Vani Ganapathy: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద లోక నాయకుడిగా పేరు సొంతం చేసుకున్న కమలహాసన్ (Kamal Haasan) కెరియర్ పరంగా ఉన్నత స్థానం అనుభవించారు. కానీ వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సాగర సంగమం, స్వాతిముత్యం, దశావతారం లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ లెజెండ్రీ యాక్టర్.. ప్రముఖ క్లాసికల్ డాన్సర్ వాణీ గణపతి(Vani Ganapathy) తో పెళ్లి తర్వాత వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే ఆ సమయంలో తాను ఆర్థికంగా నష్టపోయానని కమల్ హాసన్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
HE TEAMS : ఆడవాళ్ల నుంచి మగవాళ్లను కాపాడండి… రోడ్డెక్కి పోరాడుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్
కమలహాసన్ అలాంటివాడు – వాణీ గణపతి
ముఖ్యంగా 2015లో కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని..”నేను.. నా మాజీ భార్య వాణీ గణపతికి విడాకుల ఇచ్చిన తర్వాత భరణం చెల్లించడం వల్ల నేను ఆర్థికంగా చితికిపోయాను. దివాలా తీశాను” అంటూ చెప్పాడు. అయితే ఈ మాటలు అప్పట్లో పెద్ద దుమారం సృష్టించాయి. ఇక ఈ విషయంపై 28 ఏళ్ళు సైలెంట్ గా ఉన్న వాణీ గణపతి తాజాగా స్పందిస్తూ అసలు విషయంపై క్లారిటీ ఇచ్చింది. వాణి గణపతి మాట్లాడుతూ..” నేను, కమల్ హాసన్ విడిపోయి 28 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం ఇష్టం లేక నేను ఎన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను. అయితే కమల్ హాసన్ మాత్రం ఇంకా ఆ పాత విషయాలను పట్టుకొని వేలాడుతున్నాడు. వాడిన వస్తువులు కూడా ఇవ్వడానికి ఇష్టపడని వ్యక్తి. నాకు భరణం ఇచ్చి దివాలా తీశాడు అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ప్రపంచంలో ఏ కోర్టు అయినా సరే భరణం వల్ల ఒక వ్యక్తి దివాలా తీసేలా తీర్పు ఇస్తుందా? అతని మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. కనీసం మేమిద్దరం విడిపోయేటప్పుడు ఇంట్లో వాడిన పాత సామాన్లు కూడా నాకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. నేను ఆ బంధం నుంచి బయటకు వచ్చినప్పుడు అతడు ఈగో హర్ట్ అయి ఉండొచ్చు. అందుకే ఇలా సింపుల్ గా ఆర్థిక ఇబ్బందులను చెప్పి వదిలేయకుండా నాపై నింద వేస్తున్నాడు. ఇది ఏ మాత్రం సరికాదు” అంటూ వాణీ గణపతి చెప్పుకొచ్చింది.
కమలహాసన్ మాయగాడు – వాణీ గణపతి.
ఇంకా కమలహాసన్ గురించి మాట్లాడుతూ.. కమల్ హాసన్ ఒక మాయగాడు. ఎలాంటి వివాదాన్ని అయినా సరే డీల్ చేస్తాడు. ముఖ్యంగా అతనికి సమాధానం చెప్పాలని లేకపోతే.. ఆ ప్రశ్నకు అస్సలు సమాధానం చెప్పకూడదు అనుకున్నప్పును నవ్వుతూనే , మాటలతో మాయ చేసి ఎలాంటి పరిస్థితి నుంచి అయినా సరే ఈజీగా బయటపడతాడు అంటూ తెలిపింది. మొత్తానికైతే ఇతడు మోసగాడే కాదు మాయగాడు , పిసినారి కూడా అంటూ వాణీ గణపతి ఇండైరెక్టుగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . ఇకపోతే కమలహాసన్ వాణీ గణపతి నుంచి విడిపోయిన తర్వాత సారిక తో డేటింగ్ మొదలుపెట్టి శృతిహాసన్ , అక్షరాహాసన్ అనే ఇద్దరు అమ్మాయిలకు కూడా జన్మనిచ్చారు. ప్రస్తుతం కమలహాసన్ – మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.