Gopichand Malineni: ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండు నడుస్తుంది.మల్టీ స్టార్ మూవీస్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు డైరెక్టర్స్ ఎన్నో భాషల హీరోలతో సినిమాలు తీస్తున్నారు. తమిళ్, మలయాళ, హిందీ హీరోలతో తెలుగు డైరెక్టర్లు సినిమాలు తీయడం మనం చూస్తూనే ఉన్నాం. మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ఇటీవల జాట్ మూవీ తో మన ముందుకు వచ్చి సక్సెస్ ని అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేతి దాకా వచ్చిన ఒక తమిళ్ స్టార్ట్ హీరో భారీ ప్రాజెక్టు మిస్ అయినట్టు.. అందుకు గల కారణాలను వివరించారు.. ఆ సినిమా ఏ హీరోదో.. ఆ హీరో ఎందుకు మిస్ చేశారో ఇప్పుడు చూద్దాం..
ఆ ప్రాజెక్ట్ అందుకే మిస్ అయింది.
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇటీవల బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి జాట్ మూవీతో విజయాన్ని అందుకున్నారు. రవితేజతో డాన్ శీను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఎన్నో కమర్షియల్ హిట్ లను అందుకున్నారు. 2023లో బాలకృష్ణతో వీరసింహారెడ్డి తో బ్లాక్ బస్టర్ హీట్ ని అందుకున్నారు. అయితే ఈ సినిమా తరువాత తమిళ్ స్టార్ హీరో విజయ్ తో ప్రాజెక్ట్ ని చేసేందుకు ఒపించి చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ ని వదులుకోవాల్సి వచ్చిందట. అందుగల కారణాలను తాజాగా గోపీచంద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
విజయ్ రాజకీయ స్వార్థం..
బాలకృష్ణతో వీరసింహారెడ్డి చేసిన తరువాత, మరో స్టోరీని రెడీ చేసుకుని తమిళ్ స్టార్ హీరో విజయ్తో ఆ స్టోరీ డిస్కషన్ చేశాము. ఆయనకి స్టోరీ చాలా నచ్చింది. ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేశారు. ఇక బయట పబ్లిక్ అనౌన్స్ చేద్దాం అనుకునే టైంలో, విజయ్ మూవీ టీం మీరు రాజకీయాల్లోకి వెళ్లాలి అని అనుకున్నప్పుడు.. తమిళ డైరెక్టర్స్ ని కాదని తెలుగు డైరెక్టర్ తో మూవీ చేస్తే తమిళ్ ప్రజలు ఎలా స్వీకరిస్తారో అని చెప్పడంతో.. ఆయన ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకున్నారు. అయితే అప్పటికే ఆయన తెలుగు డైరెక్టర్ తో వారసుడు సినిమాలో నటించారు. వరుసగా రెండో సారి కూడా తెలుగు డైరెక్టర్ అంటే తమిళ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, రాజకీయంగా అది ఆయనకు ఏదైనా అడ్డంకి అవుతుందేమోనన్న ఉద్దేశంతో గోపీచంద్ సినిమా వద్దని చెప్పారు అని గోపీచంద్ మలినేని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ విజయ్ రాజకీయ స్వార్థం కోసం తెలుగు డైరెక్టర్ ని అవమానించారంటూ కామెంట్ చేస్తున్నారు.
గోపీచంద్ మలినేని ఎక్కువ సినిమాలు చేసింది హీరో రవితేజ తోనే.. డాన్ శీను, బలుపు, క్రాక్, వంటి బ్లాక్ బస్టర్ హిట్లను రవితేజకు అందించారు. వీర సింహారెడ్డి తరువాత రవితేజ తో మరో మూవీ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా పక్కన పెట్టవలసి వచ్చింది. ఆతరువాత మైత్రి మూవీ మేకర్స్ లో మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ జాట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ని అందుకున్నారు. నెక్స్ట్ బాలకృష్ణతో మూవీ చేస్తున్నట్లు సమాచారం.
Rashmi Gautam: ఆపరేషన్ వల్ల అన్నీ క్యాన్సిల్ అయ్యాయి… రష్మి ఇన్‌స్టా పోస్ట్ వైరల్