BigTV English
Advertisement

Liver Health: కాలేయం చెడిపోతే మన పాదాలు ఆ విషయాన్ని చెబుతాయి.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Liver Health: కాలేయం చెడిపోతే మన పాదాలు ఆ విషయాన్ని చెబుతాయి.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

శరీరంలో 500కు పైగా విధులు చేసే ఒకే ఒక్క అవయవం కాలేయం. అందుకే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దాని ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కొన్ని ముందస్తు సంకేతాలు కనబడతాయి. కాబట్టి ఆ సంకేతాలపై ముందుగా అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా కాలేయం ఆరోగ్యంగా లేకపోతే పాదాలలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇలా కనిపించే లక్షణాలు మీ కాలేయం అనారోగ్యంగా ఉందని చెబుతాయి. కాబట్టి పాదాలలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే కాలేయం ప్రమాదంలో ఉందో తెలుసుకోండి.


కాలేయం శరీరంలో నిర్విషీకరణ జీవక్రియలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోతే ఆ ప్రభావం మొత్తం శరీరం పైనే కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధుల బారిన మనం పడబోతున్నామని చెప్పే సంకేతం. కాబట్టి పాదాలలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే కాలేయం అనారోగ్యంగా ఉందని అర్థం చేసుకోవాలో తెలుసుకోండి.

వాచిపోయిన పాదాలు
కాలేయం దెబ్బతిన్నప్పుడు లేదా సిర్రోసిస్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఇది శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అంటే రక్తంలో ప్రోటీన్ స్థాయి తగ్గిపోతుంది. దీనివల్ల పాదాలలో ద్రవం పేరుకు పోతుంది. అలాగే చీలమండలు, పాదాలు వాచినట్టు కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే కాలేయం పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది.


చర్మం దురద
కాలేయం ఆరోగ్యంగా లేకపోతే పిత్తాన్ని సరిగ్గా బయటికి పంపించలేదు. దీనివల్ల శరీరంలో పిత్తం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల చర్మం ఎంతో ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా చర్మంపై దురద వస్తుంది. పాదాలు, అరచేతులలో విపరీతంగా చర్మం దురద పెడుతూ ఉంటే అది కాలేయ సమస్య వల్లనేమో అని అనుమానించాలి.

తిమ్మిరి పట్టడం
కాలేయ సంబంధిత సమస్యల వల్ల నాడీ వ్యవస్థ కూడా ఎంతో ప్రభావితం అవుతుంది. ఇది కాళ్లలో తిమ్మిరికి, మంటకు, జలదరింపుకు కారణం అవుతుంది. అలాగే కాళ్లలో సూదితో గుచ్చుతున్నట్టు అనుభూతి కలుగుతుంది. దీనికి కారణం కాలేయ అనారోగ్యం కావచ్చు. కాబట్టి వైద్యులను సంప్రదించి కాలేయ పరీక్షలను చేయించుకోవాలి.

చర్మం గోళ్లు రంగు మారడం
చర్మం, కాలి గోళ్ళు, చేతుల గోళ్ళు రంగు మారినట్టు అనిపించినా పసుపురంగులోకి మారినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే కామెర్లు సోకితే బిలిరుబిన్ అని పిలిచే పిగ్మెంట్ ఉత్పత్తి పెరిగిపోతుంది. దీనివల్లే చర్మం కాలిగోళ్ళు, చేతిగోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. ఇలా మారాయంటే కాలేయం అనారోగ్యంగా ఉందని అర్థం చేసుకోవాలి.

అలసట, బలహీనత
కాళ్ళల్లో తీవ్రంగా, బలహీనంగా అనిపిస్తున్నా లేదా కాళ్లు అలసిపోయినట్టు అనిపిస్తున్నా కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నా అది కాలేయ వ్యాధి వల్ల కావచ్చని అనుమానించాలి. ఎందుకంటే దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు కండరాల బలహీనతకు కారణం అవుతాయి. కొంచెం దూరం నడిచినా అలసిపోయినట్లు అనిపించేలా చేస్తాయి. అలాగే కాలంలో తిమ్మిరిగా అనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే కాలేయ ఆరోగ్యం గురించి పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులను తప్పనిసరిగా కలిసి తగిన చికిత్సను తీసుకోవాలి.

Related News

Dosakaya Pachadi: దోసకాయ కాల్చి ఇలా రోటి పచ్చడి చేశారంటే అదిరిపోతుంది

Most Dangerous Foods: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు.. సరిగ్గా వండకపోతే ప్రాణాలకే ప్రమాదం !

Omelette Vs Boiled Egg: ఎగ్స్ Vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది తింటే బెటర్ ?

Saliva Test: ఏంటి నిజమా? లాలాజలంతో గుండె పనితీరు గుర్తించొచ్చా..! అదెలా ?

Tips For Hair: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. జరిగేది ఇదే ?

Heart Health:గుండె జబ్బులు ఉన్నాయని తెలిపే.. సంకేతాలు ఇవేనట !

Fruits For Weight loss: బరువు తగ్గాలనుకునే వారు.. ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ?

Big Stories

×