BigTV English

Fact Check: తాబేళ్లను చంపి టూత్ పేస్ట్ తయారీ.. ఇదీ అసలు కథ!

Fact Check:  తాబేళ్లను చంపి టూత్ పేస్ట్ తయారీ.. ఇదీ అసలు కథ!

 BIG TV LIVE Originals: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, నోటి ఆరోగ్యంగా బాగుండాలి. నోరు శుభ్రంగా లేకపోతే పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలంటారు వైద్యులు. ఉదయం నిద్ర లేవగానే, రాత్ర నిద్రపోయే ముందు బ్రష్ చేసుకోవడం మంచిదంటారు. పళ్లు శుభ్రంగా ఉండాలంటే టూత్ పేస్టు కూడా వాడాలి. అయితే, ఈ టూత్ పేస్టును ఎలా తయారు చేస్తారు? అనే విషయం గురించి చాలామందికి పెద్దగా తెలియదు. కొంత మంది మాత్రమే ప్రత్యేకమైన టూత్ పేస్ట్ కావాలని అడుగుతారు. చాలా మంది దుకాణాల్లో ఏ పేస్ట్ దొరికితే, దాన్ని తెచ్చి బ్రష్ చేసుకుంటారు.


తాబేళ్లతో టూత్ పేస్ట్ తయారీ?

రీసెంట్ గా సోషల్ మీడియాలో టూత్ పేస్ట్ తయారీ గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ వీడియో ఏం చెప్తుందంటే.. సముద్రం నుంచి పట్టుకొచ్చిన తాబేళ్లను శుభ్రంగా కడిగి, వాటి తల నుంచి టూత్ పేస్ట్ తయారు చేస్తున్నట్లు ఇందులో చూపించారు. ఈ వీడియో నెట్టింట్ బాగా సర్క్యులేట్ కావడంతో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. నిజంగానే తాబేళ్ల నుంచి టూత్ పేస్ట్ తయారవుతుందా? అని షాక్ అయ్యారు.ఇంతకీ వీడియోలో ఉంది నిజమా? కాదా? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఇంతకీ అసలు విషయం ఏంటంటే?

నిజం ఏంటంటే.. టూత్ పేస్ట్ తయారీకి తాబేళ్లను అస్సలు వాడరు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టూట్ పేస్టులు సరక్షితమైన, హ్యూమన్ ఫ్రెండ్లీ పదార్థాలతో  తయారు చేస్తున్నారు. ఇంతకీ టూత్ పేస్ట్ తయారీలో ఉపయోగించే పదార్థాలు ఏవి? వాటివల్ల కలిగే లాభం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఫ్లోరైడ్: టూత్ పేస్ట్ తయారీలో ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు. ఈ పదార్థం దంతాలను కావిటీస్ నుండి రక్షించడంలో సాయపడుతుంది.

⦿ స్క్రబ్బింగ్ పౌడర్లు: దంతాలను సున్నితంగా శుభ్రం చేయడానికి ఈ పదార్థం ఉపయోగపడుతాయి.

⦿ రుచులు: పుదీనా లాంటి పదార్థాలను నోరు తాజాగా ఉంచేందుకు సాయపడుతుంది.

⦿ ఫోమింగ్ ఏజెంట్లు: బ్రష్ చేసినప్పుడు శుభ్రంగా అనిపించేలా ఫోమింగ్ ఏజెంట్లు సాయం చేస్తాయి.

⦿ ప్రిజర్వేటివ్‌లు: టూత్ పేస్ట్ ట్యూబ్‌ లో ఎక్కువ సేపు ఉండటానికి సహాయపడతాయి.

నిజానికి ఈ పదార్థాలన్నీ ఖనిజాలు. సురక్షితమైన రసాయనాలు లేదంటే మొక్కల ఆధారిత ఉత్పత్తుల నుంచి తయారవుతాయి. తాబేళ్లు వంటి జంతువులు ఉపయోగించబడవు.

Read Also: మొసలితో ఆటలా? ఏం చేసిందో చూడండి.. నీ కల తగలెయ్య!

తాజా వీడియో AI సృష్టి!

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసి చాలా మంది ప్రజలు నిజమే అనుకున్నారు. కానీ, అదంతా కేవలం AI సృష్టిగా నిపుణులు అభిప్రాయపడ్డారు. జస్ట్ వ్యూస్ కోసం ఆ వీడియోను క్రియేట్ చేసినట్లు భావిస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదంటున్నారు. ప్రజలు ఇలాంటి వాటిని చూసి అపోహ పడాల్సిన అవసరం లేదంటున్నారు.

Read Also: పులిని భయపెట్టిన చేప.. ఏం కిక్కుంది మామా!

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA ద్వారా కంప్లైట్ ఫైల్ చేయబడుతుంది.

Related News

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Young president: 20 ఏళ్లకే సొంత దేశాన్ని సృష్టించి తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న యువకుడు, 400 మంది పౌరులు

Finger Cutting Ritual: ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వేళ్లు కట్ చేసుకుంటారు, ఆ ఊర్లో ఇదే ఆచారం!

Big Stories

×