Prabhas:సాధారణంగా అభిమానులు తమ అభిమాన నటీనటుల కోసం చూపించే అభిమానానికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ అభిమానం పీక్స్ కి వెళ్ళిపోయి చూసేవారికి పిచ్చి లాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పై పంజాబ్ రాష్ట్రంలోని ప్రజలు చూపించిన ప్రేమకు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసి మిగతా సినీ ప్రేమికులు ఇదెక్కడి అభిమానం రా బాబు అంటూ ఇంతగా కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రభాస్ పై పంజాబ్ ప్రజలు ఏ రేంజ్ లో తమ అభిమానాన్ని చాటుకున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
పంజాబ్ లో ప్రభాస్ పై అలాంటి ప్రేమ కనబరిచిన ఫ్యాన్స్..
పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గురించి, ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని భాషలలో కూడా ఫాలోయింగ్ ఉన్న నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఎంతమంది పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగినా.. ప్రభాస్ క్రేజ్ మాత్రం ప్రత్యేకమైనదనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన ఇమేజ్ ఇప్పుడు దేశాలు కూడా దాటిపోయింది. చైనా, జపాన్ వంటి దేశాలలో ప్రభాస్ పెద్ద స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఆ దేశాలలో కూడా ఈయనకు డై హార్డ్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పంజాబ్లో ఆయన ఫాలోయింగ్ మరొకసారి బయటపడింది. పంజాబ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో హైవేని ఆనుకొని ఉన్న గోడంతా కూడా ప్రభాస్ సినిమా పోస్టర్లతో నిండిపోయింది. ప్రభాస్ నటించిన మొదటి సినిమా ‘ఈశ్వర్’ మొదలుకొని ఇటీవల వచ్చిన ‘కల్కి’ వరకు అన్ని సినిమాల పోస్టర్లను ఒక ఆర్డర్లో అతికించి, పంజాబ్ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పంజాబ్ అభిమానుల ప్రేమకు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా..
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పోస్టర్లన్నీ కూడా తెలుగులో ఉండడం గమనార్హం ఎందుకంటే ప్రభాస్ నటించిన చాలా సినిమాలు హిందీలో రిలీజ్ కాలేదు. ‘బాహుబలి’ నుంచే ఆయనకు ఫ్యాన్స్ బాలీవుడ్ లో ఏర్పడ్డారు. ఈ పోస్టర్లపై “ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ పంజాబ్ “అంటూ రాశారు. ఇది చూసి టాలీవుడ్ అంతా కూడా షాక్ అవుతోంది. ప్రభాస్ కు పంజాబ్లో ఈ రేంజ్ లో అభిమానులు ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు అక్కడ కూడా ఫాన్స్ అసోసియేషన్లు ఏర్పడ్డాయా ? అందులోనూ ఒక టాలీవుడ్ హీరోకి ఈ రేంజ్ లో అభిమానం ఏంటి ? అంటూ ఇక్కడి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం . అయితే ఈ పోస్టర్స్ ఇప్పుడు వేసినవి కాదు.. 2018 లో వేసినవి. అయితే ఇప్పుడు ఆ వీడియోని సదరు ప్రభాస్ అభిమానులు వైరల్ చేయడంతో ఈ విషయం మళ్ళీ వార్తల్లో నిలిచినట్లు తెలుస్తోంది.
నార్త్ లో పెరిగిపోతున్న టాలీవుడ్ హీరోల హవా..
ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ కు మాత్రమే ఈ క్రేజ్ లభించలేదు. దీనికంటే ముందు నటసింహ బాలకృష్ణ (Balakrishna) కి కూడా ఈ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో బాలకృష్ణ క్రేజ్ బయటపడింది. నార్త్ బస్సులకు బాలయ్య ‘అఖండ’ పోస్టర్లు అంటించి, నార్త్ అభిమానులంతా కూడా బాలయ్య పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఉత్తరాది రాష్ట్రాలలో టాలీవుడ్ హీరోలకు ఏ రేంజ్ లో గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు.
also read:Nayanthara: విడాకుల వార్తలపై స్పందించిన నయనతార.. ఆ గుడిలో ప్రత్యేక పూజలు!
LPU Punjab Prabhas Fans 🤗👌🔥
Throw Back 2017 400 Feet Flexy 🤗🔥♥️
#2018 More Then 400+ Flexy Loading..! 👐😇#RebelstarBirthdayCDP#RebelstarBirthdayMonth #Prabhas #Saaho #Prabhas20 😊🤗 pic.twitter.com/Y4ImZZvKtN— 𝐑𝐚𝐣 𝐒𝐡𝐢𝐯𝐚 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 (@ImRajShiva) October 21, 2018