Funny Wedding Video Bride Falls| పెళ్లి అంటే కేవలం స్త్రీ, పురుషుల మధ్య ఒక దాంపత్య జీవనానికి ఆరంభం మాత్రమే కాదు. భారత సంస్కృతిలో రెండు కుటుంబాల మధ్య ఒక పండుగ లాంటిది. ఆ పెళ్లిలో బంధువులు, మిత్రులు అంతా సరదాగా ఆటపట్టిస్తూ, డాన్సులు చేస్తూ దాన్ని మరుపురాని రోజుగా మార్చేస్తారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిలో జరిగే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్‌కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో అయితే, కొన్ని సందర్భాల్లో వధూవరుల మధ్య జరిగే గొడవలు లేదా అపార్థాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్‌లో ఒక వీడియోని నెటిజెన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. పైగా దాన్ని అందరికీ షేర్ కూడా చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. వీడియోలోని దృశ్యాలు ఇలా ఉన్నాయి. అది ఒక ఉత్తర భారతదేశంలోని జరుగుతున్న పెళ్లి. ఆ పెళ్లి రిసెప్షన్ ఫంక్షన్ జరుగుతోంది. ఈ వీడియోలో వధువు అనుకోకుండా కుర్చీ నుంచి వెనక్కి పడిపోయిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడియోలో వధూవరులు స్టేజీపై ఇద్దరూ తమ తమ కుర్చీలలో కూర్చొని అతిథులను కలుస్తున్నారు. కొంత సమయం తర్వాత, కొంతమంది అతిథులు వారి వెనుక నడుస్తూ వచ్చారు. ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి చక్కగా నడుస్తూ వారి కుర్చీల వెనుక నుంచి వెళ్లిపోయాడు. అయితే రెండవ వ్యక్తి చేతిలో కొంత నగదు ఉంది. ఆ కరెన్సీ నోట్లను అతను పెళ్లికూతురు తలపై నుంచి తిప్పాలని చూశాడు. ఈ క్రమంలో తడబడి స్టేజి పై నుంచి జారిపడుతూ.. వధువు కుర్చీని పట్టుకు్నాడు. దీంతో అనుకోకుండా వధువు ఆమె కుర్చీతో సహా వెనక్కు లాగేసి నట్లు అయింది. ఫలితంగా ఆ పెళ్లికూతురు తన కుర్చీతో సహా స్టేజీ మీద నుంచి వెనక్కు పడిపోయింది. పెళ్లికూతురు, ఆ రెండో వ్యక్తితో పాటు వరుసలో నడుస్తున్న మూడో వ్యక్తి కూడా స్టేజీపై నుంచి కింద పడ్డాడు.
ఈ ఘటనను గమనించిన కొందరు అతిథులు వెంటనే ఆమెను సహాయం చేయడానికి వచ్చినప్పటికీ, వరుడు మాత్రం కూర్చొని ఉండి, ప్రశాంతంగా సంఘటనను చూశాడు. వధువు ఆరోగ్యం గురించి లేదా ఈ ఘటన తర్వాత ఏం జరిగిందనే వివరాలు వీడియోలో చూపించలేదు. ఈ ఘటన మే 11, 2025న జరిగినట్లు వీడియోలో తెలుస్తోంది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో యూజర్లు వెంటనే ఫన్నీగా కామెంట్స్ చేస్తూ దీన్ని బాగా షేర్ చేస్తున్నారు. ఒక యూజర్ ఫన్నీగా కామెంట్ చూస్తూ..“వరుడి రియాక్షన్ చూస్తూ.. ‘5 స్టార్ తిను, ఏమీ చేయకు’ అన్నట్లు చూస్తూ కూర్చున్నాడు ” అని రాశాడు. మరొకరు, “ఇది చాలా ఫన్నీగా ఉంది, మళ్లీ ఒకసారి జరగాలి” అని రాశారు. చాలా మంది నవ్వు ఎమోజీలతో స్పందిస్తున్నారు.
Also Read: పరోటాతో ఉచిత గ్రేవీ ఇవ్వలేదని రెస్టారెంట్‌పై కేసు.. కోర్టు ఏం చెప్పిందంటే?
ఇలాంటి ఫన్నీ ఘటనలు భారతీయ వివాహాల్లో కోకొల్లలు. గతంలో కూడా ఒక వీడియో వైరల్ అయింది, అందులో పెళ్లికి వచ్చిన అతిథులు ఒక శిశువు తీసుకొని పెళ్లికి వచ్చారు. దంపతులు తమ బిడ్డను వధూవరులకు అప్పగించి భోజనం చేయడానికి వెళ్లారు. ఆ బిడ్డ తల్లిదండ్రులు భోజనం ఆస్వాదిస్తుండగా, వధువు ఆ బిడ్డను చూసుకోవడంలో ఇబ్బంది పడుతూ కనిపించింది. ఒక సమయంలో ఆమె విసిగిపోయి, వరుడితో చూపులు మార్చుకుంది. వెంటనే వరుడు ఏడుస్తున్న బిడ్డను తీసుకుని ఆమెకు సహాయం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో రెండు రకాల స్పందనలను రేకెత్తించింది. కొందరు వరుడి సంరక్షణా వైఖరిని మెచ్చుకోగా, మరికొందరు బిడ్డ తల్లిదండ్రులు అలా చేయడం సరికాదని విమర్శించారు.
?utm_source=ig_embed&ig_rid=501c09c4-e423-47be-8b27-323395f11085