BigTV English

Guilty Devotee Temple: 55 సంవత్సరాల క్రితం గుడి వద్ద భక్తుడికి దొరికిన ధనం.. దొంగతనంగా ఆ ధనంతో ఎంత పనిచేశాడంటే..

Guilty Devotee Temple: 55 సంవత్సరాల క్రితం గుడి వద్ద భక్తుడికి దొరికిన ధనం.. దొంగతనంగా ఆ ధనంతో ఎంత పనిచేశాడంటే..

Guilty Devotee Temple| తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలోని నెరుంజిపేట్టై గ్రామంలో, అమ్మపేట్టై సమీపంలో ఉన్న చెల్లంది అమ్మన్ దేవాలయం ఒక పవిత్రమైన, శాంతియుతమైన స్థలం. దాదాపు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 55 సంవత్సరాల క్రితం ఒక యువ భక్తుడు సందర్శించాడు. ఆ రోజు, ఆలయంలో సాంబ్రాణి సుగంధం, గంటల శబ్దం, భక్తుల ప్రార్థనలు నిండి ఉన్నాయి. ఆ భక్తుడు ఆలయ ప్రాంగణంలో చెప్పులు లేకుండా నడుస్తూ ఉండగా.. అతడికి ఒక రూ.2 నోటు కనిపించింది. అప్పట్లో రూ.2 అంటే తక్కువ డబ్బులు కాదు.


అయినా ఆ నోటు ఎవరిదో తెలుసుకోవడానికి ఆ భక్తుడు చూశాడు. ఎవరూ దాని కోసం వెతుకుతున్నట్లు కనిపించలేదు. ఆలయ సిబ్బందికి ఇచ్చి, దాని యజమాని వస్తే తిరిగి ఇచ్చేయాలని ఆలోచించాడు. కానీ తరువాత మనసు మార్చుకున్నాడు. బదులుగా, ఆ నోటును తన వద్దనే ఉంచుకున్నాడు. అది తప్పు అని తెలిసినా.. ఆ సమయం అతను అదే సరైనదని భావించాడు. ఆ తరువాత రోజులు, సంవత్సరాలు గడిచాయి. కానీ ఆ చిన్న సంఘటన ఆ భక్తుడి మనసులో మిగిలిపోయింది. రూ.2 అనేది 1970లలో పెద్ద మొత్తం కాదు, కానీ ఆలయంలో చేసిన ఆ చిన్న తప్పు అతని మనస్సాక్షిని కదిలించింది. ఆ రూ.2 నోటు అలా తీసుకోవడం తప్పు అతని లోలోపల అపరాధ భావన కలిగింది. సంవత్సరాలు గడిచినా, ఆ అపరాధ భావన మాత్రం అతనిలో అలాగే ఉండిపోయింది.

కాలం గడిచింది. ఆలయం పాతబడినా, భక్తుల విశ్వాసంతో ఇప్పటికీ బలంగా నిలిచింది. ఆ భక్తుడికి కూడా వయసు మీరింది. కానీ గతంలోని ఆ చిన్న జ్ఞాపకం ఎప్పటికీ మనసులో ఉండిపోయింది. అందుకే ఆ భక్తుడు ఈ అపరాధ భావన నుంచి విముక్తి పొందాలనుకున్నాడు.


55 సంవత్సరాల తర్వాత, ఆ భక్తుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలే ఒక శుక్రవారం ఉదయం, ఆలయ సిబ్బంది హుండీలను తెరిచి, భక్తులు సమర్పించిన నోట్లను, నాణేలను లెక్కించడం ప్రారంభించారు. ఆలయ సిబ్బంది, అధికారులు.. ఒక హుండీలో వారు ఒక తెల్లని కవరును కనుగొన్నారు.

ఆ కవరులో అన్నీ రూ.500 నోట్లున్నాయి. ఆ మొత్తం రూ.10,000గా ఉన్నట్లు ఆలయ సిబ్బంది గుర్తించారు. అందులో ఒక లేఖ కూడా ఉంది. ఆ లేఖలో ఆ భక్తుడు తన 55 సంవత్సరాల రహస్యాన్ని బయటపెట్టాడు. “55 సంవత్సరాల క్రితం ఆలయంలో రూ.2 నోటు కనిపించింది. దాని యజమానిని కనుగొనలేకపోయాను. ఏం చేయాలో తెలియక ఆ నోటును తీసుకున్నాను. ఆ సంఘటన నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. ఇప్పుడు, నా తప్పును సరిదిద్దడానికి ఈ రూ.10,000 ను ఆలయ హుండీలో సమర్పిస్తున్నాను.” అని ఆ భక్తుడు లేఖలో రాశాడు.

Also Read: అనంత విశ్వంలో మరో భూ గ్రహం.. 154 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త సూపర్-ఎర్త్

ఈ లేఖలో పేరు, చిరునామా ఏమీ లేవు. కేవలం నిజాయితీ మాత్రమే. 1970లో రూ.2 నోటు ఇప్పుడు ద్రవ్యోల్బణం ఆధారంగా ఆ ధనం మారక విలువ వస్తువులు కొనగోలు రూపంలో పోల్చి చూస్తే.. ఇప్పుడు దాని విలువు రూ.102గా ఉంది. కానీ ఆ భక్తుడు ఏకంగా రూ.10,000 సమర్పించుకున్నాడు. బహుశా ఆ డబ్బు కంటే, మనసు ప్రశాంతతకే అతను ప్రాధాన్యమిచ్చాడు. ఈ భక్తుడు ఎవరో ఎవరికీ తెలియదు. ఒక పురుషుడో లేక మహిళో స్పష్టత లేదు.

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×