యువకులు మద్యానికి బానిసై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పీకలదాకా తాడి రోడ్ల మీద వీరంగం వేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని ఢీకొట్టడంతో పాటు అడ్డుకున్న వారి మీదకి బండి ఎక్కించేస్తున్నారు. తాజాగా ఓ తాగుబోతు బ్యాచ్ ను నిలదీసిన మహిళను కారుతో ఢీకొట్టడంతో పాటు బానెట్ మీద పడిన ఆమెను ఏకంగా కిలో మీటరు పాటు అలాగే తీసుకెళ్లారు. కారు వేగం తగ్గగానే సరదు మహిళ దూకి ప్రాణాలు కాపాడుకుంది. హర్యానాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా సోనిపట్ లో కొంత మంది యువకులు పట్టపగలే పీలకదాకా తాగారు. కన్నూమిన్నూ ఎరగని స్థితికి చేరుకున్నారు. తాగుబోతు బ్యాచ్ అంతా కారెక్కి రోడ్డు మీద అడ్డగోలుగా నడుపుకుంటూ వచ్చారు. రాంగ్ రూట్ స్పీడ్ గా దూసుకొచ్చారు. కొన్ని బండ్లను ఢీకొట్టడంతో కొంత మంది ఆ కారుపై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. అయినప్పటికీ ఆపకుండా ముందుకు వెళ్లారు. ఎదురుగా బైక్ మీద వస్తున్న మహిళను ఢీకొట్టారు. సదరు మహిళ ఆ కారు ముందు నిలబడి కారులోని వారితో గొడవకు దిగింది. అప్పటికే కొంతమంది ఆ కారు చుట్టూ మూగారు. వెంటనే కారు నడుపుతున్న యువకుడు ఎదురుగా ఉన్న మహిళను ఢీకొట్టాడు. ఆమె కారు బానెట్ మీద పడిపోయింది.
బానెట్ మీద మహిళ.. కిలో మీటర్ దూరం దూసుకెళ్లిన కారు
కారు బానెట్ మీద పడిపోయిన మహిళను దింపి పక్కన ఉంచి వెళ్లాల్సింది పోయి… ఆమెను అలాగే ఉంచి కారును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. సదరు మహిళ అలాగే కిలో మీటర్ దూరం వరకు తీసుకుపోయారు. ఆ తర్వాత కారు స్లో కావడంతో ఆమె కిందికి దూకి ప్రాణాలు కాపాడుకుంది. ఈ ఘటనలో సదరు మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. రాంగ్ రూట్ లో వచ్చిన కారు, ఏకంగా ఫుట్ పాత్ మీదికి ఎక్కింది. ఆ కారును ఆపేందుకు కొంత మంది ప్రయత్నించినా, కారులోని వాళ్లు మహిళ కారు మీద ఉండగానే వేగంగా ముందుకు నడిపి పారిపోయారు. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
https://twitter.com/vinaysaxenaj/status/1899419226148073905
Read Also: పాపం.. విమానం దిగే వరకు ఉగ్గబెట్టుకుని కూర్చున్న ప్రయాణీకులు.. అసలు ఏమైంది?
పలువురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
అటు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారులోని వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సదరు మహిళ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది. నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అటు ఈ ఘటనపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గాయపడిన మహిళ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Read Also: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని బైకులకు నిప్పు, మరీ ఇంత ఘోరమా?
Read Also: రంగు రాసి ముద్దు పెట్టబోయిన ప్రియుడు.. రెప్పపాటులో దవడ పగుల్స్!