BigTV English

OTT Movie : ఓటీటీలో ఉన్న బెస్ట్ 5 తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ లు… ఇందులో మీరెన్ని చూశారు?

OTT Movie : ఓటీటీలో ఉన్న బెస్ట్ 5 తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ లు… ఇందులో మీరెన్ని చూశారు?

OTT Movie : ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక భాష అనే అడ్డుగోడ తొలగిపోయింది. ఏ భాషలో ఉన్న సినిమాలు, సిరీస్ లనైనా చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే నచ్చిన భాషలో ఇతర భాషలలో వచ్చిన సినిమాలను చూస్తే ఆ కిక్కే వేరప్పా అన్నట్టుగా ఉంటుంది. అలా తెలుగులో డబ్ అయిన ఇతర భాషల్లోని మస్ట్ వాచ్ సిరీస్ ల గురించి చెప్పుకుందాం.


1. DOM (2024)

ఈ సిరీస్ బ్రెజిలియన్ క్రైమ్ డ్రామా. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ 2021లో ప్రారంభమై, 2024లో మూడవ చివరి సీజన్‌తో ముగిసింది. మధ్యతరగతి యువకుడైన పెడ్రో డోమ్ (గాబ్రియల్ లియోన్), అతని తండ్రి విక్టర్ డాంటాస్ (ఫ్లావియో టోలెజాని) కథను చెప్పే సిరీస్. ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. పెడ్రో టీనేజ్‌లో కొకైన్‌కు బానిస అవుతాడు. తర్వాత 2000లలో క్రిమినల్ గ్యాంగ్ నాయకుడిగా మారతాడు. అతని తండ్రి విక్టర్, ఒక పోలీసు అధికారి, తన జీవితమంతా మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడానికి పోరాడుతాడు. అయితే తన కొడుకును రక్షించడానికి కూడా ఆయన ప్రయత్నిస్తాడు. తరువాత ఏం జరిగింది అన్నదే స్టోరీ.


2. Khauf (2025)

‘ఖౌఫ్’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ హారర్ వెబ్ సిరీస్ స్టోరీ ఢిల్లీలోని ఒక మహిళల హాస్టల్‌లో సాగుతుంది. ఈ కథ మాధురి (మోనికా పన్వార్) చుట్టూ తిరుగుతుంది. ఆమె ఉంటున్న హాస్టల్ గదిలో దెయ్యం ఉండడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ తో సాగే ఈ సిరీస్ ను హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్.

3. Bet (2025)

ఈ సిరీస్ సెయింట్ డొమినిక్స్ ప్రిపరేటరీ స్కూల్ అనే ఎలైట్ బోర్డింగ్ స్కూల్‌లో జరుగుతుంది. ఇక్కడ సామాజిక హోదాను జూదం ద్వారా నిర్ణయిస్తారు. ఈ స్కూల్‌లో విద్యార్థులు తమ ధనవంతులైన తల్లిదండ్రుల నుండి భారీ మొత్తాలను జూదంలో పందెం వేస్తారు. ఇందులో ఓడిపోయిన వారు “హౌస్ పెట్స్”గా మారాల్సి ఉంటుంది. హౌస్ పెట్స్ అంటే వాళ్ళు ఇతరులకు సేవకులుగా మారతారు. ఇది కాకేగురుయి ఆధారంగా రూపొందిన నెట్‌ఫ్లిక్స్ (Netflix)  సిరీస్.

4. Parasyte: The Grey (2024)

హిటోషి ఇవాకి రాసిన మాంగా ఆధారంగా నిర్మించిన దక్షిణ కొరియా సై-ఫై హారర్ సిరీస్ ‘పారసైట్: ది గ్రే’. నెట్‌ఫ్లిక్స్‌లో 2024 ఏప్రిల్ 5న విడుదలైంది. అంతరిక్షం నుండి భూమిపైకి వచ్చిన పరాన్న జీవులు మానవుల శరీరాలను ఆక్రమించి, వారి మెదడులను నియంత్రించి, ఆకారం మార్చే రాక్షసులుగా మారుస్తాయి. ఇతరులను చంపి తింటాయి. ఒక్కసారి ఈ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు.

5. Bad Boy (2023)

ఇదొక ఇజ్రాయెలీ క్రైమ్ డ్రామా సిరీస్. డీన్ షేయ్‌మాన్ అనే 13 ఏళ్ల యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ఒక రాత్రి, అతని ఇంట్లో పోలీసులు దాడి చేసి, డ్రగ్స్ డీలింగ్ ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేస్తారు. దీని వల్ల ఆ అబ్బాయి ఒక కఠినమైన జువెనైల్ డిటెన్షన్ ఫెసిలిటీలో చేరతాడు. 20 సంవత్సరాల తర్వాత అతనే సక్సెస్ ఫుల్ స్టాండ్-అప్ కమెడియన్‌గా మారిన మారతాడు. కానీ గతం అతన్ని నీడలా వెంటాడుతుంది.

Read Also : సంచలనం సృష్టించిన రియల్ స్టోరీ… గ్రిప్పింగ్ స్టోరీతో అదిరిపోయే మలయాళ యాక్షన్ థ్రిల్లర్

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×