BigTV English

HR manager fraud: ఇదెక్కడి మోసం మామా.. 22 ఫేక్ ఎంప్లాయిస్‌ తో రూ.18 కోట్లు కొట్టేసిన హెచ్‌ఆర్!

HR manager fraud: ఇదెక్కడి మోసం మామా.. 22 ఫేక్ ఎంప్లాయిస్‌ తో రూ.18 కోట్లు కొట్టేసిన హెచ్‌ఆర్!

HR manager in Shanghai: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. కానీ, ఎప్పుడో ఒకప్పుడు అతడి పాపం పండుతుంది. అడ్డంగా దొరికిపోతాడు. తిన్నదంతా కక్కాల్సి ఉంటుంది. అచ్చంగా చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. కంపెనీలో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తే దగా చేశాడు. ఏకంగా రూ. 18 కోట్లు వెనుకేసుకున్నాడు. కంపెనీ పెద్దలకు అనుమానం కలగడంతో అసలు రంగు బయపడింది. సదరు హెచ్ ఆర్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

చైనాలోని షాంగై ప్రాంతంలో పెరోల్ అనే లేబర్ సర్వీసెస్ కంపెనీ ఏర్పాటు అయ్యింది. ఈ కంపెనీకి హెచ్ ఆర్ మేనేజర్ గా యాంగ్ ఉండేవాడు. మొదట్లో బాగానే పని చేసినా, ఆ తర్వాత తన బుద్ది గడ్డితిన్నది. కంపెనీ సొమ్మును అప్పనంగా కొట్టేయాలి అనుకున్నాడు. దశాబ్ద కాలంలో ఏకంగా 22 మంది ఫేక్ ఎంప్లాయిస్ ను క్రియేట్ చేశాడు. వారందూ ఆఫీస్ వస్తున్నట్లు యాజమాన్యాన్ని నమ్మించాడు. కంపెనీలో సాలరీ రివ్యూ ప్రాసెస్ లేకపోవడంతో కథంతా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. గత 10 ఏండ్లుగా ఫేక్ ఎంప్లాయీస్ సాలరీ అంతా తన అకౌంట్ లోకి మలుపుకున్నాడు.


కంపెనీకి అనుమానం ఎలా కలిగిందంటే?

ఈ కంపెనీలో యాంగ్ తొలుతు సన్ అనే ఫేక్ ఎంప్లాయాని క్రియేట్ చేశాడు. అతడు కంపెనీలో జాయిన్ అయిన దగ్గరి నుంచి ఏ ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. రోజూ ఆఫీస్ కు వస్తున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఏండ్ల తరబడి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ఆఫీస్ రావడం ఏంటిని ఉన్నతాధికారులకు అనుమానం కలిగింది. అసలు విషయం ఆరా తీశారు కంపెనీ బాధ్యులు. అతడి గురించి ఆఫీస్ లో ఎంక్వయిరీ చేయగా, ఆ పేరుతో ఈ కంపెనీలో ఎవరూ పని చేయడం లేదని చెప్పారు. లోతుగా పరిశీలించాక అతడు ఒక ఫేక్ ఎంప్లాయీగా తేలింది. ఇంకా ఇలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారేమోనని విచారిస్తే.. ఏకంగా 22 మంది తేలారు. కంపెనీ బాధ్యులకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది. ఈ విషయం గురించి యాంగ్ ను ప్రశ్నించగా, అతడు తలాతోకా లేని సమాధానాలు చెప్పాడు. వెంటనే కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో చేసిన మోసాన్ని ఒప్పుకున్నాడు. ఈ మోసం బయటపడటంతో కంపెనీ తాజాగా సాలరీ రివ్యూ సిస్టమ్ ను తీసుకొచ్చింది.

Read Also: కన్యత్వాన్ని వేలానికి పెట్టిన అమ్మాయి.. రూ.18 కోట్లతో దక్కించుకున్న హాలీవుడ్ నటుడు

యాంగ్ కు  10 ఏండ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం

పోలీసులు యాంగ్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లగా, న్యాయమూర్తి 10 ఏండ్లు జైలు శిక్ష విధించారు. అతడికి ఉన్న పొలిటికల్ రైట్స్ ను కూడా ఏడాది పాటు రద్దు చేసింది. అటు కంపెనీ నుంచి కొట్టేసిన డబ్బులో  1.1 మిలియన్ యువాన్లు ( భారత కరెన్సీలో రూ. 1.2 కోట్లు) తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అటు అతడి కుటుంబం మరో 1.2 మిలియన్ యువాన్లు (భారత కరెన్సీలో రూ. 1.3 కోట్లు) తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

Read Also: ప్రపంచంలోనే అతిపెద్ద బీరు మ్యూజియం, ఇక్కడ ఎన్ని రకాల బీర్లు ఉంటాయో తెలుసా?

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×