మ, విరహం, విడాకులు వంటివన్నీ కూడా మానసిక వేదనను కలిగించేవి. చాలామంది ప్రేమలో విఫలమైతే చాలు.. చేతిలో మందు బాటిల్ పట్టుకుంటారు. అలాగే ఓ వ్యక్తి తన భార్య నుండి విడాకులు తీసుకున్నాక మానసిక వేదనకు గురయ్యాడు. ఆ బాధతో బీరు మాత్రమే తాగడం మొదలుపెట్టాడు. చివరికి ఏమయ్యాడో తెలుసుకోండి.
కొంతమంది మనసులో బాధను తగ్గించుకోవడానికి మద్యం తాగుతారు. మరికొందరు మాత్రం ప్రతిరోజు తాగడం ఒక అలవాటుగా మార్చుకుంటారు. అలాంటి వారు కూడా ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. తాగుడుకు విపరీతంగా బానిస అవడం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయో కూడా అర్థం చేసుకోవాలి. జీవితాన్ని చేజేతులాన్ని నాశనం చేసుకోకూడదు.
నెల రోజుల పాటూ బీరు తాగుతూ ఉంటే
థాయిలాండ్ కు చెందిన తవీసక్ 44 ఏళ్ళు. అతడికి, తన భార్యకు కొన్నేళ్లుగా గొడవలు అవుతున్నాయి. దీంతో పరిస్థితి విడాకులు తీసుకునేదాకా వచ్చింది. తవీసక్ ఆ విడాకుల బాధను మర్చిపోలేకపోయాడు. దీంతో ఆహారం తినడం మానేశాడు. నిత్యం బీరు తాగుతూ ఉండేవాడు. అలాగే నీళ్లు తాగడం కూడా తగ్గించేసాడు. దీనివల్ల అతని ఆరోగ్యం చాలా క్షీణించింది. నెలరోజుల పాటు పూర్తిగా బీరు పైనే ఆధారపడ్డాడు. చివరికి ఒకరోజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతని వద్ద 16 ఏళ్ల కొడుకు మాత్రమే ఉన్నాడు. ఆ పిల్లాడు తన తండ్రి పరిస్థితిని చూసి అంబులెన్స్ కు కాల్ చేశాడు.
వంద సీసాలు
అంబులెన్స్ ఇంటికి చేరే సరికి తవీసక్ కాళ్లు నీలం రంగులోకి మారిపోయాయి. అతడిని చూసి వచ్చిన వైద్య బృందం కూడా ఆశ్చర్యపోయారు. అతని కొడుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతని కొడుకు చెప్పిన ప్రకారం నెలరోజుల నుంచి తవీసక్ భోజనమే ముట్టుకోవడం లేదు. తన కొడుకు వండి పెడుతున్నా కూడా భోజనం తినేందుకు ఒప్పుకునేవాడు కాదు. నిత్యం మద్యం తాగేవాడు. అతని గదిలో వందకి పైగా ఖాళీ బీరు సీసాలు దొరికాయి. అవి కూడా ఒక క్రమ పద్ధతిలో అందంగా అమర్చి ఉన్నాయి. వైద్య బృందం తవీసక్ పరిస్థితిని చూశారు. అప్పటికే అతడు మరణించినట్టు గుర్తించారు. అదే విషయాన్ని కొడుకుకి చెప్పారు. తన భార్యతో విడాకులు విషయం అతడిని తాగుడుకు బానిస అయ్యేలా చేసిందని, తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యాడని గుర్తించారు. దీనివల్ల నిత్యం తాగుతూ ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడని వైద్య బృందం నిర్ధారించారు.
నిత్యం నెల రోజులపాటు కేవలం బీరు మీదే బతకడం వల్ల అతని ఆరోగ్యం త్వరగా క్షీణించింది. బీరులో ఉండే ఆల్కహాల్ జీర్ణవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఎన్నో గ్యాస్టిక్ సమస్యలకు కారణం అవుతుంది. అలాగే నిద్రలేమి సమస్య కూడా అధికమైపోతుంది. బీరు తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. ఎందుకంటే బీరు తాగాక విపరీతంగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. తవీసక్ బీరు తాగడంతో పాటు నీటిని, భోజనాన్ని తీసుకునేందుకు పూర్తిగా నిరాకరించాడు. దీంతో అతను శరీరం అధిక స్థాయిలో డిహైడ్రేషన్ కి గురైంది.
అధికంగా బీరు తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం విపరీతంగా పెరుగుతుంది. తనీసక్ కేవలం బీరు మీదే జీవించడం వల్ల అతడు రక్తపోటు కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కార్డియోమయోపతి వంటి సమస్యలు కూడా వచ్చే ఉండవచ్చు. అలాగే కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. తవీసక్ మరణానికి వీటిలో ఏది కారణమో తెలియదు.. కానీ నెల రోజులు పాటు కేవలం బీరు మీదే జీవించడం వల్ల అతడు తన ప్రాణాలను కోల్పోయాడు.
రోజూ ఒక గ్లాస్ కు మించి బీరు తాగితే అది శరీరానికి తీవ్ర హాని చేస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక బీరు వినియోగం అనేది శరీరాన్ని పూర్తిగా కృశించిపోయేలా చేస్తుంది. మరణానికి దగ్గర చేస్తుంది.