Puri Jagannadh: ఈరోజుల్లో చాలామంది దర్శకులు ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ హీరోల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు మాత్రమే కాదు.. సీనియర్ హీరోలు సైతం కొత్త దర్శకులే కావాలంటూ కొత్త టాలెంట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ సీనియర్ డైరెక్టర్లను మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందించిన సీనియర్ డైరెక్టర్లంతా ఇప్పుడు ఔట్‌డేటెడ్ అయిపోయారు. ఒకప్పుడు వారిపై ఉన్న అభిమానంతో అయినా ఇప్పుడు వారు తెరకెక్కించే సినిమాలు చూద్దామంటే ప్రేక్షకుల వల్ల కావడం లేదు. అలా ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొని ఇప్పుడు ఒక్క హిట్ కోసం పరితపిస్తున్న దర్శకుల్లో పూరీ జగన్నాధ్ కూడా ఒకడు.
కామెంట్స్‌ను డోంట్ కేర్
ఒకప్పుడు పూరీ జగన్నాధ్ అంటే ఒక డ్యాషింగ్ డైరెక్టర్. తన సినిమాల్లో హీరోలను కొత్తగా చూపించే ఒక క్రియేటివ్ దర్శకుడు. కానీ గత కొన్నేళ్లలో తనకు దక్కిన ఈ ట్యాగ్స్ అన్నీ పోయాయి. అందుకే చాలామంది హీరోలు తనను పక్కన పెట్టేశారు. తన కథలను ఎవరూ నిర్మించడం లేదని తానే స్వయంగా పూరీ కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆ నిర్మాణ సంస్థలో హీరోయిన్ ఛార్మీని కూడా పార్ట్‌నర్‌గా చేర్చుకున్నాడు. ఛార్మీ వల్లే పూరీ కెరీర్ ఇలా అయిపోయిందని ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేస్తున్నా తను మాత్రం పట్టించుకోవడం లేదు. అంతే కాకుండా గతంలో చేసిన తప్పులనే రిపీట్ చేయడానికి సిద్ధమయ్యాడు.
మళ్లీ నిర్మాతగా
పూరీ జగన్నాధ్, ఛార్మీ కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలకు పూరీ జగన్నాధే దర్శకుడిగా వ్యవహరించాడు. ‘డబుల్ ఇస్మార్ట్’ విషయం పక్కన పెడితే.. ‘లైగర్’ విషయంలో మాత్రం పూరీ, ఛార్మీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అట్టర్ డిశాస్టర్ అయ్యింది. అయినా కూడా తీరు మార్చుకోకుండా మరొక రొటీన్ స్టోరీతో, ప్రేక్షకులను బోర్ కొట్టించే స్క్రీన్ ప్లేతో ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కించాడు. దాని పరిస్థితి కూడా అంతే. ఇలా రెండు దెబ్బలు తగిలినా కూడా పూరీ ఏమీ మారకుండా మరొక యంగ్ హీరోతో సినిమాను డైరెక్ట్ చేస్తూ దానిని ఛార్మీతో కలిసి నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాడు.
Also Read: సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే మొదటిసారి.. ‘సంబరాల ఏటి గట్టు’ కోసం వేయి మందితో..
ఇద్దరికీ హిట్ కావాలి
పూరీ జగన్నాధ్ (Puri Jagannadh), అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కాంబినేషన్‌లో త్వరలోనే ఒక సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అక్కినేని వారసుడు అఖిల్ కూడా ఒక్క హిట్ పడితే చాలు.. అనే పరిస్థితిలో ఉన్నాడు. ఇక పూరీ జగన్నాధ్‌ది కూడా అదే పరిస్థితి. అందుకే ఈ ఇద్దరూ కలిసి ఏదైనా కొత్త మ్యాజిక్‌ను క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. పూరీ జగన్నాధ్ అక్కినేని హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ పలుమార్లు వచ్చినా కూడా అవి ఎందుకో వర్కవుట్ అవ్వలేదు. ఫైనల్‌గా ఇన్నేళ్ల తర్వాత ఒక్క హిట్ కోసం పరితపిస్తున్న అక్కినేని అఖిల్‌తో సినిమా చేయడానికి పూరీ ముందుకొచ్చాడు. మరి ఈ మూవీ అయినా వీరిద్దరినీ మళ్లీ ట్రాక్‌లో పడేలా చేస్తుందో లేదో చూడాలి.