Teacher Turns OnlyFans Model| ఓన్లీ ఫ్యాన్స్ ఈ పెద్దల ఎంటర్‌టెయిన్మెంట్ యాప్ తో మోడల్ చేసే వారు బాగా సంపాదించేస్తున్నారు. అందుకోసమే ఓ మహిళా టీచర్ కూడా అదనపు ఆదాయం కోసం ఇందులో మాడల్ గా పనిచేయడం ప్రారంభించింది. అయితే ఆమె ఒక క్రిస్టియన్ కాథలిక్ స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పే ఉద్యోగం చేస్తోంది. ఇలా ఆమె రెండు పనులు చేస్తోందని తెలిసి స్కూల్ యజమాన్యం షాక్ అయింది. స్కూల్ లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఆ టీచర్ ఇలా బట్టలు లేకుండా ఆన్ లైన్ లో ఫొటోలు పెడుతోందని తెలుసుకొని వాట్సాప్ , ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు. దీంతో స్కూల్ తమ యజమాన్యం తమ పరువు కాపాడుకునేందుకు సదరు టీచర్ ని సస్పెండ్ చేసింది. ఈ ఘటన ఇటలీ దేశంలో జరిగింది.
ది టెలీగ్రాఫ్ పత్రికా కథనం ప్రకారం.. ఇటలీలో ఓ కేథలిక్ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న ఎలేనా మరాగా అనే 29 ఏళ్ల యువతి ఓన్లీ ఫ్యాన్స్ అడల్ట్ యాప్ లో మోడల్ గా పార్ట్ టైమ్ చేస్తోంది. స్కూల్ వేళలు ముగిసిన తరువాత తన ఇంట్లోనే ఒక గదిలో స్టూడియో లాగా చేసుకొని కెమెరా, లైటింగ్ అన్ని సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకుంది. పిల్లలకు చదువు చెప్పడం అవగానే ఇంటి కొచ్చి తన అందాన్ని అమ్మకానికి పెడుతుంది. గదిలో పొట్టి బట్టు వేసుకొని కొన్ని, అసలు బట్టలు లేకుండా మరి కొన్ని ఫొటోలు పెడుతుంది. ఆమె ఫొటోలు, వీడియోలు ఓన్లీ ఫ్యాన్స్ లో బాగానే సేల్ అవుతున్నాయి. దీంతో ఎలెనా మార్గాకు మంచి ఆదాయం సమకూరుతోంది.
అయితే ఆమె ఇలా చేయడం.. స్కూల్ పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరికి తెలిసిపోయింది. బహుశా వారు ఆ యాస్ యూజర్స్ అయి ఉండొచ్చనే టెలీగ్రాఫ్ పేర్కొంది. ఇంకేముంది ఈ విషయం తెలసుకున్న ఆ పేరెంట్.. వాట్సాప్ గ్రూప్ లో ఇతర పేరెంట్స్ కు తెలియజేశాడు. వారంతా స్కూల్ యజమాన్యంపై విమర్శలు చేశారు. తమ పిల్లలకు నీతులు చెప్పే టీచర్ ఇలాంటి పనులు చేస్తే.. పిల్లలు నైతిక విలువలు కోల్పోతారని వాదించారు. దీంతో స్కూల్ యజమాన్యం.. వెంటనే ఎలెనా ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.
Also Read: సీరియస్ బిజినెస్ మీటింగ్‌లో బాస్‌ను చూసి నవ్విన ఉద్యోగి.. తరువాత ఏమైందంటే
ఈ పరిణామాలపై ఎలెనా కూడా వెంటనే స్పందించింది. తాను ఎవరికీ హాని తలపెట్టడం లేదని.. ఖాళీ సమయంలో తాను ఏం చేస్తున్నానో ఇతరులకు దాని గురించి అనవసరమని ధీటుగా సమాధానం చెప్పింది. అంతేకాకుండా తనకు నెల జీతంగా అందే 1,200 యూరోలు (భారత కరెన్సీలో రూ.1.1 లక్ష) ఏ మాత్రం సరిపోవడం లేదని.. అందుకే తాను అదనపు ఆదాయం కోసం ఈ పని చేస్తున్నానని తెలిపింది.
“ఎడుకేషనల్ సైన్సెస్ లో నేను డిగ్రీ పూర్తి చేశాను. క్యాథలిక్ స్కూల్ లో అయిదేళ్లు పనిచేసిన అనుభవం ఉంది. పిల్లలకు చదువు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. అది నా వృత్తి. నేను ఇషపడే చేస్తున్నాను.అయితే నా ఫ్రెండ్స్ కొందరు ఓన్లీ ప్యాన్స్ మోడల్ గా కెరీర్ ఎంచుకున్నారు. వారంతా బాగానే సంపాదిస్తున్నారు. నేను ఫిట్ గా అందంగా ఉంటాను. అందుకే నేను కూడా నా శరీరాన్ని చూపిస్తూ.. ఈ పని చేయగలను అని అనిపించింది. అయితే ఆ వృత్తి ద్వారా వచ్చే సంపాదన కంటే ఇలా ఇంటర్నెట్ లో ఫొటోలు అమ్ముకోవడం ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నాను. కేవలం ఒక నెల క్రితమే నేను ఓన్లీ ఫ్యాన్స్ లో సభ్యత్వం తీసుకొని పని ప్రారంభించాను. నేను టీచర్ గా నెలంతా పనిచేసి సంపాదించే డబ్బు ఒక్కరోజులోనే వచ్చేసింది. అది చూసి నేను షాకయ్యాను”. అని ఎలేనా ఇటలీ మీడియాతో చేసిన ఇంటర్‌వ్యూలో చెప్పింది.
ఎలేనా ఒక టీచర్ ఒక అడల్డ్ యాప్ మోడల్ గా పనిచేస్తోందని ఇటలీ మీడియా కథనం ప్రచురించగానే ఇది దేశ వ్యాప్తంగా వివాదాస్పదమైంది. అందుకే ఇటలీ విద్యాశాఖ కొత్త నిబంధనలు రూపొందించే పనిలో పడింది. టీచర్లు, ఇతర సమాజ సేవ లాంటి ఉద్యోగాలు చేసే వారు అడల్డ్ మోడల్స్ గా పనిచేయడంపై నిషేధం విధించబోతున్నట్లు తెలిసింది. టీచర్లు ఇకపై తమ వృత్తి, స్కూల్ పై చెడు ప్రభావం చూపే ఎటువంటి చర్యలకు పాల్పడినా వారి జైలు శిక్ష విధించే అవకాశముంది.
అయితే నెటిజెన్లు ఈ వివాదం తెగ డిబేట్ చేస్తున్నారు. కొందరు ఎలేనాకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు నైతిక విలువలకు ఆమె చేస్తున్నది విరుద్ధమని చెబుతున్నారు.
2024లో కూడా ఆన్ లైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠాలు చెప్పే జారా ధర్ అనే యూట్యూబర్, టీచర్.. ఒక్కసారిగా ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ గా మారిపోయింది. దీంతో ఆమె ఛానెల్ సబ్ స్క్రైబర్లు ఒక్కసారిగా షాకయ్యారు.