ఈ తరం కుర్రాళ్లు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. వేసుకునే బట్టల నుంచి తినే తిండి వరకు డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. ఇక హెయిర్ స్టైల్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. తల్లిదండ్రులే తమ పిల్లలకు రకరకాల స్టైల్స్ లో హెయిర్ కట్ చేయిస్తున్నారు. కాస్త పెద్దయ్యాక వారి హెయిర్ స్టైల్ చూస్తేనే ఎదుటి వారికి కంపరం కలుగుతుంది. ఇదేం హెయిర్ స్టైల్ రా అయ్యా అనేలా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కనిపించే హెయిర్ స్టైల్స్ చూస్తుంటే అయ్య బాబోయే అనేలా ఉంటున్నాయి. అలాంటి రెండు హెయిర్స్ స్టైల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
జుట్టును పెంకలా మార్చి.. మిరపకాయలు వేయించి..
పిచ్చి తనానికి పరాకాష్ఠ ఈ హెయర్ స్టైల్. జుట్టును చుట్టూ హెయిర్ హీటర్ సాయంతో పైకి పాన్ లా మార్చాడు. దానికి ఓ హ్యాండిల్ మారిదిగా జుట్టును సెట్ చేశారు. కింది వైపు ఉన్న జుట్టును ట్రిమ్మర్ తో దగ్గరికి కట్ చేశారు. ఇక పాన్ మీద మిరపకాయలు వేసి, గరిటెతో వేయించినట్లుగా వీడియో తీశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ఇలాంటి వాడిని తల్లిదండ్రులు ఎలా భరిస్తున్నారో” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. “నేనే వాడి బాబును అయితే, బ్లేడు తీసుకొని గుండు కొట్టేవాడిని వెధవకు” అంటూ మరికొంత మంది మండిపడుతున్నారు. “తల్లిదండ్రులు ఇచ్చిన అలుసే వారు ఇలా తయారయ్యేలా చేస్తుంది” అని ఇంకొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
తల మీదే ఫిష్ ఎక్వేరియం!
ఇక ఈయన గారి పైత్యం మరో లెవల్. ఏకంగా తల మీదే ఎక్వేరియం ఏర్పాటు చేయించుకున్నాడు. బార్ బర్ ముందుగా నీట్ గా గుండు చేశాడు. ఆ తర్వాత గుండు మీద మైనంతో కూడిన మెత్తటి పదార్థంతో చుట్టూ ఓ వాల్ కట్టాడు. ఆ తర్వాత గుండు మీద నీళ్లు పోసి అందులో చిన్న చేపలు వదిలాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక జుట్టు మీద ఫిష్ ఎక్వేరియం చూసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నెటిజన్లు. “ఇది ముమ్మాటికీ జంతు హింస కిందికే వస్తుంది” అంటున్నారు. “చేపలు బొమ్మలు కాదు. నిజంగా అత్యంత దారుణమైన విషయం. అతడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి” అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. “గుండు మీద ఫిష్ ఎక్వేరియం పెట్టుకుని నిద్ర ఎలా పోతావురా అయ్యా?” అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “వీడి గుండు మీద పావురాల గూడు పెడితే ఇంకా బాగుంటుంది” అని ఇంకొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: మొసళ్లతో నిండిన నదిని దాటబోయిన 8 నక్కలు.. చివరికి ఎన్ని మిగిలాయంటే?