BigTV English

Viral: ఈ దేశంలో ఏడాదికి 13 నెలలు.. మన కంటే ఏడేళ్లు వెనుకే

Viral: ఈ దేశంలో ఏడాదికి 13 నెలలు.. మన కంటే ఏడేళ్లు వెనుకే

Calender: ఈ ప్రపంచం.. జీవ వైవిధ్యం, విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు నెలవు. కానీ, కొన్ని అంశాలను అందరి సౌలభ్యం కోసం ఒకే తీరుగా ఆచరిస్తాం. సూర్యోదయ, అస్తమయాలు ఒక్కో దేశానికి ఒక్కో సమయంలో జరిగినా.. టైమ్ జోన్‌లు వేరుగా ఉన్నా.. ఏడాదికి 365 రోజులు అనేదే గీటురాయిగా తీసుకుంటాం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఏడాదికి 12 నెలలే. ప్రపంచ దేశాలన్నీ ఈ గ్రెగోరియన్ క్యాలెండర్‌నే ఫాలో అవుతాయి. కానీ, ఒక దేశం మాత్రం ఈ విధానాన్ని పాటించడం లేదు. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశం గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో కాదు. ఈ దేశం అనుసరించే క్యాలెండర్‌ ప్రకారం ఏడాదికి 13 నెలలు.


ఈ ఆసక్తికర వివరాలతో సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయింది. ఇథియోపియా క్యాలెండర్‌లో ఏడాదికి 13 నెలలు ఉంటాయి. 13వ నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంటాయి. లీప్ సంవత్సరమైతే ఆరు రోజులు ఉంటాయి. వారంలో ఐదు రోజులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీకి మొదలు కాదు. సెప్టెంబర్ 11వ తేదీకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఈ తేడా ఎందుకు? ప్రపంచ దేశాలన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ ఆచరిస్తే.. ఇథియోపియా మాత్రం క్రీస్తు శకం 525 సంవత్సరంలో రోమన్ చర్చ్ రూపొందించిన ప్రాచీన క్యాలెండర్‌ను అనుసరిస్తున్నది. అందుకే మిగిలిన దేశాలతో ఈ దేశ క్యాలెండర్ భిన్నంగా ఉన్నది. ఈ ప్రాచీన క్యాలెండర్‌ను ఇథియోపియా ఇప్పటికీ వాడుతున్నది. ఈ క్యాలెండర్‌ను గీజ్ క్యాలెండర్ అంటారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సంవత్సరం పరంగా చూసుకుంటే ఇథియోపియా గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే ఏడేళ్లు వెనుకబడి ఉన్నది. అంటే.. మనకంటే ఏడేళ్లు వెనుక ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.


Also Read: Mother Kills Baby: ఇంటి నుంచి పారిపోతున్న తల్లిని పట్టుకొని ఏడ్చిన చిన్నారి.. ఆ పాపని నిర్దాక్షిణ్యంగా..!

ఇథియోపియాలో దీనితోపాటు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇథియోపియా దేశానికి ఘనమైన చరిత్ర ఉన్నది. ఆఫ్రికా ఖండంలో బ్రిటన్ సామ్రాజ్యం ఆక్రమించని ఏకైక దేశం ఇదే. ఇటలీ దేశం ఆరేళ్లు ఇథియోపియాను ఆక్రమించుకుని పాలించింది. అంతకుమించే మరే దేశం చేతిలో వలసదేశంగా లేదు. కాఫీకి పుట్టిళ్లు ఇథియోపియానే.

ఇథియోపియా క్యాలెండర్‌లో 13 నెలలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా! ఈ 13 నెలల పేర్లు విచిత్రంగా ఉన్నాయి. మెస్కెరెం, తికింత్, హిదార్, తహసాస్, తిర్, యకతిత్, మగ్గాబిత్, మియాజియా, గిన్‌బాట, సెనె, హమ్లే, నెహాసా, పాగుమ్‌లు ఈ దేశ గీజ్ క్యాలెండర్‌లోని 13 నెలల పేర్లు. మనకు ఏడాదిలో తొలి మాసం జనవరి అయితే, ఈ గీజ్ క్యాలెండర్‌ మెస్కెరెం నెలతో మొదలవుతుంది. మన క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్ 11వ తేదీన గీజ్ క్యాలెండర్‌ మెస్కెరెం నెల ఆరంభమవుతుంది.

ఈ పోస్టు వైరల్ అయింది. చాలా మంది ఇంట్రెస్టింగ్, ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ‘మన దేశంలో కూడా 13 నెలల క్యాలెండర్ ఉండాల్సింది. ముఖ్యంగా రీచార్జ్ 28 రోజుల గడువు పెట్టే మొబైల్ కంపెనీల ప్రకారం ఇక్కడ కూడా ఏడాదిని 13 నెలలు చేయాల్సింది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Related News

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Big Stories

×