లోపలికి లాగుతుంది, అదే మనం సొట్టలుగా చూసే గుంతగా మారుతుందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జన్యుశాస్త్ర నిపుణురాలైన డాక్టర్ ఎమిలీ చెన్ తెలిపారు.

సొట్టలు ఎవరికి వస్తాయనేది జన్యువులు నిర్ణయిస్తాయి. ఈ లక్షణం తరచూ ఆటోసోమల్ డామినెంట్ రకంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. అంటే, ఒక తల్లి లేదా తండ్రికి సొట్టల జన్యువు ఉంటే, బిడ్డకు అది వచ్చే ఛాన్స్ 50% ఉంది. కానీ ఈ వంశపారంపర్యం ప్రతి సారీ సాధ్యం అవుతుందని చెప్పలేం. సొట్టలు తరాలను దాటిపోవచ్చు లేదా ఊహించని విధంగా కనిపించవచ్చు, ఇది అసంపూర్ణ పెనిట్రన్స్ అనే కారణం వల్ల జరుగుతుందని డాక్టర్ చెన్ అంటారు. ఈ జన్యు తేడా వల్ల ఒకే కుటుంబంలో కొందరు అన్నదమ్ములకు సొట్టలు ఉండగా, మరికొందరికి ఉండకపోవచ్చని చెబుతున్నారు.


జీన్స్?
జన్యువులు తప్ప సొట్టలకు వైద్యపరంగా పెద్దగా ప్రాముఖ్యత లేదు. అవి హానికరం కావు, ముఖం పనితీరును లేదా ఆరోగ్యాన్ని ఏమీ చెయ్యవు. అయినా, వీటి గురించి ఒక ఆసక్తి ఉంది. ఇవి పరిణామంలో ఏదైనా ఉపయోగం చేశాయా అని. కొందరు మానవ శాస్త్రవేత్తలు సొట్టలు యవ్వనం లేదా ఆరోగ్యం గుర్తుగా కనిపించి, పాతకాలంలో జీవిత భాగస్వామి ఎంపికలో కొంచెం ప్రభావం చూపించి ఉండొచ్చని అంటున్నారు. కానీ మరికొందరు దీన్ని కేవలం ఊహాగానం అని, సొట్టలు పుట్టుమచ్చలు లేదా చెవుల ఆకారం లాంటి జన్యు వైవిధ్యం యొక్క ఉప ఉత్పత్తి మాత్రమేనని అంటున్నారు.

ఇంట్రస్టింగ్‌గా, అన్ని సొట్టలూ ఒకేలా ఉండవు. చెక్కిళ్లపై కనిపించే సొట్టలు సాధారణంగా ముఖం రెండు వైపులా సమానంగా ఉంటాయి. కానీ ఒకే వైపు సొట్ట ఉండటం కూడా అరుదేం కాదు. చాలా తక్కువగా, కొందరికి గడ్డం సొట్టలు కనిపిస్తాయి, ఇవి గడ్డంలోని వేరే కండర లేదా ఎముక వల్ల వస్తాయి. రెండు రకాలూ హానికరం కావు, కానీ వీటి వేర్వేరు రూపాలు ముఖ శరీర రచన ఎంత క్లిష్టంగా ఉంటుందో చూపిస్తాయి.

సంస్కృతిలో, సొట్టలు ఎన్నో శతాబ్దాలుగా ముద్దుగా చిత్రీకరించబడ్డాయి. కథల్లో, జానపద కథనాల్లో వీటిని ‘దేవతల ముద్దులు’ లేదా అదృష్ట సంకేతాలు అని చెబుతారు. ఈ రోజుల్లో మీడియా వీటి ఆకర్షణను మరింత పెంచుతోంది, మిరాండా కెర్, హ్యారీ స్టైల్స్ లాంటి సెలెబ్రిటీల సొట్టల నవ్వులు ఎప్పుడూ పొగడ్తలు అందుకుంటాయి. కానీ సొట్టలు ఇష్టమైనవాళ్లు ఎంతమంది ఉన్నా, కొందరు వీటి గురించి సిగ్గుపడతారు, ముఖ్యంగా అవి అసమానంగా లేదా ఎక్కువగా కనిపిస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారు.

కృత్రిమ సొట్టలు చేసే డింపుల్‌ప్లాస్టీ లాంటి కాస్మెటిక్ సర్జరీలు ఉన్నా, వీటిలో మచ్చలు రావడం లేదా సహజంగా కనిపించకపోవడం లాంటి రిస్క్‌లు ఉన్నాయి.

ఏది ఏమైనా పుట్టు మచ్చలు, సొట్టల లాంటి లక్షణాల వెనుక ఉన్న చిన్న చిన్న రహస్యాలపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ముందు రోజుల్లో ఇవి మరింత బయటపడొచ్చు. ప్రస్తుతానికి, అవి శాస్త్రం, అందం, కొంచెం విచిత్రం కలిసిన ఒక ఆనందకరమైన రహస్యంగా ఉన్నాయి.

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×