Navy Officer ExtraMarital Murder| ఒక యంగ్ నేవీ ఆఫీసర్ కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. చాలా రోజులుగా అతను ఫోన్ కూడా తీయకపోవడంతో అనుమానంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయం తెలిసింది. ఒక సిమెంట్ డ్రమ్ములో అతని శవం ముక్కలు లభించాయి. దీంతో అతను చాలా రోజుల క్రితమే హత్యకు గురయ్యాడని పోలీసులు ధృవీకరించారు. ఈ కేసులో లోతుగా విచారణ చేయగా.. అతనికి ఓ అందమైన భార్య ఉండడమే హత్యకు కారణమని తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరానికి చెందిన సౌరభ్ రాజ్ పుత్ అనే యువకుడు ముస్కాన్ రస్తోగీ అనే యువతిని ప్రేమించాడు. ఇంట్లో తల్లిదండ్రులు అతని ప్రేమను అంగీకరించలేదు. అయితే సౌరభ్ ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో తాను ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబడ్డాడు.. లేకపోతే ఇల్లు వదిలి వెళ్లిపోతానని తల్లిదండ్రులకు బెదిరించాడు. దీంతో అతని కుటుంబసభ్యులు ఒప్పుకోవాల్సి వచ్చింది. అలా 2016లో సౌరభ్ రాజ్ పుత్ కు ముస్తాన్ తో వివాహం జరిగింది. కానీ వీరి దాంపత్య జీవితం ఎక్కువ కాలం సుఖంగా సాగలేదు. ఇంట్లో అత్తా కోడళ్ల గొడవలు జరగడంతో సౌరభ్ వేరేగా కాపురం పెట్టాడు.
2019లో సౌరభ్, ముస్తాన్ దంపతులకు ఒక కూతరు పుట్టింది. దీంతో తన కూతురు, భార్యతో గడపడానికి సమయం దొరకడం లేదని ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత కొద్ది రోజులకే సౌరభ్ కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. సౌరభ్ ఇంట్లో లేని సమయంలో ఇంతకాలం మరొక యువకుడు అక్కడికి వచ్చి వెళుతున్నాడని ఇరుగుపొరుగు వారు సౌరబ్ కు చెప్పారు. అయినా సౌరభ్ వారిని పూర్తిగా నమ్మలేదు. తన భార్య ముస్తాన్ అంటే అతనికి అంత నమ్మకం. కానీ ఒక రోజు సౌరబ్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య మరో యువకుడితో పడక సుఖం అనుభవిస్తుండగా.. అనుకోకుండా సౌరభ్ అక్కడికి వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసి అతని మనసు ఛిద్రమైంది. ఎందుకంటే అక్కడ అతను చూసింది ఎవరినో కాదు తన ప్రాణ స్నేహితుడు సాహిల్ ని. తన భార్య, తన ప్రాణ స్నేహితుడితో తన బెడ్ రూంలో ఉండగా అతను చూశాడు.
Also Read: దొంగనే దోచుకున్న దొంగ.. ఓర్నీ, వీడెవడో మహా కంత్రీలా ఉన్నాడే!
అలా 2023లో సౌరభ్ నేవీ ఆఫీసర్ డ్యూటీపై విదేశాలకు వెళ్లాడు. భార్యపై కోపం ఉన్నా.. తన చిన్నారి కూతురు అంటే సౌరభ్ కు ప్రాణం. అందుకే ఫిబ్రవరి 28 2025న తన కూతురి పుట్టిన రోజు వేడుక కోసం తిరిగి ఇండియాకి వచ్చాడు. అయితే సౌరభ్ విదేశాల్లో ఉన్న సమయంలో అతని భార్య మళ్లీ సాహిల్ తో సంబంధం పెట్టుకుంది. కానీ ఇప్పుడు సౌరభ్ తిరిగి వచ్చాడు. తన కూతురితో గడుపుదామని ఇంటికి వచ్చిన సౌరభ్ ని చూసి సాహిల్, ముస్కాన్ ఓర్వలేకపోయారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి.. సౌరభ్ ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. అందుకోసం మార్చి 4, 2025న ముందుగా సౌరభ్ రాత్రి తాగే పాలలో నిద్ర మాత్రలు కలిపారు. ఆ తరువాత నిద్రపోతున్న సౌరభ్ ను చంపడానికి అర్ధరాత్రి సాహిల్ ఇంటికి వచ్చాడు. ముస్కాన్ అతడని ఇంటి లోపలికి రానిచ్చింది. ఇద్దరూ కలిసి నిద్రపోతున్న సౌరభ్‌ను కత్తితో గొంతుకోసి చంపారు.
ఆ తరువాత తీరికగా అతడి శరీరాన్ని ముక్కలుగా చేసి ఒక పెద్ద డ్రమ్ములో దాచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అందులో సిమెంట్ కాంక్రీటు నిండుగా పోశారు. అంతటితో వారు ఆగలేదు. ఇద్దరూ కలిసి చనిపోయిన సౌరభ్ ఫోన్ తీసుకొని మనాలి టూర్ కు వెళ్లారు. అక్కడి నుంచి మనాలి అందాలను సౌరభ్ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు.
మరోవైపు సౌరభ్ తల్లిదండ్రులు అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. అతను ఆన్సర్ చేయకపోవడంతో వారికి అనుమానం కలిగింది. ముస్కాన్ కూడా వారి ఫోన్ తీయడం లేదు. దీంతో సౌరభ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి.. విచారణ చేయగా.. అతని భార్య ముస్కాన్ అనుమానాస్పద సమాధానాలు ఇచ్చింది. దీంతో ఆమె గురించి లోతుగా విచారణ చేసే సరికి సాహిల్ తో ఆమె అక్రమ సంబంధం గురించి బయటపడింది. వారిద్దరినీ పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా.. సౌరభ్ శవం దాచిన డ్రమ్ము గురించి తెలిసింది. ప్రస్తుతం పోలీసులు సౌరభ్ శవం ఉన్న డ్రమ్మున్ని పోస్ట్ మార్టం కోసం తరలించి విచారణ కొనసాగిస్తున్నారు.