Drug dealer Stuck Chimney| ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల చివర్లో పిల్లలందరూ క్రిస్మస్ పండుగ కోసం.. పండుగ సమయంలో శాంటా క్లాజ్ తీసుకువచ్చే కానుకల కోసం ఎదురుచూస్తారు. శాంటా క్లాజ్ క్రిస్మస్ సమయంలో ఆకాశం నుంచి ప్రత్యక్షమై పిల్లలకు కానుకలు అందిస్తాడని క్రైస్తవులు నమ్ముతారు. ఈ పూర్తిగా సాధ్యమయ్యే పని కాదని తెలిసే పిల్లల సంతోషం కోసం చాలా మంది శాంటా క్లాజ్ వేషంలో ఇళ్ల పై కప్పుల నుంచి వచ్చి కానుకలు ఇస్తుంటారు. కానీ ఒక వ్యక్తి క్రిస్మస్ పండుగకు కొంత ముందుగానే శాంటా క్లాజ్ వేషాలు వేశాడు. ఇంటి పై కప్పుకు వెళ్లి చిమ్నీ నుంచి రావాలని ప్రయత్నించి చిక్కుకుపోయాడు. ఇదంతా తనే చెప్పాడు. కానీ ఈ కథ సగం అబద్ధం. ఎందకంటే అతను ఒక నేరస్తుడు. పోలీసులకు పట్టు బడ్డాక శాంటా క్లాజ్ కథ అల్లాడు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మాసాచుస్సేట్స్ రాష్ట్రంలోని ఫాల్ రివర్ ప్రాంతంలో ఇటీవల ఒక పెద్ద పార్టీ జరిగింది. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలు జరుగుతున్నాయని.. ఫాల్ రివర్ డిపార్ట్‌మెంట్ పోలీసులు తెలుసుకొని పార్టీ జరుగుతున్న ఇంటిపై మెరుపు దాడి చేశారు. ఇంటి బయట భారీ సంఖ్యలో కార్లు ఉన్నాయి. లోపలి నుంచి పెద్దగా మ్యూజిక్ వినిపిస్తోంది. లోపల అందరూ పార్టీ మూడ్ లో ఉన్నారు.
Also Read: ఒక కప్పు టీ ధర రూ.లక్ష.. అంతా బంగారమే!
ఇదంతా గమనించిన ఫాల్ రివర్ పోలీసులు ఇంట్లో తులుపులు బద్దలు కొట్టి దూరారు. పోలీసులు రావడం చూసి పార్టీలో ఉన్నవారంతా పరుగులు తీశారు. పోలీసుల చేతికి చిక్కితే అరెస్ట్ ఖాయమని తెలిసి కొందరు ఇంటి రూఫ్ టాప్ మీదకు ఎక్కారు. అయినా పోలీసులు వారిని వెంబడించారు. కొందరు ఇంటి మీద నుంచి అవతలి దూకి తప్పించుకున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం రూఫ్ టాప్ పై ఉన్న చిమ్నీలోకి దూకి.. అక్కడ దాక్కోవాలని భావించాడు. కానీ అతని ప్లాన్ బెడిసికొట్టింది. అతను చిమ్నీలోపల చిక్కుకున్నాడు.
చిమ్నీ నుంచి బయటికి రాలేదక.. కిందికి వెళ్లలేక ఆ పరిస్థితిలో అతడికి సరిగా ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. దీంతో అతను కాపాడమని కేకులు వేశాడు. చిమ్నీ లోపలి నుంచి అరుపులు వినిపించడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. లోపల ఉన్న యువకుడిని చూసి.. అతను అక్కడ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు?. అతను మాత్రం ముందు తనను బయటకు తీసి కాపాడమని వేడుకున్నాడు.
పోలీసులు అతడిని ఎలాగోలా బయటికి తీశారు. కానీ అతడిని అరెస్టు చేయబోగా.. ఆ యువకుడు మాత్రం తను ఆ పార్టీతో సంబంధం ఏమీ లేదని.. కేవలం క్రిస్మస్ పండుగ కోసం శాంటా క్లాజ్ వేషం వేసి చిమ్నీ నుంచి కిందికి వెళ్లడానికి ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నాని చెప్పాడు. కానీ పోలీసులు మాత్రం అతడి కథలు నమ్మలేదు. అతడిని పూర్తిగా సోదా చేయగా.. జేబులో నుంచి డ్రగ్స్ లభించాయి. బహుశా అదే క్రిస్మస్ కానుక కాబోలు అని నవ్వుతూ అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై ఫాల్ రివర్ పోలీసులు స్పందిస్తూ..”ఇక్కడ పార్టీలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో ఇక్కడ దాడి చేశాం. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇంటి రూఫ్ టాప్ ఎక్కి దూకేశారు. కానీ రాబర్ట్ లాంగ్ లెయాస్ (33) అనే వ్యక్తి మాత్రం తెలివితేటలు చూపించి చిమ్నీలో దాక్కున్నాడు. కానీ అక్కడ అతను చిక్కుకోవడంతో అతడిని ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది సాయంతో బయటికి తీశాం. కానీ రాబర్ట్ తాను శాంటా క్లాజ్ వేషాలు వేస్తున్నట్లు నాటకమాడారు. అతడి జేబు నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసకున్నాం. రాబర్ట్ వేసిన శాంటా క్లాజ్ వేషాలు పనిచేయలేదు. అతనితోపాటు తనీషా ఇబే (32) అనే యువతిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశాం.” అని చెప్పారు.