BigTV English

He Teams : మగజాతి రక్షణ కోసం ఉద్యమం.. హైదరాబాద్‌లో ధర్నా..

He Teams : మగజాతి రక్షణ కోసం ఉద్యమం.. హైదరాబాద్‌లో ధర్నా..

He Teams : షీ టీమ్స్ తరహాలోనే HE TEAMS ఏర్పాటు చెయ్యాలని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. ఆర్జే శేఖర్ భాషాతో పాటు పలువురు అడ్వకేట్లు, భార్యా బాధిత సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. మగవారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మహిళలు మగవారిని అనవసరంగా అనేక కేసుల్లో ఇరికించి వేధిస్తు్న్నారని మండిపడ్డారు. మహిళల చేతుల్లో మోసపోతున్న మగవారికి న్యాయం జరగాలని కోరారు. అందుకు He Teams ఏర్పాటు దోహద పడుతుందని వారంతా అభిప్రాయపడ్డారు. ఇదీ మేటర్.


అందాల రాక్షసి! మగవారి పాలిట పిశాచి!!

మగవారి కోసం హీ టీమ్స్. కాస్త విడ్డూరంగా ప్రస్తుత రోజుల్లో ఇది ఎంతో అవసరమనేది చాలామంది మగవారి డిమాండ్. పరిస్థితులు అలా మారిపోయాయి మరి. ఇటీవల మగవారిపై దారుణాలు బాగా పెరిగిపోయాయి. భర్తను చంపిన భార్య అనే న్యూస్ రెగ్యులర్‌గా చూస్తున్నాం. ఇటీవల మీరట్‌లో లవర్‌తో కలిసి భర్తను చంపి, ముక్కలుగా నరికి, డ్రమ్ములో కాంక్రీట్ వేసి పూడ్చేసిన ఘటన యావత్ దేశాన్ని షేక్ చేసింది. లేటెస్ట్‌గా తెలంగాణలో భర్త, పిల్లలను చంపేందుకు పెరుగన్నంలో విషం కలిపి పెట్టిందో కిరాతకురాలు. ఆ పెరుగన్నం తిని ముగ్గురు పిల్లలు చనిపోయారు. పెరుగన్నం తిననందు వల్ల ఆ భర్త బతికి పోయాడు. ఇక అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్యల కేసులో తెలుగు రాష్ట్రాల్లోనే అనేకం ఉన్నాయి. ఇక కట్నం కోసం వేధిస్తున్నాడంటూ భర్త, అత్తింటి వాళ్లపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడం ఎప్పటినుంచో ఉంది. 498A కేసు భార్యల పాలిట బ్రహ్మాస్త్రం.


మగజాతికి రక్షణేది?

ఇటీవల నార్త్ ఇండియాలో.. భార్య వేధింపులు తట్టుకోలేక సెల్ఫీ సూసైడ్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉదంతం సంచలనంగా నిలిచింది. లేటెస్ట్‌గా 80వేల కోట్ల విలువైన స్టార్టప్ కంపెనీకి ఓనరైన ఓ ఎన్నారై బిలియనీర్‌ను అతని భార్య భరణం కోసం మూడు దేశాల్లోని కోర్టుల్లో ఎలా ముప్పుతిప్పలు పెడుతోందో తెలిసి అంతా షాక్ అవుతున్నారు. వేల కోట్ల ఆస్తులున్నా.. నీకు వైఫ్ టార్చర్ తప్పలేదు బ్రో అంటూ సోషల్ మీడియాలో ఆ భార్యా బాధితుడికి సపోర్ట్‌గా మగజాతి మొత్తం ఏకమవుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే వందలు, వేలల్లో కేసులు ఉంటాయి. బయలకు రాని దారుణాలు అంతకుమించి ఉంటాయి. పెళ్లైన కేసులే కాదు.. ప్రేమ పేరుతో మోసం చేసే యువతుల సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంటారు. అందుకే, మగవారు సూసైడ్ చేసుకునే సంఘటనలు బాగా పెరుగుతున్నాయి. అందుకే, ఆడవారితో పాటు మగవారికీ న్యాయం కావాలనే నినాదాలు పెరిగిపోతున్నాయి. He Teams ఏర్పాటు చేయాలనే ఆర్జే శేఖర్‌భాషా డిమాండ్ సమంజసమే అనిపిస్తోంది.

Also Read : అలేఖ్యకు జైలు శిక్ష? ఎన్ని ఏళ్లు అంటే..?

భార్యా బాధితుల సంఘానికి ఫుల్ డిమాండ్

భార్యా బాధితుల సంఘం. ఇలాంటిది ఒక్కటి ఉందని ఎంతమందికి తెలుసు? నిజంగానే ఉంది. హైదరాబాద్, చిక్కడపల్లిలో చాలా ఏళ్ల నుంచి ఆఫీస్ కూడా నడుస్తోంది. అందులో సభ్యులంతా భార్యా బాధిత భర్తలే. ప్రముఖ న్యాయవాదులు ఈ సంఘాన్ని లీడ్ చేస్తున్నారు. భార్య చేతిలో మోసపోయిన, వేధింపులకు గురవుతున్న భర్తలకు కౌన్సిలింగ్, సలహాలు, న్యాయ సూచనల కోసం ఈ సంఘం నిర్విరామంగా కృషి చేస్తోంది. అందులో వేలాది మంది సభ్యులు ఉన్నారంటే నమ్మాల్సిందే. ప్రతీవారం పదుల సంఖ్యలో భార్యా బాధిత సంఘంను ఆశ్రయిస్తుంటారట. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందట. గూగుల్‌లో సెర్చ్ చేయండం ఈ సంఘం డీటైల్స్ తెలుస్తాయి.

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×