Telia Bhola Fish: ఒడిషాలోని ఓ మత్యృకారుడికి పంట పడింది. ‘తెలియా భోలా ఫిష్’ చిక్కడంతో అతడి కష్టాలు తీరాయి. ఒకటీ రెండు కాదు ఏకంగా 29 చేపలు వలకు చిక్కాయి. మార్కెట్లో చేప విలువ 33 లక్షలు రూపాయలు. దీంతో రాత్రి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు. ఆ చేపకు ఎందుకంత రేటు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పులస చేప ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఎంత ధర పెట్టి కొనడానికి ఇష్టపడతారు. ఇక బెంగాలీ ప్రజల గురించి చెప్పనక్కర్లేదు. చేపలను అతిగా ఇష్టపడతారు కూడా. తెలియా భోలా చేప గురించి చెప్పనక్కర్లేదు. ఎంత ధర పెట్టయినా కొనుగోలు చేస్తారు. తాజాగా ఒడిషాలోని బాలాసోర్ ప్రాంతానికి చెందిన ఓ మత్య్సకారుడికి తెలియా భోలా చేపలు వలకు చిక్కాయి. ఇంకేముంది మార్కెట్లో వేలం వేయగా 33 లక్షలు వచ్చాయి.
దిఘా నదీ ముఖద్వారంలో వేటకు వెళ్లాడు ఓ జాలరి. అతడికి అదృష్టం వరించింది. ఏకంగా 29 అరుదైన, అత్యంత విలువైన తెలియా భోలా చేపలు వలకు పడ్డాయి. ఇంకోముంది రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఆయనొక్కడికే ఆ అదృష్టం వరించింది. ఒక్కో చేప 20 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంది. నదీ ముఖద్వారం సమీపంలోని చేపల వేలం కేంద్రంలో రూ.33 లక్షలకు అమ్ముడయ్యాయి.
మామూలు చేపలను మార్కెట్‌లో కొనుగోలు చేస్తాము. తెలియా భోలాని అలా కొనుగోలు ఛాన్స్ ఉండదు. అరుదుగా మత్యృకారులకు చిక్కుతాయి. వాటిని వేలం ద్వారా చాలామంది కొనుగోలు చేస్తారు. ఆ ఫిష్‌కు మార్కెట్లో డిమాండ్ అంతా ఇంతా కాదు. మార్కెట్లో కిలో 30 వేల పైమాటే.
ALSO READ: అడవినే దడ పుట్టంచిన ఆరోమెడ్ టైగర్ ఇక లేదు
ఏడాదికి రెండు లేదా మూడు మాత్రమే జాలారీలకు చిక్కుతాయి. లోతైన సముద్రంలో ఉంటాయని మత్స్యకారులు చెబుతారు. టెలియా భోలా చేప ఔషధాలకు కేరాఫ్ గా చెబుతారు. తీవ్రమైన వ్యాధులకు మందులు, సౌందర్య సాధనాల ఉత్పత్తికి వీటిని ఉపయోగిస్తారు. అందువల్లే ఈ చేపకు ఆ స్థాయి డిమాండ్ ఉంటుంది. వలకు చిక్కాలే గానీ మత్స్యకారులకు లాభదాయకమైన వేట.
తెలియా భోలా చేపల కోసం ఫార్మా కంపెనీలు ఎదురు చూస్తుంటాయి. బెంగాల్‌లో ఫార్మా కంపెనీల ప్రతినిధులు నిత్యం స్థానిక జాలర్లతో టచ్‌లో ఉంటారు. ఆ తరహా చేప చిక్కిందని తెలిస్తే చాలు వెంటనే వేలంలో పాల్గొంటారు. డబ్బులు ఉన్నా చేప దక్కుతుందనే గ్యారెంటీ ఉండదు. నిత్యం ఫార్మా కంపెనీలు వాటిని కొనుగోలు చేస్తారని చెబుతుంటారు.
తెలియా భోలా చేపకు చిన్న బెలూన్ మాదిరిగా ఉంటుంది. ఆ చేపకు అదే కీలకమైంది. అందులో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుంది. అత్యంత ఖరీదైన మందుల తయారీలో దాన్ని ఉపయోగిస్తారు. క్యాప్సూల్స్ పైన కవర్ ఉంటుంది. కడుపులోకి వెళ్లిన గంటల వ్యవధితో ఆ కవర్ కరిగిపోతుంది. అది సులభంగా జీర్ణం అయ్యేలా చేసేందుకు కీలకమైనది కొల్లాజెన్. మూడేళ్ల కిందట బెంగాల్‌లో 55 కేజీల తెలియా భోలా చేపను జాలారీలకు చిక్కింది. వేలం వేస్తే రూ.13 లక్షలకు అమ్ముడుపోయింది. ఓ విదేశీ కంపెనీ దాన్ని కొనుగోలు చేసింది.
#WATCH | Balasore: Fisherman catches 29 Telia Bhola fish, sells for Rs 33 lakh and becomes a millionaire overnight.#Odisha pic.twitter.com/vr6TQUncrd
— Kalinga TV (@Kalingatv) June 19, 2025