Nani..నేచురల్ స్టార్ నాని(Nani).. వైవిధ్యమైన కథలతో.. పాత్రలను ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు సాగిపోతున్న ఈయన నటుడు కాకముందు సహాయ దర్శకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాధాగోపాలం’ చిత్రానికి క్లాప్ అసిస్టెంట్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని.. ఆ అవకాశం రావడం కోసం ఏకంగా ఏడాదిన్నర పాటు బాపూ ఆఫీస్ ముందు ప్రతిరోజు ఎదురుచూసేవారట.ఒక్క ఛాన్స్ అంటూ ఆ ఛాన్స్ అందుకోవడానికి ఏడాదిన్నర సమయం పట్టిందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఒక్క అవకాశం కోసం ఏడాదిన్నర తిరిగాను – నాని
గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్న ఈ విషయం ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది.. “దర్శకులకు మనం ఏదోరకంగా కనిపిస్తూనే ఉండాలి. లేకపోతే వాళ్లు మనల్ని మరిచిపోతారు అని అనుకునేవాన్ని. అందుకు ఏం చేయాలో అని ఆలోచించాను. దీంతో ప్రతిరోజు ఉదయం 9 గంటలకల్లా బాపు గారి ఆఫీస్ కి వెళ్ళిపోయేవాన్ని. బయట ఉండే కుర్చీలలో కూర్చొని, వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకి వస్తారా అని ఎదురుచూసే వాడిని.. అలా చూస్తూ చూస్తూ ఒక్కోసారి రాత్రి 7:00 వరకు ఎదురు చూసేవాడిని. ఇక ఆ సమయంలో నాకు కొంచెం పొట్ట ఉండేది కానీ అలా వేచి చూడడం వల్ల అది కూడా పోయింది. లంచ్ టైంలో అందరూ ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. ఆ సమయంలో నేను బయటకు వెళ్తే ఎవరికీ కనబడను కాబట్టి ఏడాదిన్నర పాటు మధ్యాహ్నం భోజనం చేయకుండా ఆయన టీం వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు కనపడాలని అలాగే ఉండేవాడిని.చివరికి ఒకరోజు వీడు వదిలేలా లేడు అని ‘రాధాగోపాలం’ సినిమాకి క్లాప్ అసిస్టెంట్ గా పదవి ఇచ్చారు. అది నాకు దక్కిన అదృష్టం బాపు గారి స్కూల్ నుంచి నా కెరియర్ మొదలు పెట్టాలని ఫీలింగ్ ఎప్పటికీ మర్చిపోను..” అంటూ నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఒక్క అవకాశం కోసం నాని ఎదురు చూడగా.. ఇప్పుడు ఆయన చుట్టూనే వందలాది మంది ఆర్టిస్టులు తిరుగుతున్నారు అనడంలో సందేహం లేదు. ఇక దీన్ని బట్టి చూస్తే ఇది కదా అసలైన సక్సెస్ అంటే అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.
నాని సినిమాలు..
నాని సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu)దర్శకత్వంలో ‘హిట్ 3’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి. దీనికి తోడు నాని మునుపెన్నడు నటించని విధంగా చాలా క్రూరంగా ఈ సినిమాలో నటించారు. ముఖ్యంగా అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నాని.. రౌడీ కంటే దారుణంగా నటించినట్లు మనకు ట్రైలర్ లోచూపించారు.మొత్తానికైతే రక్తంతో విధ్వంసం సృష్టిస్తున్న నాని ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలిఇక ఇందులో ‘కే జి ఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా నటిస్తోంది.