Viral Video: అసలే రోజులు సరిగా లేవు.. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. కూతురు ఏమైనా చేస్తే పరువు పోతుందని క్షణం క్షణం టెన్షన్ పడుతుంటారు. తాజాగా చెల్లి-ఆమె ప్రియుడితో కలిసి ఫాస్ట్‌ఫుడ్ టిఫిన్ చేయడం చూశాడు ఆమె అన్నయ్య. పట్టరాని కోపం చెల్లి-ప్రియుడిపై విరుచుకుపడ్డాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అసలేం మేటరేంటి?
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ప్రాంతంలో ఓ యువతి-తన ప్రియుడితో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి వచ్చింది. అయితే కొన్నాళ్లుగా ఆ యువతి వ్యవహారశైలిలో మార్పులు వచ్చాయి. దీంతో ఆమె కదలికలపై ఇంట్లోని కుటుంబ సభ్యులు కన్నేశారు. కూతురి వ్యవహారాల బాధ్యతను ఆమె అన్నయ్యకి అప్పగించారు తల్లిదండ్రులు. సోదరి ఎక్కడికి వెళ్తుందో అనేది ఫాలో చేయడం గమనించాడు.
సరిగ్గా బుధవారం రోజు యవతి, తన ప్రియుడితో కలిసి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి వచ్చింది. తినేందుకు ఏదో ఆఫర్ ఇచ్చారు. ఈలోగా తన ఫ్రెండ్స్‌తో యువతి అన్నయ్య అక్కడికి వచ్చాడు. యువతి సోదరుడ్ని చూసి ఆమె ప్రియుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దాడి చేశాడు.
వెంటనే బండి కిందపడేసి తొలుత చెల్లి జట్టు పట్టుకుని అన్నయ్య కొట్టాడు. చెల్లి జట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చే పని చేశాడు. ఆమె ప్రియుడు అస్సలు ఊరుకోలేదు. దాదాపు నిమిషం పాటు ఈ తతంగం జరిగింది. అక్కడ రోడ్డుకు ఇరువైపులా చాలామంది ఈ గొడవను చూస్తున్నారు.
ALSO READ: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుపరాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి
జరుగుతున్న బీభత్సాన్ని చూస్తూ ఉండిపోయారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. వారిలో ఓ వ్యక్తి ఈ గొడవను తన మొబైల్ ఫోన్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీనిపై నెటిజన్స్ ఎవరిని ఇష్టవచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.
చాలా మంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై తన చెల్లిని ఆమె అన్నయ్య ఈ విధంగా చేయడం కరెక్టు కాదని అంటున్నారు. దానివల్ల వారి పరువు పోయిందని అంటున్నారు. పరిస్థితి దాటిపోయినట్టు ఇలాంటి తప్పవని మరికొందరు మాట. ఇలా ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌కు నెటిజన్స్ నుంచి లైక్‌లు, వ్యూస్,కామెంట్లు వచ్చాయి.
చెల్లి, ఆమె ప్రియుడిపై దాడి చేసిన యువకుడు..
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దారుణ ఘటన
ఓ ఫుడ్ స్టాల్ లో ఓ యువతి, ఆమె ప్రియుడు చోలే బతురే తింటుండగా చూసిన అన్న
కోపంతో వారిపై దాడి
చెల్లి జుట్టు పట్టుకుని రోడ్డు మీద పడేసి విచక్షణారహితంగా కొట్టిన అన్న
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న… pic.twitter.com/VzkYdR9phf
— BIG TV Breaking News (@bigtvtelugu) August 7, 2025