Manchu Manoj-Mounika: ఫ్యామిలీ వ్యవహారాలతో వార్తల్లో నలుగుతున్నాడు మంచు మనోజ్. పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఆయన రూటు ఎటు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిత్ర పరిశ్రమలో కంటిన్యూ అవుతాడా? లేక రాజకీయాల వైపు అడుగులేస్తారా? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది.
గడిచిన రెండు వారాలుగా వార్తల్లో హంగామా చేస్తున్నాడు నటుడు మంచు మనోజ్. రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఫ్యామిలీ విషయాలు కాసేపు పక్కనబెడితే.. రాజకీయంగా బలపడేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాన్నతో విభేదాలు కారణంగా సొంతంగా బలపడాలని చూస్తున్నాడట. తనతోపాటు అత్తింటివారి ఇమేజ్‌ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాడట.
గడిచిన ఆరు నెలలుగా మంచు మనోజ్ రాజకీయాల్లోకి వెళ్తున్నాడంటూ వార్తలు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. సోమవారం ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు కావడంతో 1000 కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు స్కెచ్ వేశాడు. భూమా ఘాట్‌లో వారికి నివాళులు అర్పిండమేకాదు, రాజకీయాల్లో ఎంట్రీపై అక్కడి నుంచే ఓ ప్రకటన చేయబోతున్నాడట.
శోభా నాగిరెడ్డి జయంతి ఉత్సవాలు నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి భారీగా నేతలు, అభిమానులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలపై ప్రకటన చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాడట. ఇంతకీ మంచు మనోజ్-మౌనిక చూపు ఎటు వైపు ఉంది? టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ ఎటువైపు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: బాబు గారు మీ రు చేసిన మంచి పనులు ఇవే.. జగన్ చెప్పిన లిస్ట్ చూడండి
మౌనిక అక్క అఖిల ప్రియ ఎలాగూ టీడీపీలో ఉంది. మనోజ్ అన్న విష్ణు జగన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. బీజేపీతో మోహన్‌బాబు టచ్‌లో ఉన్నారు. ఇకపోతే జనసేన ఒక్కటి మాత్రమే మిగిలింది. మనోజ్ ఫ్యామిలీ నుంచి వెలువడుతున్న సంకేతాల మేరకు జనసేన వైపు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధినేత పవన్ కల్యాణ్‌తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.
మంచు మనోజ్ తొలి నుంచి పవన్ కల్యాణ్‌తో సన్నిహితంగా ఉన్నాడు. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ లేకపోలేదు. ఈ లెక్కన మనోజ్ దంపతులు భూమా ఘాట్ నుంచి రాజకీయ ప్రకటన చేయవచ్చని అంటున్నారు. అదే జరిగితే భూమా ఫ్యామిలీలో అక్కా-చెల్లెలు మధ్య పోరు తప్పదనే వాదన సైతం లేకపోలేదు.
మంచు మనోజ్ దంపతులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? రాజకీయంగా ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేన వైపు వెళ్తే అఖిలప్రియ వర్సెస్ మౌనిక అన్న ఫైట్ తప్పదని అంటున్నారు.
ఎందుకంటే భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ కంచుకోట. అలాకాకున్నా నంద్యాలపై ఫోకస్ చేయవచ్చని అంటున్నారు. రాజకీయ ప్రకటన తర్వాత, వారు చేసే సర్వీసును బట్టి ఏ నియోజకవర్గం అనేది డిసైడ్ అవుతుందని అంటున్నారు.