BigTV English

Gold Karak tea Dubai: ఒక కప్పు టీ ధర రూ.లక్ష.. అంతా బంగారమే!

Gold Karak tea Dubai: ఒక కప్పు టీ ధర రూ.లక్ష.. అంతా బంగారమే!

Gold Karak tea Dubai| మీరెప్పుడైనా ఒక కప్పు టీ ధర రూ.1,00,000 ఉంటుందని ఆలోచించారా?. మీకు నమ్మకం లేకపోయినా ఇది నిజం. ఈ టీ ఇండియాలో కాదు దుబాయ్ లోని ఒక రెస్టారెంట్ లో లభిస్తోంది. దీని పేరు గోల్డ్ కడక్ టీ. సుచేత శర్మ అనే వ్యాపారవేత్త దుబాయ్ లో బోహో కేఫ్ ప్రారంభించారు. అక్కడే ఈ అరుదైన టీ లభిస్తోంది. అక్కడ దీని ధర దుబాయ్ కరెన్సీలో 5000 దిర్హమ్‌లు (భారత కరెన్సీలో రూ.1.14 లక్షలు).


గోల్డ్ కడక్ టీ శుద్దమైన వెండి కప్పులో ఇవ్వబడుతుంది. టీ పైన 24 క్యారెట్ల బంగారం ఆకు (ప్యూర్ గోల్డ్ లీఫ్) తో కవర్ చేసి సర్వ్ చేస్తారు. అంతే కాదు టీతో పాటు ఒక వెండి ప్లేటు, బంగారు పూత ఉన్న క్రాయిసెంట్ బ్రెడ్ కూడా ఇస్తారు. వీటిని కావాలంటే కస్టమర్లు జ్ఞాపకార్థంగా తీసుకెళ్లొచ్చు.

Also Read: భార్య పిల్లలను వదిలి ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. 3 నెలల తరువాత ప్రియురాలితో


దుబాయ్ లోని డిఐఎఫ్‌సి కి చెందిన ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్ లో ఈ బోహో కేఫ్ ఉంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. రెండు రకాల మెనూలుండడం. ఒకటి ధనవంతుల కోసం హై ఎండ్ మెనూ, రెండవది ఆఫార్డెబుల్ స్ట్రీట్ ఫుడ్ మెను.. సామాన్య, మధ్య తరగతి ప్రజల కోసం. బంగారు టీ తో పాటు గోల్డ్ సువేనీర్ కాఫీ, గోల్డ్ డస్టెడ్ క్రాయిసెంట్స్, గోల్డ్ డ్రింక్స్, గోల్డ్ ఐస్ క్రీమ్, లాంటి ఖరీదైన ఐటెమ్స్ ఉన్నాయని దుబాయ్ వార్తా పత్రిక ఖలీజ్ టైమ్స్ ప్రచురించింది.

బంగారు, వెండి పదార్థాలతో టీ , కాఫీలు విక్రయించడంపై బోహో కేఫ్ ఓనర్ సుచేతా శర్మ మాట్లాడుతూ.. “మేము సామన్య వర్గం అవసరాలను తీర్చడానికి ముందుగా ఈ సేవలందిస్తున్నాం. అయితే విలాసావంతుల కోసం ఈ ప్రత్యేక బంగారు, వెండి ఐటెమ్స్ సర్వే చేస్తున్నాం.” అని చెప్పారు. కెఫే లోని రాయల్ మెనూ లో గోల్డ్ సువెనీర్ కాఫీ కూడా ఉంది. ఈ కాఫీ ధర 4761 దిర్హమ్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ.1.09 లక్ష).

బోహో కేఫ్ గురించి ఇటీవల ఒక ఫుడ్ వ్లాగర్ వీడియో చేసి సోషల్ మీడియో అప్ లోడ్ చేయగా.. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. తన వైరల్ వీడియోలో ఈ రెస్టారెంట్ సర్వే చేసే ఐటెమ్స్ హై కాస్ట్ గురించి వాటిని సర్వ్ చేసే విధానం గురించి ఆసక్తికరంగా వివరించాడు.

ఈ గోల్డ్ కడక్ టీ గురించి సోషల్ మీడియాలో నెటిజెన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. అసలు ఈ టీ ధర నిజంగానే ఇంత ఉంటుందా? లేదా పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ లాగా అనిపిస్తోందని చెబుతున్నారు.

ఒక నెటిజెన్ ఆసక్తికరంగా కామెంట్ చేశాడు. “నేను కలలో కూడా ఊహించలేను ఇంత ధర చెల్లించి ఒక టీ తాగాలని. బ్రో ఈ టీ తాగడానికి ఇఎంఐలో బిల్లు చెల్లించాల్సి వస్తుందేమో? ” అని రాశాడు.

మరొక యూజర్ అయితే.. “ఇది ఒక డిప్లొమెటిక్ రాబరీ. వాళ్లు ఇచ్చే సిల్వర్ ప్లేటు, గోల్డ్ కవరింగ్ అన్నీ కలుపుకున్నా.. 700 దిర్హమ్‌లు వెల ఉండవు. అలాంటిది 5000 దిర్హమ్‌లు ధర అంటే చాలా ఎక్కువ.” అని కామెంట్ చేశాడు. ఇంకొకడైతే.. “నేను కాఫీలో, క్రాయిసెంట్ లో బంగారం ఎందుకు కలుపుకొని తాగాలి” అని ప్రశ్నించాడు.

ఒక నెటిజెన్ అయితే.. “ఈ టీ తాగే ముందు కస్టమస్ ఆఫీసర్ కు ముందుగానే సమాచారం అందించాలేమో” అని జోక్ చేశాడు.

Related News

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×